• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  గడ్డమే రేవంత్, కేటీఆర్...

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

| తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గడ్డం చుట్టూ తిరుగుతున్నాయి. కేటీఆర్ గడ్డంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తన గడ్డం సీఎంకు ఎందుకు అడ్డమొచ్చిందని ప్రశ్నిస్తూ, ముందు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిరుద్యోగం, రైతు సమస్యలపై చర్చించాల్సిన నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడంపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2026-11-23 07:03 GMT

గడ్డం చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. గడ్డం ఉండబట్టే తనను జనాలు ఆదరించారన్న స్థాయిలో సీఎం రేవంత్ మాటల మంటలు రేపారు. ఇక లేటెస్ట్ గా గడ్డం పెంచిన కేటీఆర్.. సీఎం ‘గడ్డం’పట్టుకొని వేలాడుతున్నాడని.. ముందు ప్రజా సమస్యలు తీర్చు కాస్త ఆలోచించు అంటూ కౌంటర్ పాలిటిక్స్ షురూ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో గడ్డమే నేతలకు అడ్డంగా మారి ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమవుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు..

తెలంగాణ రాజకీయాల్లో ఈ దుమ్మెత్తిపోసుకోవడాలు.. వ్యక్తిగతంతో తిట్టుకోవడాలు సర్వసాధారణం.. కానీ ఈసారి టాపిక్ మారింది. అదే హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పాలన.. అభివృద్ధి.. హామీల అమలు వంటి అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వేడివేడి చర్చలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సాగుతున్న విమర్శల పర్వం మాత్రం విభిన్నంగా 'గడ్డం' చుట్టూ తిరుగుతోంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఆహార్యాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎంత గడ్డం పెంచినంత మాత్రాన తనలా కాలేరంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ వైరల్ అయ్యాయి. కేటీఆర్ గడ్డం పెంచడాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ లాంటి బతుకును ఎవరూ కోరుకోరంటూ సెటైర్లు వేశారు.. అసలు తన గడ్డం ముఖ్యమంత్రికి ఏం అడ్డం వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో పాలన సరిగ్గా సాగడం లేదని.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఇతరులెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చెరువులో దూకేవారని.. రేవంత్ పొట్టిగా ఉన్నందున బకెట్‌లో దూకితే సరిపోతుందంటూ కేటీఆర్ దుమ్మెత్తిపోశారు.

రాష్ట్రంలో నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన సమయంలో నేతల మధ్య వ్యక్తిగత ఆరోపణలు, ఎత్తు.. గడ్డం వంటి అంశాలపై మాటల యుద్ధం సాగడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.. రాజకీయ విమర్శలు హుందాగా.. ప్రజా సమస్యల చుట్టూ తిరిగితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యక్తిగత విమర్శల పర్వానికి ఇక్కడితో తెరపడుతుందో... లేక మరిన్ని కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • revanthreddy 
  • ktr 
  • telanganapolitics 
  • brs 
  • congress 

Similar News

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?

2026-11-23 02:36 GMT

మళ్ళీ గెలిచేది మనమే...రేవంత్ ధీమా వెనక ?

2026-11-23 02:34 GMT

పిలవని పేరంటానికి వెళ్తే బిర్యానీ కాదు.. రూ.5 వేల బిల్లు.. ఫంక్షన్ హాళ్ల సెక్యూరిటీ షాక్

2026-11-23 02:33 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

Copyright @2026

Powered by Blink CMS