• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  వ్యూహం టీజర్ 2.. కుట్రలకు...

వ్యూహం టీజర్ 2.. కుట్రలకు ఆలోచనలకు మధ్య జరిగే యుద్ధం

| కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నలేటెస్ట్ మూవీ 'వ్యూహం'.

By - Tupaki Desk
Update: 2023-08-15 06:50 GMT

కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నలేటెస్ట్ మూవీ 'వ్యూహం'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎదురైన సమస్యలు, వాటిని ఆయన ఎలా అధిగమించారు వంటి అంశాలతో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో టీజర్‌ను మూవీటీమ్ రిలీజ్ చేసింది. కుట్రలకు ఆలోచనలకు మధ్య జరిగే యుద్ధంలా చూపించారు.

ఈ ప్రచార చిత్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ పోలిన పాత్రలను కాస్త నెగటివిగా, వారంతా కుట్రలు చేస్తున్నట్టుగా ప్రచార చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. జగన్ జైలు జీవితం, ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజ వంటి అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్టుగా అర్థమైంది.

'వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదం' జరిగిన సంఘటనతో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. ఆ వెంటనే చంద్రబాబుతో సహా ఇతర ప్రతిపక్ష నాయకులు సమావేశం అవ్వడం, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని పోలీసులు విచారించడం చూపించారు. మొదటి టీజర్‌లో లేని రాష్ట్ర విభజన అంశాన్ని కూడా తాజా టీజర్ లో కాస్త హైలైల్ చేశారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కూడా కాస్త వెయిటేజి ఎక్కువ ఇస్తూ ఇందులో చూపించారు.

నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంద అని జగన్ పాత్ర చెప్పడం చూపించారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ చుట్టూ అసత్య ప్రచారాలు ఎక్కువ అయిపోయాయని ఈ డైలాగ్ ద్వారా చెప్పాలనుకున్నారు దర్శకుడు. అలాగే ప్రచార చిత్రం చివర్లో.. ఎప్పుడో ఒకసారి మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అనే డైలాగ్ రావడం.. అందుకు చంద్రబాబు పోలిన పాత్.. వాడికి అంతా సీన్ లేదు.. తానను తానే పొడుచుకుంటాడు అని చెప్పడంతో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కుట్రలు పన్నేదిగా ఉంటుందని చూపించారు. ఇంకా చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీ, చిరంజీవి-పవన్ కల్యాణ్ మధ్య భేటీ వంటి సన్నివేశాలను చూపించారు. ఇంకా జగన్ కోసం వైసీపీ కార్యకర్తలు చేసిన ర్యాలీలు, ఈ క్రమంలో వారికి పోలీసులకు మధ్య జరిగిన కొట్లాటల సన్నివేశాలతో పాటు మన్నోహన్ సింగ్, రోశయ్య పాత్రలను చూపించారు.

ముఖ్యంగా జగన్ జైలు జీవితాన్ని, దాంతో ఆయన భార్య భారతీ రెడ్డి, తల్లి విజయమ్మ, కుటుంబం ఎదుర్కొన్న బాధను బాగా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ప్రతి పాత్ర నిజజీవితం తరహాలోని ముఖాలను కలిగి ఉండేలా వర్మ బాగా చూసుకున్నారు. మొత్తంగా ఈ ప్రచార చిత్రం జగన్ ను హైలైట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ చూపించారు.

ఇకపోతే ఈ 'వ్యూహం' చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2024 ఎలెక్షన్‌కు ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Full View
Tags:    
  • VyuhamMovie 
  • RGVVyuhamMovie 
  • Tollywood 
  • MovieNews 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS