• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త ప్రియుడితో కొత్త...

కొత్త ప్రియుడితో కొత్త ఇల్లు కొనుక్కున్న అమీ జాక్స‌న్

| ఈ ఇంటికి పునరుద్ధరణ అవసరం - అందుకే పునర్నిర్మాణం చేశాం. మేము గత మూడు నెలలుగా ఇంటిని పునర్నిర్మిస్తున్నాం.

By - Tupaki Desk
Update: 2023-08-19 03:45 GMT

బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ ప్రేమాయ‌ణాలు అన్నివేళ‌లా హాట్ టాపిక్. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడైన జార్జ్ పనాయ‌టోతో ఒక బిడ్డ‌ను క‌ని అటుపై అత‌డి నుంచి విడిపోయాక‌.. ప్ర‌స్తుతం నటుడు-బ్యూ ఎడ్ వెస్ట్‌విక్ తో జోరుగా షికార్లు చేస్తోంది. ఇటీవల ఈ జంట వెకేష‌న్స్ కోసం భారతదేశానికి విచ్చేసారు. ప‌నిలో ప‌నిగా ఎమీజాక్స‌న్ త‌న న‌ట‌నా కెరీర్ ని పున‌రుద్ధ‌రించే ప‌నిలో ఇండియాకి వ‌చ్చింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇక కొత్త ప్రియుడితో బంధంలో ఎమీ తదుపరి అడుగు వేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. వారిద్దరూ ఒక‌ పల్లెటూరిలో త‌మ డ్రీమ్ హౌస్ ని కొనుగోలు చేశారని తెలిసింది.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన‌ అప్‌డేట్‌ను ఈ జంట షేర్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది. "ఏప్రిల్‌లో మా డ్రీమ్ హౌస్‌ని కొనుక్కున్నాం. పచ్చదనంతో ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలితో నిండి ఉండే అత్యంత సుందరమైన పల్లెటూరి ఇంటిని మేం కనుగొన్నాము (లండ‌న్ లోని కఠినమైన భావాలు లేవు!) ఇంతకు ముందు ఇక్కడ నివసించిన వృద్ధురాలు గత 35 సంవత్సరాలుగా ఉంటోంది. ఈ చోటును చూడ‌గానే వెంటనే ప్రేమను ఫీల‌వ్వొచ్చు. ఈ ఇంటికి పునరుద్ధరణ అవసరం - అందుకే పునర్నిర్మాణం చేశాం. మేము గత మూడు నెలలుగా ఇంటిని పునర్నిర్మిస్తున్నాం. ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది! చాలా పింట‌రెస్ట్ బోర్డులు, గోడలకు సుత్తులు, రక్తం, చెమట - కన్నీళ్లతో ... ..ప్రయాణంలో ఇదంతా భాగమే" అంటూ అమీ ఎమోష‌న‌ల్ నోట్ రాసింది.

అమీ జాక్సన్ -ఎడ్ వెస్ట్‌విక్ 2022 ఫిబ్రవరిలో త‌మ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు కొంతకాలం ప్రైవేట్‌గా డేటింగ్ చేసారు. లైఫ్‌స్టైల్ ఆసియాతో తాజా ఇంటర్వ్యూలో అమీ మాట్లాడుతూ, "మేము క‌లిసి చేసే ప్రతి పనిలో అతడు నా భాగస్వామి. నా అస్తవ్యస్తమైన సమయాల్లో నా వెన్నంటి నిలిచాడు. ప్రశాంత స్వరంతో ఉంటాడు. సూటిగా ఇంకా సున్నితంగా ఉంటాడు. అంతర్ముఖుడు.. .. కొన్ని కష్ట సమయాల్లో కూడా నన్ను నవ్విస్తూ ఏడ్చేయగలడు. మేము వ్యక్తులుగా ఒక‌టిగా సృష్టించడం ఎదగడంపై అభిరుచిని పంచుకుంటాము. నా నిజస్వరూపాన్ని మ‌న‌స్ఫూర్తిగా తెలుసుకున్న‌వాడు.. నాకు మద్దతుగా నిలిచి ప్రోత్సహించే వాడు నాకు ఎప్పుడూ లేడు. నేనేదైనా సాధించ‌గలను అనే ఫీలింగ్ కలిగిస్తాడు ఎడ్‌. అది చాలదన్నట్లుగా.. అతను నా చిన్న పిల్లవాడు ఆండ్రియాస్ విష‌యంలో అత్యంత దయగల.. అత్యంత శ్రద్ధగల వ్యక్తి - నేను వారి సంబంధాన్ని ప్రేమిస్తున్నాను" అని ఎమోష‌న‌ల్ నోట్ లో పేర్కొంది.

గతంలో బ్రిటీష్ బిజినెస్ మేన్ జార్జ్ పనయిటోతో అమీ నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థానికి ముందే కుమారుడు ఆండ్రియాస్‌కు అమీ జన్మనిచ్చింది. 2021లో రెండు సంవత్సరాలకు పైగా డేటింగ్ తర్వాత ఈ జంట విడిపోయారు. మరోవైపు ఎడ్ వెస్ట్‌విక్ దక్షిణాఫ్రికా మోడల్.. ఇన్‌ఫ్లుయెన్సర్ తమరా ఫ్రాన్సిస్కోనితో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత స‌ద‌రు మోడ‌ల్ ని అత‌డు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎమీజాక్స‌న్ తో స‌హ‌జీవ‌నం సాగిస్తున్నాడు.

Tags:    
  • Hollywood 
  • Tollywood 
  • Amyjackson 
  • Dreamhouse 
  • Beauedwestwick 
  • Socialmedia 
  • Actress 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS