'దంగల్' కోసం మోడీకే సపోర్ట్
సరిగ్గా ఏడాది క్రితం ఆమిర్ ఖాన్ ఇంట్లో మొదలైన అసహనం.. దేశాన్నే కుదిపేసింది. అప్పటికే ఈ టాపిక్ హాట్ హాట్ గా ఉన్నా.. 'మనం దేశం వదిలి వెళ్లిపోవాలా అని నా భార్య అడిగింది' అంటూ ఆమిర్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం అయిపోయింది. మోడీ హయాంలో దేశంలో అసహనం పెరుగుతోందంటూ ఈ హీరో చెప్పిన మాటలకు.. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో 'ఇన్ క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్న ఆమిర్ ఖాన్.. కొన్ని నెలల పాటు మీడియాకు మొహం చూపించకుండా దాక్కుని తిరిగాడు.
ఇప్పుడు దంగల్ సినిమా రిలీజ్ దగ్గర పడింది. ఈ టైమ్ లో బయటకు రాక తప్పదు.. ప్రచారం చేసుకోక తప్పదు. మరి ఇలాంటి సమయంలో అసహనం టాపిక్ బయటకు వస్తే మొదటికే మోసం రావడం ఖాయం. అందుకే జాగ్రత్తగా డీమానిటైజేషన్ ను అడ్డం పెట్టుకుని మోడీని.. మోడీ ప్రభుత్వం చర్యలను ఓ రేంజ్ లో మోసేస్తున్నాడు ఆమిర్ ఖాన్. 'డీమానిటైజేషన్ కారణంగా నేను సమస్యలు ఎదుర్కోలేదు. ఎందుకంటే నా దగ్గర బ్లాక్ మనీ లేదు. బ్లాక్ మనీ దాచుకున్నోళ్లే సమస్యలు ఎదుర్కున్నారు' అంటూ మొదలుపెట్టిన ఆమిర్.. ఆ తర్వాత భజన కార్యక్రమంలోకి దిగిపోయాడు.
'సాధారణ ప్రజలు సమస్యలు ఎదుర్కుంటున్నారని తెలుసు. కానీ మన ప్రధానమంత్రి ఓ గొప్ప చర్య తీసుకున్నారు. మనం అందరం ఆయనకు మద్దతు ఇవ్వాలి. నేను ఆర్థిక వేత్తను కాదు. కానీ ఎవరైనా మంచి పని చేస్తున్నపుడు వారికి మనం సాయం చేయాల్సిందే' అంటూ మోడీని మోసేశాడు ఆమిర్ ఖాన్. ఇదంతా దంగల్ సినిమాకి అసహనం.. హిందు వ్యతిరేకతపై చేసిన కామెంట్స్ లాంటి ప్రభావం పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు అనడంలో ఎనీ డౌట్స్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/