నువ్వు ఎంతో తోపు అయినా నీ జాబ్ ఉండదు.. ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు.. కారణమిదీ..

మొన్న ఆర్థిక మాంద్యం పేరు చెప్పి మెడ కోశారు.. నిన్న రీస్ట్రక్చరింగ్ అంటూ ఇంటికి పంపేశారు.. తాజాగా ఏఐ వచ్చిందంటూ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లెటర్ చేతిలో పెడతారు..

Update: 2026-10-28 06:42 GMT

మొన్న ఆర్థిక మాంద్యం పేరు చెప్పి మెడ కోశారు.. నిన్న రీస్ట్రక్చరింగ్ అంటూ ఇంటికి పంపేశారు.. తాజాగా ఏఐ వచ్చిందంటూ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లెటర్ చేతిలో పెడతారు.. టెక్నాలజీ మారుతోంది.. కంపెనీల వ్యూహాలు రోజుకో రకంగా మారుతున్నాయి.. కానీ ఉద్యోగుల భద్రత మాత్రం సర్కస్ లో కత్తి మీద సాములా తయారైంది. ఒకప్పుడు చేతిలో డిగ్రీ.. మెడలో కంపెనీ ఐడీ కార్డు ఉంటే చాలు.. జీవితానికి తిరుగులేదని కాలర్ ఎగరేసేవారు. ఈఎంఐలు, పిల్లల ఫీజులు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ ఆ నెలనెలా వచ్చే జీతం మీదే ఆధారపడేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.

ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ తాజాగా 60వేల మందిని పొమ్మనలేక పొగపెడుతోంది. అందరూ వాలంటరీ రిటైర్ మెంట్ తరహాలో స్కీం పెట్టి ఎగ్జిట్ తీసుకోవాలని.. ప్యాకేజీ తీసుకొని జాబ్ నుంచి వైదొలగాలని ఒక షాకింగ్ ఆఫర్ ఇచ్చింది. మేము పోము.. హక్కులు పోరాటాలంటే మన బొక్కలు, లెక్కలు బయటకు పంపి ఇచ్చే ప్యాకేజీ కూడా ఇవ్వకుండా మెడపట్టి గెంటేస్తారన్న మాట.. కంపెనీ చెప్పిన ప్రకారం తప్పుకుంటే అంతో ఇంతో లాభంగా పంపించేస్తారు. తిరగబడితే రోడ్డున పడేస్తారన్నట్టు ఈ స్కీం గురించి చూచాయగా చెప్పాలంటే..

పదేళ్ల అనుభవం ఉందనో.. ప్రాజెక్టులకు లీడర్ ననో గర్వపడితే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసుల్లో మనుషుల మధ్య పోటీ పోయి, మనుషులు వర్సెస్ ఏఐ మధ్య అసలు సిసలు కురుక్షేత్రం నడుస్తోంది. గంటల తరబడి చేసే కోడింగ్.. నిమిషాల్లో తయారయ్యే రిపోర్టులు.. కంటెంట్ డ్రాఫ్టింగ్.. అన్నీ ఏఐ చిటికెలో చేసేస్తుంటే.. కంపెనీలకు మీతో పనేముంటుంది చెప్పండి? లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న చదువులు.. నైపుణ్యాలు ఒక్క రాత్రిలో కాలం చెల్లిన మొబైల్స్ లా మారిపోతున్నాయి.

కంపెనీల తీరే పెద్ద వ్యంగ్యం.. ఉద్యోగులందరూ నిరంతరం అప్ స్కిల్ కావాలని ఉచిత సలహాలు ఇస్తాయి. ఆ టెక్నాలజీ మనం నేర్చుకునే లోపే "ఖర్చులు తగ్గించుకుంటున్నాం బాబూ" అంటూ ఉద్వాసన పత్రం చేతిలో పెడతాయి. అంటే నేర్చుకోవడం ఉద్యోగి బాధ్యత.. ఎప్పుడు తీసేయాలో నిర్ణయించడం కంపెనీ హక్కు అన్నమాట.. ఇదేంత చోద్యం. అందుకే ఎవ్వరి ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. ఎంత స్కిల్ ఉన్నా.. తోపు ఉన్నా ఏఐ, ఆటోమేషన్ ముందర మన స్కిల్, తోపు నెస్ ఎందుకు పనికిరావన్న మాట..

మరి ఈ ఏఐ సునామీ నుంచి బతకాలంటే దారి లేదా? కేవలం ఒకే కంపెనీని నమ్ముకుని.. ఒకే టెక్నాలజీని పట్టుకుని కూర్చుంటే రక్షణ లేదు. ఏఐతో పోటీ పడటం మానేసి.. దానితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్సింగ్, ఇతర ప్రత్యామ్మాయలపై కన్నేయాలి. అకౌంట్లో ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే రేపు కార్పొరేట్ కత్తి ఎవరి మెడపై పడుతుందో ఎవరికి తెలుసు? అర్థం చేసుకోండి నాయనలారా..

ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకుంటుందా లేదా అనేది పక్కనపెడితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా మీ ఆలోచనలు ఎంత వేగంగా మారుతున్నాయనేదే మీ కెరీర్‌కు అసలైన గ్యారెంటీ.. ఈ ఏఐ కాలంలో ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఏది బెస్ట్ రూట్? అప్ స్కిల్ కావడం.. ఏఐని వాడటం నేర్చుకోవడం.. లేక సొంతంగా ఏ కిరణా దుకాణమో.. వ్యాపారమే బెటర్ అంటారా? చివరకూ అదే ప్రశాంతత ఇచ్చేలా ఉంది.. ఈ ఒత్తిడి ఉద్యోగాల కంటే.. ఆ దిశగా ఆలోచించి అడుగేయండి..

Tags:    

Similar News