తోటి ప్రయాణికుల్ని డేంజర్ లో పడేసేటోళ్లను వదలొద్దు సార్

రైల్లోని ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఒక మహిళ.. సీటు కోసం కోట్లాడలేదు. కానీ.. తన బెర్తులో కూర్చున్న కాసేపటికి తన బ్యాగ్ లో నుంచి ఎలక్ట్రిక్ కెటిల్ బయటకు తీశారు.;

Update: 2025-11-22 05:30 GMT

సరదా కోసం చేశారో.. ఇంకేం కారణంతో చేశారో కానీ.. ఆమె చేసిన ఒక పని తీవ్ర చర్చకు తెర తీయటమే కాదు.. సదరు వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావటం.. సదరు మహిళ తీరును చూసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటే.. రైల్వే అధికారులు మాత్రం వణికిపోయారు. ఎందుకంటే.. సదరు మహిళ తెలియకుండానే తన తోటి ప్రయాణికుల ప్రాణాల్నిరిస్కులో పడేయటమే దీనికి కారణం. ఇంతకూ అసలేం జరిగిందంటే..

రైల్లోని ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న ఒక మహిళ.. సీటు కోసం కోట్లాడలేదు. కానీ.. తన బెర్తులో కూర్చున్న కాసేపటికి తన బ్యాగ్ లో నుంచి ఎలక్ట్రిక్ కెటిల్ బయటకు తీశారు. దాన్ని ప్లగ్ లో ఫోన్ ఛార్జింగ్ సాకెట్ కు కనెక్టు చేశారు. అందులో నీళ్లు పోసి.. కెటిల్ హీట్ కాగానే.. అందులో మ్యాగీ వేసేశారు. మ్యాగీ రెఢీ అయిన వెంటనే.. తన కుటుంబ సభ్యులకు వడ్డించారు. దీన్ని సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆమె చేసిన పనిని పలువురు షేర్ చేయటంతో.. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆమె తీరును పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో అని కొందరు ఫన్నీగా రియాక్టు అయితే.. మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా స్పందంచారు. ఆమె అలా చేయటం చాలా ప్రమాదరకమని.. ఇలాంటి చేష్టలు చేసే వారిని వదిలి పెట్టొద్దని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారు సహేతుకమైన కారణాన్ని ఎత్తి చూపుతున్నారు. ఎలక్ట్రికల్ కెటిల్ ను వాడటం ద్వారా ట్రైన్ లోని ఎలక్ట్రికల్ సర్క్యూట్ మీద అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని.. ఇది ట్రైన్ లోని మిగిలిన ప్రయాణికులతో పాటు.. ఆమె ప్రాణాలకు సైతం ముప్పు అన్న విషయాన్ని ఆమె గుర్తించకపోవటమేంటని మండిపడుతున్నారు. మాజీ రైల్వే అధికారులు సైతం ఆమె వ్యవహరించిన తీరు చాలా డేంజర్ గా పేర్కొంటున్నారు. మరి.. రైల్వే శాఖ ఈ మహిళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Tags:    

Similar News