• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  వివాదాస్పద క్రికెటర్ పై...

వివాదాస్పద క్రికెటర్ పై మూడు సంవత్సరాల బ్యాన్.. ఇది రెండోసారి

| తమ రాష్ట్రానికి చెందిన శ్రీశాంత్ ను కేరళ ప్రజలు బాగా ఆరాధిస్తారు. అయితే, తాజాగా అతడిపై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) చర్యలు తీసుకుంది. మూడేళ్లు సస్పెండ్ చేసింది.

By - Tupaki Desk
Update: 2025-05-02 11:29 GMT

మొగుడు కొట్టినందుకు కాదు.. అత్త నవ్వినందుకు ఆవిడ బాధపడిందనే తెలుగు సామెతను గుర్తుచేసేలా కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) ఓ మాజీ క్రికెటర్ పై చర్యలు తీసుకుంది.. అసలు ఆ చర్య తీసుకుంటే ఎంత..? తీసుకోకుంటే ఎంత? అనే పరిస్థితుల్లో కేసీఏ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.

శ్రీశాంత్ గుర్తున్నాడా? టీమ్ ఇండియా మాజీ ఆటగాడు. వివాదాస్పద ప్రవర్తనకు తోడు ఫిక్సింగ్ ఆరోపణలతో పలుసార్లు వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నుంచి నిషేధానికి గురయ్యాడు. అలాంటి శ్రీశాంత్.. మళ్లీ నిషేధానికి గురయ్యాడు.

శ్రీశాంత్ ప్రత్యేకత ఏమంటే అతడు కేరళ నుంచి టీమ్ ఇండియాకు ఆడిన క్రికెటర్. మంచి పేస్ ఉన్న అతడు కొన్ని మ్యాచ్ లను గెలిపించాడు కూడా. పైగా 2007 తొలి టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై శ్రీశాంత్ పట్టిన క్యాచ్ ఎప్పటికీ భారత అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటుంది. 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడైన శ్రీశాంత్ అరుదైన ఘనత అందుకున్నడు. అయితే, ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన అతడు.. ఫిక్సింగ్ తో శాశ్వతంగా దూరమయ్యాడు. చివరకు సినిమాల్లోనూ నటించాడు.

తమ రాష్ట్రానికి చెందిన శ్రీశాంత్ ను కేరళ ప్రజలు బాగా ఆరాధిస్తారు. అయితే, తాజాగా అతడిపై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) చర్యలు తీసుకుంది. మూడేళ్లు సస్పెండ్ చేసింది.

కేరళ క్రికెట్ లీగ్ లో కొల్లం ఏరీస్ ఫ్రాంచైజీకి శ్రీశాంత్ కో ఓనర్. కాగా, గత ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టు నుంచి శాంసన్ ను తప్పించడంపై శ్రీశాంత్ విమర్శలు చేశాడు. దీంతో సంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని ఆరోపించాడు. దీనిపై కేరళ క్రికెట్ సంఘం ఆగ్రహానికి గురైంది. గత నెల 30న జరిగిన సమావేశంలో శ్రీశాంత్ పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. తమ గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగించిందుకు శ్రీశాంత్ పై ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని కేసీఏ వివరించింది.

సంజూ తండ్రిపై కేసు..

సంజూ శాంసన్ ఎంపికపై నిరాధార ఆరోపణలు చేసినందుకు అతడి తండ్రి శాంసన్ విశ్వనాథన్, మరో ఇద్దరిపై కేసీఏ పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది.

Tags:    
  • Sreesanth 
  • KeralaCricket 
  • KCA 
  • SanjuSamson 
  • CricketControversy 
  • IndianCricket 
  • Suspension 
  • VijayHazare 
  • CricketNews 
  • KCAAction 
  • BCCI 
  • SportsNews 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS