ఇన్ ఫ్లుయెన్సర్ కు ఆఫ్గాన్ లో షాకింగ్ అనుభవాలు... వీడియో వైరల్!
ఈ క్రమంలో అలా అని ఆఫ్గనిస్తాన్ కు వెళ్లిన ఓ బ్రిటీష్ ఇన్ ఫ్లుయెన్సర్ కు ఎదురైన అనుభవాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.;
ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ మధ్య హెవీ కాంపిటీషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచానికి పెద్దగా తెలియని విషయాలను, చాలా తక్కువ మంది చూసిన ప్రదేశాలను డాక్యుమెంట్ చేయడానికి ఇన్ ఫ్లుయెన్సర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలో అలా అని ఆఫ్గనిస్తాన్ కు వెళ్లిన ఓ బ్రిటీష్ ఇన్ ఫ్లుయెన్సర్ కు ఎదురైన అనుభవాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... నిత్యం తమ ఫాలోవర్స్ కి, తమ ఛానల్ సబ్ స్క్రైబర్స్ కి కొత్త విషయాలు అందించాలని, సరికొత్త ప్రదేశాలు చూపించాలని ప్రయత్నిస్తుంటారు ఇన్ ఫ్లుయెన్సర్లు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే పరిస్థితులు, ఎదురొచ్చే సమస్యలు కొన్నిసార్లు ఆందోళన కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో.. ప్రతిదాన్నీ డాక్యుమెంట్ చేయడానికి అలవాటు పడిన ఒక క్రియేటర్.. ఫుటేజ్ కంటే ప్రశ్నలే ఎక్కువ ఎదురవ్వడంతో తన ప్రయాణాన్ని ముగించాడు.
వివరాళ్లోకి వెళ్తే... 'నా కోసం, నా జీవితం కోసం వీడియోలు తయారు చేస్తున్నాను.. నేను దీన్ని సృష్టించడం నాకు ఎంత సంతోషమో, ఇతరులు కూడా దీన్ని అలాగే ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను ' అనే ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్.. తన తాజా ఆఫ్గనిస్తాన్ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన (చేదు) అనుభవాలు ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ జో ఫేజర్, తన కెమెరామెన్ జాక్ తో కలిసి ఆఫ్గాన్ రాజధాన్ కాబూల్ లో ఐదు రోజులు పర్యటించి, డాక్యుమెంట్ చేయాలని భావించాడు. ఈ సమయంలో స్థానిక గైడ్ తో కలిసి ప్రయాణించడానికి, ప్రజలను కలవడానికి, స్థానిక ఆహారం ప్రయత్నించడానికి, ఆ దేశానికి సంబంధించిన వివరాలు అందించడానికి ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే... ఈ టూర్ కేవలం 24 గంటల్లోనే ముగిసింది. అందుకు కారణం.. వారికి అక్కడ ఎదురైన పరిస్థితులు.
అనుకున్నట్లుగానే ఇస్తాంబుల్ నుంచి కాబూల్ కు బయలుదేరారు జో & జాక్. ఈ సమయంలో విమానాశ్రయం నుంచి బయటకు రాగానే పలువురు స్థానికులు చిరునవ్వుతో పలకరించారు. దీంతో.. ఆఫ్గాన్ లో ఆతిథ్యం అద్భుతంగా ఉందనే అభిప్రాయానికి జో వచ్చాడు. ఈ క్రమంలో ఓ తాలిబాన్ సభ్యుడు కూడా వీరిని పలకరించాడు. అనంతరం.. వారిరువురూ స్థానిక గైడ్ ని కలుసుకున్నారు. కాబూల్ లోని ఓ బెస్ట్ హోటల్ లో చెక్-ఇన్ చేశారు.. స్థానిక దుస్తులను ధరించారు.
తాలిబాన్ సర్కార్ రూల్స్ స్టార్ట్!:
అంతవరకూ అద్భుతంగా అనిపించింది ఈ ఇద్దరికి. ఈ క్రమంలో హోటల్ నుంచి బయటకు వచ్చి, కొన్ని వీధుల దూరంలో ఉన్న మసీదును సందర్శించాలని భావించారు. ఈ క్రమంలో అక్కడ వారిని తాలిబాన్ అధికారులు ఆపారు. ఈ క్రమంలో జో చొక్కాకి ఉన్న మైక్రోఫోన్ గురించి ఆరా తీశారు. మైక్రోఫోన్ కలిగి ఉన్న నీకు.. జర్నలిస్ట్ వీసా ఉందా? అనే ప్రశ్న స్థానిక అధికారుల నుంచి జోకి ఎదురైంది. లేదనే సమాధానం అతని నుంచి వచ్చింది!
అనంతరం కాస్త తేరుకున్న జో... ఈ టూర్ కు ముందు తాను ట్రావెల్ కంపెనీలతో సంప్రదించినప్పుడు.. యూట్యూబ్ వ్లాగ్ కోసం టూరిస్ట్ వీసా సరిపోతుందని చెప్పారనే విషయం వెల్లడించారు! అయితే.. ఇప్పుడు రూల్స్ మారాయి! దీంతో... అధికారులు వీరి కెమెరా లెన్స్ ను బ్లాక్ చేసి, వీరిద్దరీ పాస్ పోర్టులను తీసుకొని వాటిని ఫోటో తీశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉత్సాహం సన్నగిల్లింది!
ఈ సమయంలో ఇటీవల ఇద్దరు యూట్యూబర్లు జైల్లో ఉన్నారనే విషయం జోకి వినిపించింది. వారు సుమారు మూడు నెలల నుంచి జైల్లో ఉన్నారని తెలిసింది. ఈ సందర్భంగా స్పందించిన గైడ్... కొత్త నియమాలు తెరపైకి వచ్చాయి, అనుమతులు లేకుండా చిత్రీకరణ చేయవద్దని చెబుతూ.. పర్యాటకుల మధ్య కొంతమంది గూఢచారులు ఉన్నారని ప్రభుత్వం భావిస్తుందని వివరించాడు. ఈ సమయంలో వీరి పాస్ పోర్టులు తనిఖీ చేసిన అధికారులు, వారిని వెళ్లనిచ్చారు!
వెంటనే హోటల్ కి వచ్చిన వీరిద్దరూ.. ఐదు రోజుల టూర్ ని కాస్తా అర్ధాంతరంగా ముగించాలని నిర్ణయించుకున్నారు. వారు నెక్స్ట్ ఫ్లైట్ కే టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా జో... తాము రూల్స్ ఉల్లంఘిస్తున్నామో లేదో మాకు తెలియదు, అయినప్పటికీ రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేద అని అంటూ కాబూల్ నుంచి బయలుదేరారు! ఈ క్రమంలో అతడు ఆఫ్గాన్ ను కేవలం 3 గంటలు మాత్రమే చూడగలిగాడు! అయితే.. నెక్స్ట్ టైం కెమెరా, మైక్ లేకుండా తిరిగి వస్తానని నొక్కి చెబుతున్నాడు.