ఎయిర్ పోర్ట్ లో అక్కినేని కొత్త కపుల్.. స్పెషల్ టూర్?
టాలీవుడ్ ప్రముఖ కాంపౌండ్ అక్కినేని ఫ్యామిలీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ ప్రముఖ కాంపౌండ్ అక్కినేని ఫ్యామిలీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లో నాగచైతన్య, శోభిత వివాహం ఘనంగా జరగ్గా.. ఇప్పుడు అఖిల్ పెళ్లి త్వరలోనే జరగనుంది. కొద్ది రోజుల క్రితం జైనాబ్ రవ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ నెట్టింట ప్రకటించారు.
కానీ అఖిల్ పెళ్లి డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. 2025లోనే జరుగుతుందని నాగార్జున చెప్పినా.. తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మ్యారేజ్ మూమెంట్స్ చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఎంగేజ్మెంట్ కు చెందినవి కాకుండా అప్పుడప్పుడు కాబోయే భార్యతో అఖిల్ పిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో జంటగా అఖిల్, జైనాబ్ రవ్జీ కలిసి కనిపించారు. మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో ఉన్న ఇద్దరూ.. ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తున్న పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పెయిర్ సూపర్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందని అంటున్నారు.
త్వరలోనే మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అంచనా వేస్తున్నారు. పెళ్లి కళ వచ్చేసింది బాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో అఖిల్ బర్త్ డే రేపే. దీంతో కాబోయే భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు అఖిల్ వెళ్లుతున్నారని చెబుతున్నారు. మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఉంటారని అంటున్నారు.
ఇక అఖిల్ కెరీర్ విషయానికొస్తే.. చివరగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. విమర్శలు కూడా వచ్చాయి. ఏజెంట్ తర్వాత అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై అనౌన్స్మెంట్ ఇప్పటివరకు రాలేదు. కానీ రేపు Akhil 6 అప్డేట్ ఇస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు.
ఆ సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లెనిన్ అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందనుందని వినికిడి. అయితే అఖిల్ కొత్త మూవీ అప్డేట్ కోసం ఇంకొన్ని గంటలపాటు వెయిట్ చేయాల్సిందే.