నేను మిష్టర్ పర్ఫెక్ట్ కాదంటున్నుడు

Update: 2016-12-11 07:01 GMT
ఇండియన్ మూవీస్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఎవరు అంటే.. దేశం మొత్తంలో ఏ సినిమా అభిమాని అయినా చెప్పే సమాధానం.. ఆమిర్ ఖాన్ అనే. ఒక పాత్ర కోసం కానీ.. ఒక సినిమా కోసం కానీ.. ఓ సన్నివేశం కానీ.. ఆ చిత్రం ప్రమోషన్స్ కోసం కానీ.. ఇలా ఏ యాంగిల్ లో చూసినా.. ఆమిర్ పడే తాపత్రయం అతడిని మిస్టర్ పర్ఫెక్ట్ చేసేసింది. కానీ ఈయన మాత్రం తాను ఆ టైటిల్ కి అర్హత గలవాడిని కాదంటున్నాడు.

'మిస్టర్ పర్ఫెక్ట్ కి నేను సూట్ కానని అనుకుంటా. ఎందుకంటే.. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇంకెవరూ చేయలేని స్థాయిలో ఉండాలి. కానీ నాలా చేసేవాళ్లు చాలామందే ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చేవాళ్లు చాలామందే కనిపిస్తారు. అందుకే నేను మిస్టర్ పర్ఫెక్ట్ ని కాదు.. మిస్టర్ ప్యాషనేట్ ని అనుకుంటూ ఉంటాను. ఎవరికీ డిఫరెంట్ గా నేనేమీ చేయడం లేదు. నేను కేవలం ప్రతీ సన్నివేశం పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటానంతే' అని చెబుతున్నాడు ఆమిర్ ఖాన్.

క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 23న విడుదలయ్యే దంగల్ కోసం ఎన్నో రకాలుగా కష్టాపడ్డావుగా ఆమిర్ అంటే.. 'ఏ సీన్ చిత్రీకరణలో అయినా.. చాలా సమస్యలొస్తాయి. నేను టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టను. ఆ సీన్ నా అభిమానుల మనసుకు హత్తుకునేలా వారికి నచ్చేలా ఉండాలని ఆలోచిస్తానంతే' అంటూ సింపుల్ గా చెప్పేశాడు మిస్టర్ పర్ఫెక్ట్.. సారీ మిస్టర్ ప్యాషనేట్ ఆమీర్ ఖాన్.

Tags:    

Similar News