• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  మళ్ళీ గెలిచేది...

మళ్ళీ గెలిచేది మనమే...రేవంత్ ధీమా వెనక ?

| 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 119 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 90 సీట్లు వస్తాయని, 17 ఎంపీ స్థానాల్లో 15 గెలుస్తామని అంచనా వేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమకు కలిసివస్తాయని పేర్కొంటూ, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

By - Satya P
Update: 2026-11-23 02:34 GMT

గతంలో కాంగ్రెస్ ని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకుని వచ్చిన డాక్టర్ వైఎస్సార్ నిబ్బరంగా ఒక మాట చెబుతుండేవారు. మళ్లీ గెలిచేది మనదే అని. ఇపుడు అంతే ధీమాగా తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఒకసారి కాదు రెండోసారి కూడా తెలంగాణాలో గెలిచేది కాంగ్రెస్ మాత్రమే అని ఆయన అంటున్నారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కాగా అధికారంలోకి వస్తుందని ఆయన అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇంత ఆత్మ విశ్వాసంతో ఈ మాట చెప్పడం వెనక కారణాలు ఏమిటి ఆయన వ్యూహాలు ఏమిటి అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.

వ్యూహాలు ఎత్తుగడలు :

కాంగ్రెస్ ని మళ్లీ అధికారంలోకి ఎలా తేవాలో తగిన వ్యూహాలు ఎత్తుగడలు తమకు ఉన్నాయని రేవంత్ రెడ్డి తాజాగా హైదరాబాద్ లోని జరిగిన పార్టీ సమావేశంలో చెప్పుకొచ్చారు. పార్టీని ఎలా మళ్ళీ నెగ్గించాలో ఆ బాధ్యత తాము తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే కార్యకర్తలు మాత్రం పట్టుదలగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకుని పోవాలో పెద్దలు అంతా ఆలోచిస్తామని కూడా ఆయన చెప్పారు. పనిచేసిన వారికి అవకాశాలు కచ్చితంగా పార్టీ ఇస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కష్టపడితే కాంగ్రెస్ లో గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి హోదాలో స్పష్టం చేశారు. ఎవరూ కోరకుండానే అసలైన కార్యకర్తలకు పదవులు ఇవ్వడం ఖాయమని కూడా చెప్పారు. పార్టీ గెలుపు కోసం మాత్రం అంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ కి 90 సీట్లు :

ఇక రేవంత్ రెడ్డి మరో మాట అన్నారు. 119 ఎమ్మెల్యే సీట్లు కనుక ఇలాగే పెరగకుండా ఉంటే అందులో కాంగ్రెస్ గెలిచేది కచ్చితంగా 90 దాకా అని చెప్పారు. అంటే 2023 లో గెలిచిన 64 సీట్లకు మరో 26 సీట్లు అదనం అన్న మాట. మరి బీఆర్ఎస్ కి బీజేపీకి ఆ మిగిలిన 29 సీట్లలోనే పంచుకోవాల్సిందే అన్నది కూడా రేవంత్ రెడ్డి మాటలలో కనిపిస్తోంది. నలభై దాకా బీఆర్ఎస్ 2023లో గెలిచింది, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. మరి ఈ రెండు పార్టీలూ కలసి 29 కే పరిమితం అవుతాయని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు అంటే ఆయన పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అంతే కాదు మొత్తం 17 ఎంపీ సీట్లకు 15 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని కూడా రేవంత్ రెడ్డి నమ్మకంగా చెబుతున్నారు. ఆ మిగిలిన రెండులో ఒకటి కచ్చితంగా మజ్లిస్ కి పోతే ఒక్క సీటు బీజేపీకి బీఆర్ఎస్ లలో ఎవరికి దక్కుతుందో మరి అంటున్నారు.

పధకాలు ప్లస్ అభివృద్ధి :

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అలాగే అభివృద్ధిని నమ్ముకున్నారని అంటున్నారు. ఉచిత బస్సు పధకం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలే మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పధకాలు అన్నీ పార్టీల కతీతంగా అందరికీ అందిస్తున్నామని ఆయన చెబుతున్నారు. అలాగే కోటి కుటుంబాలకు జీవిత బీమా అమలు చేస్తున్నామని ఇలా అన్నీ కలసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తాయని అంటున్నారు. అలాగే మరో వైపు అభివృద్ధి కూడా శరవేగంగా సాగుతోంది అని ఆయన అంటున్నారు.

త్రిముఖ పోరుతోనే :

ఎక్కడైనా బహుముఖ పోటీలు ఉంటే అధికార పార్టీకి ఎంతగానో కలసి వస్తుంది. తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ బలంగానే ఉంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి తాము తెలంగాణాలో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. దాతో 2028 ఎన్నికలు గట్టి ఫైట్ గానే ఉండబోతున్నాయి. ఎంతలా ఈ త్రిముఖ పోరు సాగితే అంతగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ అని అంటున్నారు. కాంగ్రెస్ ని కావాలనుకున్న ఓటు అటే పడుతుంది, వద్దు అనుకున్న ఓటే చీలుతుంది. దీంతో ఈ రకమైన లెక్కలు కూడా కాంగ్రెస్ ని మరోసారి అధికారంలోకి తెచ్చే అవకాశాలను అధికం చేస్తున్నాయని అంటున్నారు.

Tags:    
  • revanthreddy 
  • telanganacongress 
  • telanganapolitics 
  • congress 

Similar News

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?

2026-11-23 02:36 GMT

పిలవని పేరంటానికి వెళ్తే బిర్యానీ కాదు.. రూ.5 వేల బిల్లు.. ఫంక్షన్ హాళ్ల సెక్యూరిటీ షాక్

2026-11-23 02:33 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

Copyright @2026

Powered by Blink CMS