అందరూ బాబు వెంటేనా...వైసీపీ స్ట్రాటజీ ఏంటి... ?
దేశంలో ఎక్కడైనా రాజకీయం తీరు వేరుగా ఉంటుంది. అధికారంలో ఒక పార్టీ ఉంటే విపక్షాలు చాలా ఉంటాయి. వాటిలో వాటికి పడదు, ఎవరి మటుకు వారు అధికారం కోసం గట్టిగా ట్రై చేస్తూంటాయి. ఇలా ఒక విధంగా అధికార పార్టీకి ఓట్ల చీలిక ద్వారా అధికారం మళ్ళీ మళ్లీ సాధించడం సులువు అవుతుంది. పైగా విపక్షాలు చీలికలు పేలికలుగా ఉంటే పవర్ లో ఉన్న పార్టీకి చాలా లాభం.
తెలంగాణాలో చూసుకుంటే టీయారెస్ అధికారంలో ఉంది. విపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అసలు కలవవు. దాంతో గులాబీకి చాలా హాయిగా ఉంది. ఏపీలో మాత్రం సీన్ అలా లేదు. అక్కడ వైసీపీ అధికారంలో ఉన్నా విపక్షాంలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉంటోంది. దానికి జగన్ మార్క్ రాజకీయ వ్యూహాలే కారణమా లేక అలా సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పుకోవడం ఇష్టమా అన్నది కూడా చూడాలి.
ఇక ఏపీలో ఏ రాజకీయ పార్టీ వైసీపీ సర్కార్ కి ఎదురు నిలిచి ఆందోళన చేసినా వెంటనే వాటిని తెచ్చి టీడీపీకి మద్దతు పార్టీలు అని ఒక రంగు వేయడం కూడా వైసీపీ అలవాటుగా చేసుకుంది. దీని మీద ఈ మధ్యనే ఒక చానల్ ఇంటర్వ్యూలో సీపీఐ సీనియర్ నేత నారాయణ ఈ పోకడల మీద అసహనం వ్వ్యక్తం చేశారు కూడా. మా జెండా అజెండా వేరుగా ఉంటుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబుతో ఉన్నామని వైసీపీ వారు ప్రచారం చేయడమేంటి అని గుస్సా అయ్యారు.
ఇక ఏపీలో చూసుకుంటే ఈ రోజుకీ బీజేపీ తనకంటూ సొంత అజెండాను పెట్టుకునే పోరాడుతోంది. టీడీపీలో ఎలాంటి అవగాహన లేదు. అమరావతి వంటి కొన్ని అంశాల్లో రెండు పార్టీలూ పోరాడి ఉండవచ్చు, అంత మాత్రం చేత తాము చంద్రబాబు పక్షమని ఎలా అంటారని వారూ ఫైర్ అవుతున్నారు.
అలాగే జనసేన పార్టీని తీసుకుంటే పవన్ సీఎం కావాలని, సొంతంగా తమ పార్టీ ఎదగాలని జనసైనికులు కోరుకుంటున్నారు. పవన్ సైతం తమ పార్టీకి కేవలం బీజేపీతో మాత్రమే పొత్తు ఉందని చెప్పారు. అయినా సరే ఆయన్ని బాబు దత్తపుత్రుడు అని టీడీపీలో కలిపేస్తున్నారు వైసీపీ నేతలు.
ఇక కాంగ్రెస్ నోరెత్తినా మరో పార్టీ మాట్లాడినా కూడా ఇదే తీరుగా వైసీపీ నేతల విమర్శలు ఉంటున్నాయి. అంతదాకా ఎందుకు ఏదైనా మీడియా ప్రభుత్వానికి కాస్తా వ్యతిరేకంగా రాస్తే చంద్రబాబు జెండా ఎత్తేస్తున్నారు అని వైసీపీ వారి చేత కామెంట్స్ పడిపోతున్నాయి. ఒక విధంగా వైసీపీ రాజకీయ వ్యూహం ఇదే అనుకోవాలి.
ఆ పార్టీకి చంద్రబాబు ప్రధాన ప్రత్యర్ధి. ఆయనతోనే యుద్ధం ఉంది. అయితే మిగిలిన పార్టీలు కూడా సర్కార్ మీద తమకు తోచిన తీరున విమర్శలు చేస్తాయి. పోరాడుతాయి. కానీ అన్నింటినీ కలపి బాబుతోనే ముడి పెట్టడం ద్వారా ఏపీలోని పొలిటికల్ స్పేస్ లో సింహ భాగం తమకే ఉండాలన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. అయితే ఇది విపక్షంలో ఉన్నపుడు సక్సెస్ అయింది కానీ అధికారంలో ఉన్నపుడు అసలు కుదిరే పని కాదని అంటున్నారు.
అదెలా అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అంత లాభం. దాని వల్ల ఓట్లు చీలి తిరిగి గెలవడానికి చాన్స్ ఉంటుంది. కానీ వైసీపీ మైడ్ సెట్ ఇంకా విపక్షంలోనే ఉందని అందుకే అన్ని పార్టీలను తెచ్చి చంద్రబాబుతో కలిపి కట్టేస్తున్నాయని అంటున్నారు. దీని వల్ల రేపటి రోజుల విపక్షం గ్రాండ్ అలయెన్స్ గా