• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  రానా 'హిరణ్యకశ్యప'...

రానా 'హిరణ్యకశ్యప' కాన్సెప్ట్​ టీజర్​.. ఎలా ఉందంటే..

| ఈ చిత్రాన్ని ప్రముఖ కామిక్ కథలు అమర్ చిత్ర కథ నుంచి తీసుకుని రూపొందిస్తున్నారు రానా

By - Tupaki Desk
Update: 2023-07-26 08:46 GMT

యాక్టర్ కమ్​ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి.. ఈ మధ్యే తన కొత్త భారీ పీరియాడిక్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని శాన్​ డీగో వేదికగా జరిగిన ప్రఖ్యాత కామిక్ కాన్ 2023 ఈవెంట్​లో గ్రాండ్​గా హిరణ్యకశ్యప అనే భారీ ప్రాజెక్టును అనౌన్స్​ చేశారు. ఓ కాన్సెప్ట్​ పోస్టర్​ను రిలీజ్​ చేసి సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగించారు. తన సొంత బ్యానర్ స్పిరిట్ మీడియాపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు రానా తెలిపారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్​ అప్డేట్​ను రిలీజ్ చేశారు. సోషల్​మీడియా వేదికగా.. హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్​ను రిలీజ్​ చేశారు.

ఈ ప్రచార చిత్రం.. కామిక్స్ రూపంలో ఉన్న ప్రహ్లాద పాత్రను చూపిస్తూ మొదలైంది. ఆ తర్వాత హిరణ్యకశ్యపతో పాటు మరో రెండు మూడు ఇతర పాత్రలను అన్నీ డ్రాయింగ్స్ రూపంలో చూపించినట్టు అర్థమవుతోంది. ఆ కాలంలో జరిగిన సంఘటనలను కూడా కామిక్ రూపంలో కాస్త వివరించేందుకు ప్రయత్నించారు. చివరిగా ఫస్ట్​ లుక్​ పోస్టర్​ తరహాలో ఉన్న కామిక్​ హిరణ్యకశపను చూపించి ముగించారు. చూపించిన డ్రాయింగ్స్​ కన్నా.. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ మంచి ఇంట్రెస్టింగ్​గా అనిపించింది. మొత్తంగా ఈ కాన్సెప్ట్ టీజర్.. సినిమా ఎలా ఉండబోతుందో అన్న కాస్త ఆసక్తిని రేకెత్తించింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ కామిక్ కథలు 'అమర్ చిత్ర కథ' నుంచి తీసుకుని రూపొందిస్తున్నారు రానా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం అనౌన్స్​మెంట్​తోనే ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమా ప్రకటించగానే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్​ దీనిపై స్పందించారు. పరోక్షంగా త్రివిక్రమ్​-రానాపై విమర్శలు చేశారు.

వాస్తవానికి ఈ సినిమా గుణశేఖర్​-రానా కాంబోలో తెరకెక్కాల్సింది. దీనిపే చాలా కాలం పాటు గుణ్​శేఖర్ పని చేశారు కూడా. రానాతో కలిసి చర్చలు కూడా జరిపారు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను కాస్త గ్యాప్ ఇచ్చి తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.

ఆ తర్వాత గుణశేఖర్​.. సమంతతో కలిసి శాకుంతలం అనే పీరియాడిక్ చిత్రాన్ని తీశారు. ఎన్నో అంచనాలతో వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. అనంతరం రానా రీసెంట్​గా కామిక్​ కాన్​ వేదికపై హిరణ్యకశ్యప్​ను ప్రకటించారు కానీ.. గుణశేఖర్​ పేరు మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. కేవలం త్రివిక్రమ్​ పేరు మాత్రమే చెప్పారు.

బహుశ శాకుంతలం డిజాస్టర్​ అవ్వడం వల్లే రానా.. గుణశేఖర్​ను సైలెంట్​గా సైడ్​ చేశారని అంతా అన్నారు. ఈ విషయం చిత్రసీమలో చర్చనీయాంశమైంది. గుణశేఖర్​ కూడా దేవుడన్నీ చూస్తాడంటూ పరోక్షంగా విరుచుకుపడ్డారు. చూడాలి మరి రానా ఈ భారీ విజువల్​ ప్రాజెక్ట్​ను తీసుకెళ్లి.. గుణశేఖర్​ చేతిలోనే పెడతారో లేదా ఇంకెవరికైనా అప్పగిస్తారా. ఏదేమైనా రీసెంట్​గా ఆదిపురుష్ విషయంలో జరిగిన పరిణామాలన్నింటినీ అంచనా వేసుకుని జాగ్రత్తగా సినిమా తీయాల్సిన పెద్ద బాధ్యత రానాపై ఉంది.

Tags:    
  • Ranadaggubati 
  • Hiranyakashyap 
  • Spiritmediabanner 
  • HiranyakashyapFilm 
  • Comiccon 
  • TrivikramSrinivas 
  • HiranyakashyapMovie 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS