కళ్లు చెదిరేలా రెమ్యూనరేషన్!
తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సీజన్ కోసం అమితాబ్ చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షో కోసం అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని సమాచారం.;
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎలాంటి నటుడనేది అందరికీ తెలుసు. ఇక ఆయన మార్కెట్, క్రేజ్, ఫాలోయింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి, సినిమా కుదరకపోతే కాసేపు క్యామియో అయినా చేయించుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు.
ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు కూడా ఆయన ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇవ్వడానికి వెనుకాడరు. అయితే అమితాబ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా టెలివిజన్ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్‌పతి అనే ఐకానిక్ క్విజ్ షోకు అమితాబ్ హోస్ట్ గా చేస్తారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ షో 17వ సీజన్ త్వరలో మొదలవనుండగా దాని కోసం బిగ్ బీ రెడీ అవుతున్నారు.
తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సీజన్ కోసం అమితాబ్ చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షో కోసం అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. అంటే వారానికి 5 ఎపిసోడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి చూసుకుంటే అమితాబ్ ఒక్కో వారానికి రూ.25 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు. ఈ వార్తలు నిజమైతే మాత్రం ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టెలివిజన్ హోస్ట్ గా అమితాబ్ రికార్డుకెక్కుతారు.
గతంలో సల్మాన్ ఖాన్ వీకెండ్ కా వార్ షో కోసం రూ.24 కోట్లు తీసుకోగా ఇప్పుడు అమితాబ్ ఈ విషయంలో సల్మాన్ ను క్రాస్ చేయబోతున్నారని తెలుస్తోంది. కౌన్ బనేగా కరోడ్‌పతి షో కు టీవీ షోల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. 2000వ సంవత్సరంలో ఈ షో మొదలైనప్పటి నుంచి అమితాబే ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మధ్యలో మూడో సీజన్ ను మాత్రం షారుఖ్ హోస్ట్ చేశారు. షోను హోస్ట్ చేయడంలో అమితాబ్ కు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ను బట్టి చూస్తే ఆయన అంత మొత్తం ఛార్జ్ చేయడం న్యాయమే అనిపిస్తుంది.