• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  'వందల కోట్ల' బాంబుతో...

'వందల కోట్ల' బాంబుతో రేవంత్ పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసిన ఏజీ రజినీకాంత్ రెడ్డి మధ్య వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కేఏ పాల్ ఆరోపించారు. తనపై ఉన్న 89 క్రిమినల్ కేసులను కొట్టేయించుకునేందుకే ఈ సిఫార్సు చేశారని విమర్శించారు. ఈ నియామకాన్ని ఆమోదించవద్దంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టలేదు.

By - Tupaki Desk
Update: 2026-11-25 07:04 GMT

కేఏ పాల్.. ప్రజాశాంతి వ్యవస్థాపకుడు.. ఎప్పుడు తెలుగు రాజకీయాల్లోకి వస్తాడో? ఎప్పుడు అమెరికా వెళతాడో ఎవరికీ తెలియదు.. ఏకంగా పవన్ కళ్యాణ్ ను సైతం తన పార్టీలోకి ఆహ్వానించగల నేర్పరితనం ఆయన సొంతం.. వినడానికి అందరికీ కామెడీలానే ఉన్నా.. ఆయన సీరియస్ టోన్ లో చేసే విమర్శలు కాకరేపుతుంటాయి.. మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వదు కానీ పాల్ గారి మాటలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి.

ఉదయం లేస్తే చాలు.. అధికార పక్షం ఒక బాణం వదిలితే, ప్రతిపక్షం మరో క్షిపణిని ప్రయోగించడం తెలంగాణ రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే , ఇప్పటివరకు అసెంబ్లీ వేదికలకో.. ప్రెస్ మీట్లకో పరిమితమైన ఈ పొలిటికల్ డ్రామా.. ఇప్పుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. ప్రపంచ శాంతి దూతగా తనను తాను అభివర్ణించుకునే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణల బాంబు పేల్చారు.

ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్ రెడ్డి పేరును హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడమే ఈ కొత్త వివాదానికి మూలం. ఈ సిఫార్సు వెనుక పెద్ద కథే నడిచిందని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. ఆయన మాటల ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రజినీకాంత్ రెడ్డికి మధ్య వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయట. అంతేకాదు తనపై ఉన్న 89 క్రిమినల్ కేసులను కొట్టేయించుకునే వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ నియామక సిఫార్సు చేశారని పాల్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యవహారాన్ని కేవలం మీడియా ముందు చెప్పి ఊరుకోకుండా నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాసినట్లు కేఏ పాల్ ప్రకటించారు. రజినీకాంత్ రెడ్డి పేరును కొలీజియం ఆమోదించవద్దని.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని ఆ లేఖలో కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో ఆరోపణలు చేయడం చాలా సులభం. మైకు ముందు నిలబడి వందల కోట్లు.. వేల కోట్లు అని లెక్కలు చెప్పేయడం నాయకులకు అలవాటే. కానీ కేఏ పాల్ చేసిన ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు బయట పెట్టలేదు. పైగా కోర్టుకు ఎక్కారు. మరి కోర్టులో ఆధారాలు బయటపెడుతారా? లేదా అన్నది చూడాలి.

అయినప్పటికీ న్యాయమూర్తుల నియామక ప్రక్రియ వంటి అత్యంత సున్నితమైన అంశంపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం సహజంగానే చర్చకు దారితీస్తుంది. ఒకవైపు 89 కేసుల ప్రస్తావన.. మరోవైపు వందల కోట్ల ఆరోపణలు కలగలిసి ఈ అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చేశాయి.

ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. కేఏ పాల్ లేఖ రూపంలో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అయితే పాల్ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని కౌంటర్ ఇస్తుందా? లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుని వదిలేస్తుందా అనేది చూడాలి.

న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం చెక్కుచెదరకుండా ఉండాలంటే నియామకాల్లో పారదర్శకత ఎంత ముఖ్యమో... నిరాధారమైన ఆరోపణలకు అడ్డుకట్ట వేయడం కూడా అంతే ముఖ్యం. రాజకీయ నాయకుల ఆరోపణలు.. మైకుల హోరు ఎలా ఉన్నా.. అంతిమంగా నిజానిజాలను తేల్చాల్సింది మాత్రం చట్టం, రాజ్యాంగ వ్యవస్థలే...

Tags:    
  • kapaul 
  • revanthreddy 
  • telanganapolitics 
  • prajashantiparty 

Similar News

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!

2026-11-25 07:05 GMT

సందీప్ సర్దుబాట ... కాంగ్రెస్ కి రాచ బాటేనా ?

2026-11-25 04:02 GMT

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

బెంగళూరు, ముంబైకి షాక్.. ఉద్యోగాల కల్పనలో మన హైదరాబాదే తోపు

2026-11-24 12:46 GMT

ఆస్తుల ప్రదర్శనతో చిక్కులు.. గోల్డ్ మ్యాన్ యాదగిరికి ఐటీ షాక్

2026-11-24 08:09 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?

2026-11-23 02:36 GMT

మళ్ళీ గెలిచేది మనమే...రేవంత్ ధీమా వెనక ?

2026-11-23 02:34 GMT

పిలవని పేరంటానికి వెళ్తే బిర్యానీ కాదు.. రూ.5 వేల బిల్లు.. ఫంక్షన్ హాళ్ల సెక్యూరిటీ షాక్

2026-11-23 02:33 GMT

Copyright @2026

Powered by Blink CMS