వాళ్లిద్ద‌రి మ‌ధ్య దూరం నిజంగానే జ‌రిగిందా?

తాజాగా అనుప‌మ పెట్టిన పోస్ట్‌లు ఇద్ద‌రి మధ్య బ్రేకప్ జరిగిందనే అనుమా నాలను రేకెత్తిస్తున్నాయి. అనుపమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న సందేశాలు, విరహం , బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Update: 2026-07-20 19:17 GMT

మాలీవుడ్ బ్యూటీ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్...విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కొంత కాలంగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌ట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి రిలేష‌న్ షిప్ మ‌రింత స్ట్రాంగ్ అవుతుంద‌ని..వివాహం కూడా చేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ బంధం అంత దూరం వెళ్లేలా లేదు. మ‌ధ్య‌లోనే వీగిపోయేలా క‌నిపిస్తోంది. తాజాగా అనుప‌మ పెట్టిన పోస్ట్‌లు ఇద్ద‌రి మధ్య బ్రేకప్ జరిగిందనే అనుమా నాలను రేకెత్తిస్తున్నాయి. అనుపమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న సందేశాలు, విరహం , బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

జీవితంలో మార్పులు, మనుషులు దూరమవ్వడం వంటి అంశాల గురించి అమ్మ‌డు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ధృవ్ విక్రమ్‌ను ఉద్దేశించే ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ పోస్ట్‌లు చూసిన వారంతా అనుప‌మ మనసులో పెద్ద ఆవేదన ఉందని చర్చించుకుంటున్నారు.కొద్ది రోజులుగా ఇద్ద‌రి మధ్య సవ్యంగా లేదని అందుకే అనుపమ ఇలాంటి ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఇద్ద‌రు రిలేష‌న్ షిప్ విషయంపై ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. కానీ కొన్ని ర‌కాల సంకేతాలే సందేహానికి తావిచ్చాయి.

తాజాగా పరస్పరం దూరంగా ఉండటం, ఇద్ద‌రి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని ఫ్యాన్స్ గమనిస్తున్నారు. ధృవ్ విక్రమ్ మాత్రం ఈ విషయంలో మౌనంగా క‌నిపిస్తున్నాడు. ఎలాంటి స్పందన లేకుండా ఉండ‌టం అభి మానుల సందే హాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియక అభిమానులు అయోమయంలో ప‌డ్డారు. తారల వ్యక్తిగత జీవితాలపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. అనుపమ వంటి స్టార్ హీరోయిన్ విషయంలో ఇలాంటి వార్తలు రాగానే నిజమని నమ్మడం .. చర్చించడం సహజం.

అయితే ఇంకొంత మందిలో ఈ మౌనం వెనుక సినిమా ప్ర‌చారం స్టంట్ ఏదైనా ఉందా? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలా మంది నటుల విషయంలో తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా? మనసులోని బాధను .. అసలు విషయాన్ని అనుపమ స్వయంగా బయటపెట్టే వరకు ఇవన్నీ ఊహగానాలే. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న అనుపమ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి కష్టాలను ఎలా? అధిగమిస్తుందో చూడాలి.

ఇక అనుప‌మ సినిమాల విష‌యానికి వ‌స్తే స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మైంది. కొత్త కొత్ రిలీజ్ ల‌తో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ఉంటుంది త‌ప్ప అవి స‌క్స‌స్ పుల్ చిత్రాలు కాక‌పోవ‌డం రేసులో వెన‌క్కి నెట్టుతోంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కుతోన్న `భోగి`లో న‌టిస్తోంది. శ‌ర్వా ఫాంలో ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇక ధృవ్ `బైస‌న్` త‌ర్వాత ఇంకా కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు.

Tags:    

Similar News