ఊహించని గాయాలు.. అడివి శేష్‌కు మృణాల్ ఘాటైన వార్నింగ్!

టాలీవుడ్‌లో మరో ఇంటెన్స్ లవ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమాపై ఆసక్తికర బజ్ నెలకొంది.;

Update: 2025-07-09 05:24 GMT

టాలీవుడ్‌లో మరో ఇంటెన్స్ లవ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమాపై ఆసక్తికర బజ్ నెలకొంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఓ బ్రేకప్‌ ప్రేమ జంట మధ్య నడిచే ప్రతీకార కథతో సాగనుందనే సంకేతాలు ఇప్పటికే టీజర్‌లో కనిపించాయి. తాజాగా మృణాల్ ఓ ఫన్నీ కానీ షార్ప్ స్టోరీ పోస్ట్ చేయడంతో మూవీపై ఇంకొంచెం హైప్ పెరిగింది.


ప్రస్తుతం హైదరాబాద్‌లో డెకాయిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అడివి శేష్‌తో పాటు మృణాల్ కూడా షూటింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. షూటింగ్ మధ్యలోనే తీసిన ఓ ఫోటోను మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె నుదుటి మీద గాయాలున్నట్లు కనిపిస్తోంది. ఆమె శేష్‌ను చూపిస్తూ “సబ్‌కా బద్లా లేగీ జూలియట్” అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దీని ద్వారా ఆమె పాత్రలో ప్రతీకార బలమైన కోణం ఉంటుందని స్పష్టమవుతోంది.

ఇంతకుముందు విడుదలైన గ్లింప్స్‌లో అడివి శేష్ మృణాల్‌ను జూలియట్ అని పిలిచే సన్నివేశం ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ సీన్ తర్వాత ఇద్దరి మధ్య నడిచే కథ ఎంత డార్క్‌గా ఉంటుందో అభిమానులు ఊహించుకునే స్థాయికి చేరుకుంది. మృణాల్ షేర్ చేసిన ఫోటోతో ఆ ఊహకు ఇంకొంచెం బలం చేకూరింది. ఈ పోస్టులో ఇద్దరూ నవ్వుతూ కనిపించినా, తెరపై మాత్రం గంభీరమైన ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఉండబోతోందని చెబుతోంది చిత్రబృందం.

ఈ సినిమాకు షనీల్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అడివి శేష్‌తో కలిసి పనిచేసిన ఆయనకు స్క్రీన్‌పై స్టైలిష్ యాక్షన్ ప్రెజెంటేషన్‌లో మంచి పేరు ఉంది. ఈసారి ప్రేమ, ప్రేమలోని మోసం, బాధ, ప్రతీకారం వంటి భావోద్వేగాలను యాక్షన్‌తో కలిపి చూపించబోతున్నారు. మ్యూజిక్, విజువల్స్ పరంగా కూడా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం.

డెకాయిట్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌పై సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద క్యాస్ట్ కాకపోయినా, కథలో ఉండే డెఫ్త్‌ను నమ్మి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికి మృణాల్ ఠాకూర్ జూలియట్‌గా ఓ భిన్నమైన కోణంలో కనిపించబోతున్న ఈ సినిమా, అడివి శేష్ కెరీర్‌కు మరో బిగ్ హిట్ గా నిలవనుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Tags:    

Similar News