• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  Hyderabad >  హైదరాబాద్‌లో ఉగ్రదాడుల...

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?

| హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడులు జరుపుతామని, 300 మందిని లక్ష్యంగా చేసుకుంటామని వచ్చిన బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాపై దాడి చేస్తామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమై ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు చేపట్టారు.

By - A.N.Kumar
Update: 2026-11-23 02:36 GMT

హైదరాబాద్ లో ఉగ్రదాడుల బెదిరింపు ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ పోలీసు యంత్రాంగానికి అందిన ఓ బెదిరింపు సందేశం ఒక్కసారిగా భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసింది. 2008 నాటి ముంబై 26/11 ఉగ్రదాడుల తరహా మారణహోమాన్ని హైదరాబాద్‌లో పునరావృతం చేస్తామని.. కనీసం 300 మంది అమాయకుల ప్రాణాలను బలిగొనడమే తమ లక్ష్యమని ఆ మెయిల్‌లో పేర్కొనడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ బెదిరింపు ఈమెయిల్‌లో ప్రధానంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు సమీపంలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుంటామని దుండగులు హెచ్చరించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల చేతిలో హతమైన లష్కరే తోయిబా టాప్ కమాండర్.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే హైదరాబాద్‌పై ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆ మెయిల్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ బెదిరింపు సమాచారం అందిన తక్షణమే హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా రంగంలోకి దిగి లోతైన దర్యాప్తును ప్రారంభించాయి. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది? ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? దీని వెనుక నిజంగానే ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందా? లేక ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా ఆకతాయిలు చేసిన ఆకతాయి పనా? అనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.

ముందుజాగ్రత్త చర్యగా నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రముఖ హోటళ్లు, షాపింగ్ మాల్స్ , ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు.. వాహనాలు.. గుర్తుతెలియని వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని.. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో త్వరలోనే తేలనుంది.

Tags:    
  • hyderabad 
  • terrorthreat 
  • kachiguda 
  • hyderabadpolice 
  • securityalert 

Similar News

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

‘‘అండాలు ఇస్తే రూ. 50 వేలు’’ హైదరాబాద్ లో దారుణం, తండ్రి చికిత్స కోసం వచ్చి ఇరుక్కుపోయిన యువతి

2026-11-15 20:24 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో బిగ్ ట్విస్ట్.. రేవంత్ హింట్

2026-11-14 03:20 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

Copyright @2026

Powered by Blink CMS