పాక్ పౌరులకు వీసాలు ఇవ్వటం మానేసిన యూఏఈ
ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలన్నా.. ఆ దేశంలో కాలు మోపాలన్నాపాస్ పోర్టుతో పాటు ఆ దేశంలో అడుగు పెట్టే అర్హతకు చిహ్నంగా ఆ దేశం వీసా ఓకే చేయాల్సి ఉంటుంది.;
ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలన్నా.. ఆ దేశంలో కాలు మోపాలన్నాపాస్ పోర్టుతో పాటు ఆ దేశంలో అడుగు పెట్టే అర్హతకు చిహ్నంగా ఆ దేశం వీసా ఓకే చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇదే విధానాన్ని అమలు చేయటం తెలిసిందే. కొన్ని దేశాల మధ్య నెలకొనే పరిస్థితుల నేపథ్యంలో వీసాలు ఆపేస్తుంటారు. అయితే.. తాజాగా యూఏఈ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ కు తీవ్ర అవమానంగా మారిందని చెప్పాలి. అయితే.. అధికారికంగా ఈ నిర్ణయాన్ని యూఏఈ ప్రకటించలేదు. అనధికారికంగా మాత్రం అమలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇంతకూ ఏ విషయం మీదనంటే..
అదేమంటే.. తమ దేశంలోకి పాకిస్థానీయులు రాకుండా ఉండేలా యూఏఈ వీసాల జారీని నిలిపేసింది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది. పాకిస్థాన్ పౌరులు ఎవరైనా సరే.. వారికి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసాలు నిలిపేసినట్లుగా తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. తమ దేశానికి వచ్చిన తర్వాత అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన చేయటం.. నేర కార్యాకలాపాల్లో పాల్గొంటున్నారన్న ఆందోళన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లుగా సమాచారం.
టూరిస్ట్ వీసా మీద యూఏఈకి వచ్చిన అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తమ దేశానికి వేలాదిగా వస్తున్న పాక్ బిచ్చగాళ్లను గుర్తించి వారి దేశానికి పంపించింది. నేరాలకు పాల్పడుతున్నట్లుగా గ్రహించిన యూఏఈ వీసాల్ని నియంత్రిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్లూ. డిప్లొమాటిక్ పాస్ పోర్టుదారులకు మాత్రమే తమ దేశంలో అడుగు పెట్టేలా పాకిస్థాన్ కు చెందిన వారికి వీసాలు మంజూరు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.