15 వారాల్లో 50కిలోలు త‌గ్గిన యువ హీరో

ఇషాక్ జాదే (2012) చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు అర్జున్ క‌పూర్. బోనిక‌పూర్ సుపుత్రుడు ఇప్ప‌టికే డ‌జ‌ను పైగా చిత్రాల్లో న‌టించాడు.;

Update: 2025-07-29 05:52 GMT

ఇషాక్ జాదే (2012) చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు అర్జున్ క‌పూర్. బోనిక‌పూర్ సుపుత్రుడు ఇప్ప‌టికే డ‌జ‌ను పైగా చిత్రాల్లో న‌టించాడు. న‌టుడిగా ప‌రిణ‌తి చెందినా కెరీర్ లో ఆశించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఇంకా ద‌క్క‌లేదు. ప‌రిణీతి చోప్రాతో మొద‌టి సినిమా చేసే స‌మ‌యానికి అత‌డ తీవ్రంగా జిమ్ముల్లో శ్ర‌మించాడు. దాదాపు 140 కేజీల నుంచి 90 కేజీలకు బ‌రువు త‌గ్గ‌డం కోసం అంత‌కుముందు ఏకంగా 15 నెల‌ల‌ పాటు క‌ఠోరంగా శ్ర‌మించాడు. అంతేకాదు 15 వారాల్లోనే 50 కేజీలు త‌గ్గాన‌ని చెప్పాడు. అయితే అత‌డు రెగ్యుల‌ర్ గా న‌డ‌క ఎంతో ఆరోగ్య‌క‌ర‌మని, తాను బ‌రువు త‌గ్గ‌డానికి కీల‌కంగా స‌హ‌క‌రించిన‌ది న‌డ‌క మాత్ర‌మేన‌ని తెలిపాడు.

జిమ్ కి వెళ‌తాడు.. క్రాస్ ఫిట్ చేస్తాడు. ఇంకా చాలా ర‌కాల వ్యాయామాల్లో ఆరితేరాడు. వీట‌న్నిటితో పాటు ఆహార నియ‌మాల‌ను విధిగా అనుస‌రిస్తాన‌ని చెప్పాడు అర్జున్ క‌పూర్. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాల‌ను జీవితంలో భాగం చేసాడు. ఇంట్లో తింటూ కూర్చోకూడదు.. బరువు తగ్గలేదని ఫిర్యాదు చేయకూడదు.. నిరంత‌రం న‌డ‌క‌, వ్యాయామం చేయాల‌ని అతను చెప్పాడు. తాను ఆహార ప్రియుడే అయినా కానీ జంక్ ఫుడ్ ని దూరం పెట్టాన‌ని, తినే కంటెంట్ సైజు మారింద‌ని చెప్పాడు. అధిక కార్బ్- సుగ‌ర్ ఉన్న తిండి ఆపేసాడు. దానికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, హై ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అర్జున్ వ‌య‌సు 40. ప్ర‌తిరోజూ మంచి ప్రొటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభిస్తాడు. గుడ్లు ఉద‌యం అల్పాహారంలో తీసుకుంటాడు. త‌ర్వాత జిమ్ కి వెళ‌తాడు. ఒక‌టిన్న‌ర‌కు భోజ‌నం చేస్తాడు. సాయంత్రం 5 గం.ల‌కు స్నాక్స్ తీసుకుంటాడు. హై ఎన‌ర్జీ, ప్రొటీన్, ఫైబ‌ర్ తో నిండిన ట‌ర్కీ సుషీ అనే స్నాక్ తింటాడు. సాస లు, పుదీనా చట్నీ, ఊరగాయ కూరగాయలతో కూడిన టర్కిష్ కబాబ్‌లు తింటాడు. క్రాస్ ఫిట్ శిక్ష‌ణ‌తో పాటు వెయిట్స్ తో శిక్ష‌ణ‌ను అనుస‌రిస్తాడు.

అరుదైన వ్యాధితో కుటుంబం క‌ల‌త‌:

అంతేకాదు అర్జున్ క‌పూర్ ఏడాది కాలంగా అరుదైన హషిమోటోస్ థైరాయిడిటిస్‌తో పోరాడుతున్నానని తెలిపాడు. తాను మాత్ర‌మే కాదు, త‌న కుటుంబంలో అంద‌రికీ ఈ స‌మ‌స్య ఉంది. థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేసే, జీవక్రియను నెమ్మదింపజేసే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఇది. దీని కార‌ణంగా బ‌రువు పెరుగుతార‌ని అర్జున్ వివ‌రించాడు. తాను స‌రైన విజ‌యాల్లేక తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రింత ఉధృత‌మ‌వుతుంద‌ని చెప్పాడు. బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం, తిరిగి పెర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఏదైనా సినిమాలో న‌టించేప్పుడు కంటిన్యూటీకి కూడా ఇది స‌మ‌స్య‌గా మారుతుంద‌ని అంగీక‌రించాడు. ఇప్పుడు వ‌య‌సు 40. ముప్పై వ‌య‌సు నుంచి అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాన‌ని చెప్పాడు. త‌న త‌ల్లి శౌరి, సోద‌రి అన్షులా కూడా ఈ ఆటోఇమ్యూన్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News