'ఆచార్య' ఆర్థిక భారాన్ని క్లియర్ చేసుకుంటున్నారా..?
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. టాలీవుడ్ లోనే అతి పెద్ద పరాజయంగా నిలిచింది.
మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడంతో 'ఆచార్య' ను భారీ రేట్లకు కొనుగోలు చేశారు. దర్శకుడు కొరటాల ఈ బిజినెస్ డీల్స్ చేసినట్లు టాక్. అయితే ఈ చిత్రం ప్లాప్ అవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు.
అయితే 'ఆచార్య' వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలని మేకర్స్ ముందుకొచ్చారు. కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించుకున్నారు. బయ్యర్లకు చెల్లించాల్సిన ఫైనల్ సెటిల్మెంట్ రూ. 30 - 33 కోట్ల వరకూ తేలిందని టాక్ వినిపిస్తోంది.
కొరటాల శివ టీమ్ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు కొంత అమౌంట్ తిరిగి ఇచ్చారట. ఇటీవలే సమ్మర్ వెకేషన్ నుంచి వచ్చిన చిరంజీవి.. దీని గురించి దర్శకుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారట. తమ తదుపరి ప్రాజెక్ట్స్ బిజినెస్ పై 'ఆచార్య' ఎఫెక్ట్ పడకుండా.. వీలైనంత త్వరగా ఈ భారాన్ని తొలగించుకోవాలని దర్శక హీరోలు భావిస్తున్నారట.
'ఆచార్య' సినిమాకు ఎవరూ రెమ్యూనరేషన్స్ తీసుకోలేదని మేకర్స్ ప్రకటించారు. అయితే ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ ను కూడా దర్శక హీరోలు వెనక్కి ఇచ్చేసారట. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి జీఎస్టీ ఖర్చులను భరించడానికి అంగీకరించారట.
కొరటాల శివ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జూలై నెలాఖరున లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ సినిమాని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఆలోపు 'ఆచార్య' ఒత్తిడి అంతా క్లియర్ చేసుకోవాలి కొరటాల భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆచార్య రిలీజ్ తర్వాత చిరంజీవి హాలిడే కోసం విదేశాలకు వెళ్ళడంతో ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పుడు తిరిగి షూటింగ్ షెడ్యూల్స్ రీస్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'గాడ్ ఫాదర్' 'భోళా శంకర్' సినిమాలతో పాటుగా 'వాల్తేరు వీరయ్య' చిత్రాలను చిరు పూర్తి చేయనున్నారు.