తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!
| సినిమా ఇండస్ట్రీలో విజయాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు.. పరాజయాలు ఎదురైనప్పుడు కూడా ఒక వ్యక్తి తనకు అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీ గురించి ఎలా మాట్లాడుతారో చూస్తే వారి స్వభావం ఏంటో అర్థమవుతుంది.
సినిమా ఇండస్ట్రీలో విజయాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు.. పరాజయాలు ఎదురైనప్పుడు కూడా ఒక వ్యక్తి తనకు అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీ గురించి ఎలా మాట్లాడుతారో చూస్తే వారి స్వభావం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ కూడా.. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మంచి విజయాలు అందుకుని.. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్న సమయంలో టాలీవుడ్ గురించి విమర్శలు చేయడం ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతోంది. తమకు గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీ గురించి కొందరు ప్రతికూలంగా మాట్లాడటంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే అందరూ అలానే ఉండరు. తెలుగు సినిమాతో తమకు వచ్చిన గుర్తింపును గుర్తుంచుకునే హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "టాలీవుడ్ నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది. నాకు అండగా నిలిచిన ఇండస్ట్రీకి నేను ఎప్పటికీ అండగా ఉంటాను" అంటూ ఆమె తన మనసులోని మాటను చెప్పింది.
తనకు పేరు, గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీ గురించి సంవత్సరాల తర్వాత చెడుగా మాట్లాడటం గొప్ప విషయం కాదని, అది కృతజ్ఞత లేని వైఖరి అని పాయల్ అభిప్రాయపడింది. అలాగే ఒకరి కెరీర్‌కు అవకాశాలు ఇచ్చిన తెలుగు సినిమా ప్రపంచాన్ని మొత్తం తప్పుబట్టడం సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొంది.
పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఆర్ఎక్స్ 100 సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా విజయం తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వరుస ఫ్లాపులు చవిచూసిన ఈ హీరోయిన్ మళ్లీ మంగళవారం చిత్రంతో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుస పెట్టి ఆఫర్లు లేవు. అయినా కూడా పాయల్ తెలుగు ఇండస్ట్రీ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచి ఒక మెట్టు ఎక్కింది.
పాయల్ చేసిన ఈ పోస్ట్ చూసిన పలువురు అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. తమకు అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీని గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమని కామెంట్లు చేస్తున్నారు.
ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ విజయాన్ని అందరూ పంచుకుంటారు. కానీ ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ పట్ల గౌరవం చూపించడం ఎంతో ముఖ్యం. ఏ ఇండస్ట్రీలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉండవచ్చు. వాటిని వ్యక్తిగతంగా చెప్పడం వేరు, మొత్తం ఇండస్ట్రీని తప్పుబట్టడం వేరు.
పాయల్ రాజ్‌పుత్ మాటలు ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి హీరోయిన్లు అవసరమని, తమకు గుర్తింపు ఇచ్చిన చోటును గౌరవించే నటీమణులు ఎప్పటికీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ కామెంట్లతో అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది ఈ హీరోయిన్.