• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Video Stories >  ఆకాశం ధాటి వస్తావా...

ఆకాశం ధాటి వస్తావా టీజర్.. బలగం టీమ్ మరో న్యూ కంటెంట్

By - Tupaki Desk
Update: 2023-08-04 14:59 GMT

బాలగం అనే చిన్న సినిమాతో చరిత్ర సృష్టించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు "ఆకాశం ధాటి వస్తావా" అనే మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక మేకర్స్ ఇటీవల టైటిల్‌ను ఆవిష్కరించి, టీమ్‌ను పరిచయం చేశారు. ప్రతీ చిన్న అప్డేట్ కూడా పాజిటివ్ హైప్ క్రియేట్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు అందుకున్న యశ్వంత్ మాస్టర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ప్రతిభావంతులైన మలయాళ నటి కార్తీక మురళీదరన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నారు. ఆమె ఇదివరకే కొన్ని మంచి కంటెంట్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. ఈ సినిమాతో శశికుమార్ ముతిలూరి దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.

ఇక ఈ ఈరోజు ఆకాశం దాటి వస్తావా.. సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ను బట్టి చూస్తే లవ్ కెమిస్ట్రీ, ఆకర్షించే విజువల్స్, ఎమోషన్స్ అలాగే కామెడీ కలగలిపిన సినిమా అని అనిపిస్తోంది. టీజర్ లోకి వెళితే.. హీరోను ప్లే బాయ్ గా సంభోదించే హీరోయిన్ ఎప్పుడు ఇదే పనేనా అంటూ ప్రపోజల్ కు స్వీట్ కౌంటర్ ఇస్తూనే.. ప్రేమ కోసం ఆకాశం, సముద్రాలు దాటి వస్తావా అని అడుగుతుంది.

ఇక అందుకు హీరోగా కొంటెగా.. అంత బడ్జెట్ లేదు, ఎదో ట్రైన్ బస్ ఉన్న ఉరికైతే వచ్చేస్తా అని అంటున్నాడు. ఇక అంత లో బడ్జెట్ ప్రేమా అని హీరోయిన్ అడుగగా.. అవును అంటూ జీతం తక్కువే అని, కాకపోతే నా టైమ్ మొత్తం నీ ప్రేమకు అన్నట్లు హీరో మాటలతో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. టీజర్ అయితే కాస్త రొటీన్ కు బిన్నంగానే ఉంది.

చాలా కూల్ విజువల్స్ హైలెట్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న నేపథ్య గాయకుడు కార్తీక్ గానం బాగుంది. ప్రముఖ జంట యష్ మరియు కార్తీక కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. కథలో అందమైన ప్రేమకథతో బలమైన భావోద్వేగాలు ఉన్నాయని అనిపిస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్సితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శిరీష్ సమర్పిస్తున్నారు.


Full View


Tags:    
  • Aakasamdhaativastha 
  • TeaserTalk 
  • Tollywood 
  • Yashwanthmaster 
  • MovieNews 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS