అనిరుథ్ అంత డిమాండ్ చేస్తున్నాడా?
అనిరుథ్ రవిచందర్.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరిది. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి శివ కార్తీకేయన్ వరకు కలవరిస్తున్న పేరిది.;
అనిరుథ్ రవిచందర్.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరిది. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి శివ కార్తీకేయన్ వరకు కలవరిస్తున్న పేరిది. సినిమా ఏదైనా, దక్షిణాదిలో భాష ఏదైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ చర్చ వచ్చిందంటే అనిరుథ్ ఉండాల్సిందే. కమల్ `విక్రమ్` నుంచి అనురుథ్ అంటే భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి తను అందించిన బ్యాగ్రౌండ్ స్కోరే ఇందుకు ప్రధాన కారణం.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్` మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో అనిరుథ్ అందించిన బీజిఎమ్స్ పాత్ర చాలానే ఉంది. రజనీకి మళ్లీ `బాషా` కాలం నాటి బుస్ట్‌ని, క్రేజ్‌ని అందించి `జైలర్` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు రాబట్టడానికి ప్రధాన కారణంగా నిలిచాడు అనిరుథ్ దీంతో ప్రతి హీరో ఇప్పుడు తన పేరునే జపిస్తున్నాడు. ఓ పక్క దేవీశ్రీప్రసాద్, తమన్, సంతోష్ నారాయణన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లు లైన్‌లో ఉన్నా కానీ హీరో అత్యధికంగా అనిరుథ్‌నే కోరుకుంటున్నారు.
బ్యాగ్రౌండ్ స్కోర్, పాటల్లోనూ అనిరుథ్ విభిన్నమైన మ్యూజిక్‌ని అందిస్తుండటంతో అతనంటే దక్షిణాదిలో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తన డిమాండ్‌కు తగ్గట్టుగానే అనిరుథ్ ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో డిమాండ్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనిరుథ్ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రొడ్యూసర్స్ కూడా దీనికి ఓకే చెబుతుండటంతో దేశంలోనే ఈ స్థాయిలో పారితోషిం తీసుకుంటున్న మొట్టమొదటి సంగీత దర్శకుడిగా అనిరుథ్ నిలుస్తున్నాడు.
అనిరుథ్ చేస్తున్న ప్రతి సినిమా ఆడియో రైట్స్‌కు భారీ డిమాండ్ ఉంటోంది. ఒక్కో సినిమా ఆడియో రైట్స్‌కు ఏకంగా రూ.18 కోట్లు పలుకుతోంది. ప్రస్తుతం అనిరుథ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. రజనీ `జైలర్ 2`, కూలీ సినిమాలతో పాటు కింగ్‌డమ్, ది ప్యారడైజ్, జన నాయగన్, మదరాసి, ప్రదీప్ రంగనాథన్ `లవ్ ఇన్సురెన్స్ కంపనీ` సినిమాలకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నాని `ది ప్యారడైజ్` కోసం రూ.15 కోట్లు డిమాండ్ చేశాడట. అయితే ఆడియో రైట్స్‌కు రూ.18 కోట్లు రావడంతో వారు పెట్టిన పెట్టుబడి అప్పుడే వచ్ఏసి మరోమూడు కోట్లు ప్రాఫిట్ వచ్చేయడం విశేషం.