• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  హైదరాబాదీలకు బిగ్ షాక్.....

హైదరాబాదీలకు బిగ్ షాక్.. టెస్టు మ్యాచ్ కు ఆ స్టార్ దూరం

| ఈ నెల 25 గురువారం నుంచి హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్యన మొదటి టెస్టు జరగనుంది.

By - Tupaki Desk
Update: 2024-01-22 15:30 GMT

రాకరాక హైదరాబాద్ కు టెస్టు క్రికెట్ ఆతిథ్యం అవకాశం దక్కింది. వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా మ్యాచ్ ఒక్కటీ లేదు.. టి20ల్లోనూ ఐపీఎల్ మ్యాచ్ లు తప్ప అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణ తక్కువే. ఎప్పుడో ఐదేళ్ల కిందట హైదరాబాద్ లో ఓ టెస్టు మ్యాచ్ జరిగినట్లు గుర్తు. అది కూడా వెస్టిండీస్ తో. అలాంటి సమయంలో ఏకంగా ఇంగ్లండ్ వంటి దూకుడైన జట్టుతో టెస్టు మ్యాచ్ నిర్వహణ భాగ్యం దక్కింది. ఇంకేం..? హైదరాబాదీలతో పాటు తెలుగు వారంతా ఆనందంతో ఉన్నారు. ఉప్పల్ మైదానంలో మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, వారికి ఊహించని విధంగా నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. టెస్టు మ్యాచ్ లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే స్టార్ క్రికెటర్ తొలి రెండు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

వ్యక్తిగత కారణాలతో...

ఈ నెల 25 గురువారం నుంచి హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్యన మొదటి టెస్టు జరగనుంది. దీనికోసం స్కూలు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మ్యాచ్ కు టికెట్ల విక్రయాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక మ్యాచ్ కు తగిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. టీమిండియా ఆదివారం ఉప్పల్ మైదానంలో ప్రాక్టీస్ చేసింది. ఇంగ్లండ్ జట్టు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. ఇలాంటి సమయంలో భారత అభిమానులకు పిడుగులాంటి వార్త. హైదరాబాదీలను పూర్తిగా నిరాశలో ముంచే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సిరీస్ లో మొదటి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉండాలని నిర్ణయించకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ మ్యాచ్‌ లు ఆడడం లేదు. ఈ విషయాన్నిబీసీసీఐ ట్వీట్ చేసింది. ఇప్పటికే మొదటి రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు. స్టార్ పేసర్ షమీ మూడో టెస్టు నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కోహ్లి కూడా తొలి రెండు టెస్టులు ఆడకూడదని నిర్ణయించిన నేపథ్యంలో వీరద్దరూ హైదరాబాద్ మ్యాచ్ దూరమైనట్లే.

ఏమిటా కారణం..?

టీమిండియాకు అత్యంత అవసరమైన సందర్భంలో కోహ్లి రెండు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం కాస్త సంచలనమే. అయితే, అఫ్ఘాన్ తో టి20 సిరీస్ కు కూడా కోహ్లి ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. తొలి టి20లో అతడు ఆడలేదు. ఇప్పుడు మరోసారి అలానే చేయడంతో చర్చనీయాంశం అవుతోంది. కాగా.. ఈసారీ వ్యక్తిగత కారణాలను చూపుతుండడంతో కోహ్లి కుటుంబంలో ఏదైనా కార్యక్రమం ఉందా? లేక ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కోహ్లి అతడి భార్య అనుష్క శర్మలకు ఇప్పటికే ఓ అమ్మాయి పుట్టింది. అనుష్క మరోసారి గర్భం దాల్చినట్లుగా గతంలో కథనాలు వచ్చాయి. అవేవీ నిర్ధారణ కాలేదు. మరి ఇంకే కారణంతో కోహ్లి 2 టెస్టులకు దూరమయ్యాడో అతడు చెబితేనే కానీ తెలియదు. కాగా కోహ్లి స్థానంలో మరో ఆటగాడిని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది.

కొసమెరుపు:

5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్‌ తో మొదటి టెస్టు 25 నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ మైదానంలో జరగనుంది. దీంట్లో కోహ్లి ఆడడం లేదు. రెండో టెస్టులోనూ పాల్గొనడు. అయితే, ఆ రెండో టెస్టు ఎక్కడని అనకుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద నగరమైన విశాఖ పట్నంలో. ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు జరగనుంది.

Tags:    
  • Viratkohli 
  • India 
  • Testmatches 
  • England 
  • Hyderabad 
  • Rohitsharma 
  • Bcci 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

Copyright @2026

Powered by Blink CMS