సమ్మర్ లో ఊటీ.. కొడై టూర్ కు ప్లానింగా? ఈపాస్ సంగతి తెలుసా?

కూల్ గా ఉండే ప్లేస్ లో తెలుగు రాష్ట్రాల వారికి దగ్గరగా ఉండే జాబితాలో తమిళనాడులోని ఊటీ.. కొడైకెనాల్ లాంటివి ముందువరుసలో ఉంటాయి.

Update: 2024-05-07 08:30 GMT

సమ్మర్ వచ్చిందంటే చాలు.. మాంచి హిల్ స్టేషన్ కు వెళ్లి చిల్ కావటం తెలిసిందే. కూల్ గా ఉండే ప్లేస్ లో తెలుగు రాష్ట్రాల వారికి దగ్గరగా ఉండే జాబితాలో తమిళనాడులోని ఊటీ.. కొడైకెనాల్ లాంటివి ముందువరుసలో ఉంటాయి. అయితే.. ఈ సమ్మర్ లో పెద్ద ఎత్తున వచ్చే టూరిస్టుల కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండటానికి.. వాహనాల రద్దీకి సంబంధించిన వివరాలు అధికార యంత్రాంగానికి తెలిసేలా ఈ-పాస్ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. టూరిస్టులకు దీనిపై అవగాహన తక్కువ.

అందుకే.. ఈ సమ్మర్ లో ఊటీ.. కొడైకెనాల్ వెళ్లాలనుకునే వారు కచ్ఛితంగా తమ ప్రయాణ వివరాల్ని ముందుగా తెలియజేయటం.. తమ ప్రయాణానికి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఈపాస్ ను పొందాల్సి ఉంటుంది. ఆ మధ్యన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు (మే 7) నుంచి ఊటీ..కొడైలకు వెళ్లానుకునే వారు ముందస్తుగా ఈపాస్ ను ఆన్ లైన్ లో అప్లై చేసుకొని పొందాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం (మే 6) నుంచి మొదలైంది. epass.tnega.org లోని వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకొని ఈపాస్ పొందాల్సి ఉంటుంది. అయితే.. ఈ విధానాన్ని ఈ సమ్మర్ సీజన్ వరకే అమలు చేస్తారు. జూన్ 30 తర్వాత ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఎలాంటి ఈపాస్ అవసరం లేదు. ఆ లోపు వెళ్లే వారు మాత్రం ముందస్తుగా ఈపాస్ పొందితేనే ఊటీ.. కొడైలకు ఎంట్రీ లభిస్తుంది. సో.. ఈ రెండు హిల్ స్టేషన్లకు టూర్ ప్లాన్ చేస్తే మాత్రం జర జాగ్రత్త.

Tags:    

Similar News