• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Jobs >  బెంగళూరు, ముంబైకి షాక్.....

బెంగళూరు, ముంబైకి షాక్.. ఉద్యోగాల కల్పనలో మన హైదరాబాదే తోపు

| వైట్ కాలర్ ఉద్యోగాల కల్పనలో 2026లో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఫౌండిట్ నివేదిక ప్రకారం, జనవరి నుంచి అక్టోబర్ వరకు నగరంలో ఉద్యోగ నియామకాలు 8.51 శాతం పెరిగాయి. బెంగళూరులో 6.71%, ముంబైలో 6.15% వృద్ధి నమోదైంది. 2027లోనూ హైదరాబాద్ 10.33 శాతం ఉద్యోగ వృద్ధిని సాధిస్తుందని నివేదిక అంచనా వేసింది.

By - A.N.Kumar
Update: 2026-11-24 12:46 GMT

ఒకప్పుడు మంచి ఉద్యోగం సంపాదించాలంటే.. జీవితంలో స్థిరపడాలంటే ఏ బెంగళూరుకో.. ముంబైకో వలస వెళ్లాల్సి వచ్చేది. కన్నవారిని.. పుట్టిన ఊరిని వదిలి వేల మైళ్ల దూరం వెళ్లలేక ఎంతోమంది యువత తమ కలలను మనసులోనే చంపుకునేవారు. కానీ కాలం మారింది.. మన భాగ్యనగరం ఇప్పుడు దేశానికే దిక్సూచిగా నిలిచింది.. అవును.. వైట్ కాలర్ ఉద్యోగాల కల్పనలో దేశంలోని దిగ్గజ నగరాలన్నింటినీ వెనక్కి నెట్టి 2026లో మన హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్న వార్త ప్రతి తెలుగు గుండెను గర్వంతో ఉప్పొంగేలా చేస్తోంది.

ప్రముఖ జాబ్ పోర్టల్ ఫౌండిట్ విడుదల చేసిన తాజా నివేదిక నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన శుభవార్తను మోసుకొచ్చింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ మధ్య దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు కేవలం 3.30 శాతం మాత్రమే పెరిగితే.. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 8.51 శాతం వృద్ధి నమోదైంది. ఒకప్పుడు ఐటీ రంగానికి రారాజుగా వెలిగిన బెంగళూరు 6.71%, ఆర్థిక రాజధాని ముంబై 6.15% సైతం మన హైదరాబాద్ వేగం ముందు తలవంచాయి. కోల్‌కతా, చండీగఢ్ వంటి నగరాల్లో ఉద్యోగాలు తగ్గిపోయి నిరాశ అలుముకున్న వేళ హైదరాబాద్ మాత్రం ఆశల దీపంలా వెలుగుతోంది.

ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్‌నే మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా అనలిస్టులు, ఫైనాన్స్ నిపుణులు ఇలా ఎందరో యువతీయువకుల కళ్లల్లో మెరుపులు కనిపిస్తున్నాయి. అప్పుడే చదువు పూర్తి చేసుకుని భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో నగరంలో అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికీ హైదరాబాద్ అమ్మలా అక్కున చేర్చుకుని ఉపాధి కల్పిస్తోంది.

ఈ విజయ ప్రస్థానం ఇక్కడితో ఆగిపోదు. 2027లో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు 8.16 శాతం పెరిగి.. ఏకంగా 1.38 కోట్లకు చేరుకోనున్నాయని నివేదిక చెబుతోంది. ముఖ్యంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ 14.25%, రిటైల్ 13.99%, తయారీ రంగం 12.02%, లాజిస్టిక్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాల జాతర జరగనుంది. 2027లోనూ హైదరాబాద్ 10.33 శాతం వృద్ధితో దేశంలోనే టాప్-3లో తన సత్తా చాటనుంది.

అయితే ఈ అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ , డేటా అనలిటిక్స్, డిజిటల్ నైపుణ్యాలను ఒంటబట్టించుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. కష్టపడే తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు.. మీ కలలను నిజం చేయడానికి మన హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది..

Tags:    
  • hyderabad 
  • hyderabadjobs 
  • jobgrowth 
  • employment 
  • founditreport 
  • itjobs 

Similar News

24 గంటల్లో రాజీనామా లేదంటే ఉద్వాసన.. టెక్ దిగ్గజం గూగుల్‌లో అసలేం జరుగుతోంది?

2026-11-24 09:54 GMT

ఏఐ యుగంలో మనుషుల పని మారనుందా? ఉద్యోగాల నుంచి ప్రకృతి, సంస్కృతి వైపు కొత్త ప్రయాణం..

2026-11-23 12:28 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

మ్యాన్ పవర్.. భారత్ కు బిగ్గెస్ట్ అడ్వంటేజ్ కాబోతోందా?

2026-10-31 10:30 GMT

మైక్రోసాఫ్ట్ 60 వేల మందికి బైఔట్ ఆఫర్.. కానీ బయటకు వెళ్లేది 3 వేల మందేనా?

2026-10-31 05:17 GMT

'టెక్' కన్నీళ్లు.. రోజుకు 654 కుటుంబాల్లో ఆరిపోతున్న ఆశల దీపాలు

2026-10-29 09:20 GMT

నువ్వు ఎంతో తోపు అయినా నీ జాబ్ ఉండదు.. ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు.. కారణమిదీ..

2026-10-28 06:42 GMT

"సిస్టమ్ షట్‌డౌన్" అయ్యే ప్రమాదం ఉంది గురూ.. భారత ఐటీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు తప్పవా?

2026-10-27 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS