• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Telangana >  సందీప్ సర్దుబాట ......

సందీప్ సర్దుబాట ... కాంగ్రెస్ కి రాచ బాటేనా ?

| తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతిని చక్కదిద్దేందుకు అధిష్టానం రంగంలోకి దింపిన బీఎన్ సందీప్ వేగంగా పావులు కదుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనూ చర్చించి ఆయన అసంతృప్తిని తెలుసుకున్నారు. అందరినీ కలుపుకుని పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

By - Satya P
Update: 2026-11-25 04:02 GMT

తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెట్టేందుకు అధినాయకత్వం కర్ణాటకకు చెందిన బీ ఎన్ సందీప్ వంటి కీలక నేతను రంగంలోకి దింపింది. గతంలో మీనాక్షి నటరాజన్ వల్ల కానిది ఇపుడు సందీప్ సర్దుబాటు చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. పార్టీ నియామకం తరువాత తొలిసారి తెలంగాణాకు వచ్చిన సందీప్ తన పని ఏమిటో తెలుసుకున్నారు, చాలా వేగంగా పావులు కదిపారు. ఎక్కడ ఏమి జరుగుతోంది అన్నది ఆయన ముందే కసరత్తు చేసుకుని వచ్చినట్లుగా ఉందని కూడా అంటున్నారు. ఆయన ఒక రోజు అయితే పార్టీ నేతలందరితో వరసగా మీటింగ్స్ నిర్వహించారు. అంతే కాదు అసంతృప్తులను పిలిచి వారితో చర్చించారు. మొత్తంగా కాంగ్రెస్ లో అయితే సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చారు అని అంటున్నారు.

పట్టున్న నేతగా :

ఇంతకీ ఎవరీ సందీప్ అంటే ఆయన సంస్థాగత వ్యవహారాలలో పట్టున్న నేత అని అంటున్నారు. ఆయన గతంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు కూడా పార్టీ తరఫున పనిచేశారు. ఆయా రాష్ట్రాలలో సంస్థాగత వ్యవహారాలను ఒక గాటికి తెచ్చారని కూడా అంటున్నారు. అందుకే ఏరి కోరి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు అని చెబుతున్నారు. పార్టీలో అందరితో మాట్లాడి లోతుగానే సమీక్ష చేసిన సందీప్ కి వాస్తవాలు అన్నీ అవగాహన అయ్యాయనే అంటున్నారు. అంతే కాదు ఆయన పార్టీ తరఫున ఒక భరోసా ఇస్తూ మొత్తం అందరినీ కలుపుకొని పోయే విధంగా వ్యవహరించడం కూడా చాలా మందికి నచ్చింది అని అంటున్నారు. కో ఆర్డినేషన్ కోపరేషన్ అన్న విధానంతో సందీప్ ముందుకు సాగుతున్నారని అంటున్నారు.

కోమటి రెడ్డితో :

ఇక సందీప్ రాక ముందే ఒక విషయం మీద అయితే తెర చర్చ సాగింది. మునుగోడు కాంగ్రెస్ ఎమెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బాహాటంగానే విమర్శలు చేశారు. దాంతో ఆయన మీద యాక్షన్ ఉండొచ్చు అన్నది కూడా ప్రచారంగా ఉంది. అయితే సందీప్ తన పర్యటనలో కోమటిరెడ్డితో చర్చించారు. ఆయన అంతరంగం తెలుసుకున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా ఆయనకు పార్టీ తరఫున హామీ ఇచ్చారని చెబుతున్నారు. పార్టీలో అందరికీ సమాన గౌరవం ఉంటుందని చెబుతూనే ప్రభుత్వం తరఫున నిధులు మునుగోడుకు అందేలా చూస్తామని చెప్పారని అంటున్నారు. అదే విధంగా మంత్రి పదవి హామీ గురించి కూడా హైకమాండ్ తో మాట్లాడుతామని చెప్పారని అంటున్నారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలతో కూడా సందీప్ చర్చించి పార్టీ పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే తనతో చెప్పాలని సూచించారని అంటున్నారు. మొత్తానికి అసంతృప్తులకు ఫైర్ బ్రాండ్ నేతలకు ఒక చాన్స్ ఇస్తూ వారిని కూడా కలుపుకుని పోవాలని సందీప్ చేసిన ఈ ప్రయత్నం కాంగ్రెస్ లో కొత్త చర్చకు తావిస్తోంది.

అందరికీ కలుస్తూ :

సందీప్ తాను వచ్చిన పని ఏదో తెలుసుకుని మరీ వరస మీటింగ్స్ నిర్వహించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను పార్టీ నేతలను ఆయన కలసి అటు ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది, ఇటు పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉంది అన్నీ కూడా ఆయన పూర్తి అవగాహన పెంచుకున్నారని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే అటు అసమ్మతి నేతలకు ఇటు పార్టీ పెద్దలకు కూడా సందీప్ మార్క్ పనితనం నచ్చేసింది అని అంటున్నారు. సందీప్ అజెండా ఒక్కటే ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఏకత్రాటిపైకి ముందుకు సాగడం. ఆ దిశగా కదిలితే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా చెబుతున్నారు. ఆ రూట్ లోనే ఆయన ప్రయత్నాలు కూడా ఉంటున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ ని ఒక దారిలో పెట్టే ప్రయత్నంలో సందీప్ అయితే సక్సెస్ అవుతున్నారనే అంటున్నారు.

Tags:    
  • bnsandeep 
  • telanganacongress 
  • revanthreddy 
  • komatireddyrajagopalreddy 

Similar News

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

బెంగళూరు, ముంబైకి షాక్.. ఉద్యోగాల కల్పనలో మన హైదరాబాదే తోపు

2026-11-24 12:46 GMT

ఆస్తుల ప్రదర్శనతో చిక్కులు.. గోల్డ్ మ్యాన్ యాదగిరికి ఐటీ షాక్

2026-11-24 08:09 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

గడ్డమే రేవంత్, కేటీఆర్ లకు అడ్డంగా మారిందా?

2026-11-23 07:03 GMT

మిషన్ 2028.. కాదు కాదు మిషన్ 2034.. రేవంత్ రెడ్డి 90 సీట్ల కలల సౌధం

2026-11-23 04:37 GMT

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?

2026-11-23 02:36 GMT

మళ్ళీ గెలిచేది మనమే...రేవంత్ ధీమా వెనక ?

2026-11-23 02:34 GMT

పిలవని పేరంటానికి వెళ్తే బిర్యానీ కాదు.. రూ.5 వేల బిల్లు.. ఫంక్షన్ హాళ్ల సెక్యూరిటీ షాక్

2026-11-23 02:33 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS