నేచురల్ బ్యూటీకి సరైన గుర్తింపు రావట్లేదు..!

అలా టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపు తెచ్చుకోని హీరోయిన్స్ లో తమిళ భామ ఐశ్వర్య రాజేష్ ఒకరు.

Update: 2024-04-23 06:30 GMT

ఇలా వచ్చి అలా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునే వారు కొందరైతే అభినయంతో మెప్పిస్తున్నా కూడా ప్రేక్షకుల మనసులు గెలవడంలో వెనుకబడిన వారు కొందరు ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా సరే స్టార్ ఇమేజ్ దక్కించుకోలేరు. ఎలాంటి పాత్రనైనా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం వరకు ఓకే కానీ కచ్చితంగా ఈ హీరోయినే కావాలన్న క్రేజ్ ను సంపాదించుకోలేరు. అలా టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపు తెచ్చుకోని హీరోయిన్స్ లో తమిళ భామ ఐశ్వర్య రాజేష్ ఒకరు.


తెలుగు మూలాలున్నా సరే కోలీవుడ్ లోనే తెరంగేట్రం చేసిన ఐశ్వర్య రాజేష్ తమిళ, మలయాళ సినిమాలతో అలరిస్తుంది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఐశ్వర్య కమర్షియల్ సినిమాల్లో మాత్రం అవకాశాలు రాబట్టుకోలేదు. కెరీర్ కొద్దిగా వెనబడుతున్నాం అనుకునే టైం లో చిన్న పాత్రలు కూడా చేయాల్సి రావడంతో ఐశ్వర్య గ్రాఫ్ మరీ పడిపోయింది. తమిళంలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు మరో ఆప్షన్ అనిపించుకోవాలనుకున్న ఐశ్వర్య తనలోని టాలెంట్ ని ఎవరు గుర్తించట్లేదు అన్న భావనలో ఉంది.

Read more!

రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ ఇస్తే చాలు అడిగినన రేంజ్ లో రెచ్చిపోయే భామలున్న ఈ టైం లో గ్లామర్ షో చేయకుండా కేవలం నటనతో ఆకట్టుకోవాలని అనుకోవడం పెద్ద సవాలే. కానీ ఇప్పటికే అలా తమ అభినయంతో మెప్పిస్తూ వస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. సో అలాంటి వారిలో ఐశ్వర్య కూడా తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తుంది. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన ఐశ్వర్య కోలీవుడ్ లో మాత్రం వరుస ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది.

సౌత్ సినీ పరిశ్రమలో సహజ నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకునే వారిలో ఐశ్వర్య ఒకరు. అయితే అమ్మడికి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు. ఎంతసేపటికీ యువ దర్శకులతో పనిచేయడమే తప్ప అమ్మడు స్టార్ డైరెక్టర్స్ దృష్టిలో పడట్లేదు. ఒక మంచి ఛాన్స్ వస్తే మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తుంది ఐశ్వర్య. ఈమధ్య సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తున్న ఐశ్వర్య రాజేష్ అక్కడ కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తుంది. కథాబలం ఉన్న సినిమాలే చేయాలని రూల్ పెట్టుకుని తనకు నచ్చిన పాత్రలనే చేస్తూ వస్తున్న ఐశ్వర్యకు రానున్న రోజుల్లో మంచి సినిమాలు పడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News