సచివాలయ ఉద్యోగులు జై చంద్రబాబు అనాల్సిందే !

సచివాలయాల్లో ఏడేళ్ళుగా పనిచేస్తున్న ఉద్యోగులకు వారి పని తీరు, ప్రతిభ వారి నైపుణ్యం వంటివాటిని ప్రమాణంగా తీసుకుని పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి.;

Update: 2026-02-06 01:30 GMT

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలను వైసీపీ హయాంలో ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ 2 నుంచి వీటి నిర్వహణ మొదలైంది. ఇప్పటికి ఏడేళ్లుగా వీరంతా పనిచేస్తున్నారు. చాలీ చాలని జీతాలతో ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాలతో అలసిపోతున్నారు. అంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే. అంతా ఏళ్ళకు ఏళ్ళు పనిచేస్తున్నారు. తమకు ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంతోషించి వార్డు గ్రామ సచివాలయాల్లో చేరారు. కానీ జగన్ హయాంలో అయిదేళ్ళొ వారు పనిచేసినా జీతం పెరగలేదు, పైగా పదోన్నతులు ఏవీ లేదు, దీంతో విసిగి వేసారిపోయారు. వీరిలో అత్యధికులు వారి కుటుంబాలు కూటమికే గత ఎన్నికల్లో జై కొట్టారని అంటున్నారు.

రెండేళ్ళ తరువాత :

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దగ్గర పడుతోంది. అయినా తమ స్థితిగతులలో ఎలాంటి మార్పు రాలేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫేస్ రికగ్నైజేషన్ వంటివి కూడా పెట్టారని అంటున్నారు. అయితే ఏది చేసినా ఒక మంచి కోసమే అన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఇపుడు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతోంది. తొందరలో వారి నోట్లో పంచదార పోయనుంది. వారి బతుకులను తీపి చేయనుంది అని వార్తలు వస్తున్నాయి.

ప్రమోషన్స్ తో :

సచివాలయాల్లో ఏడేళ్ళుగా పనిచేస్తున్న ఉద్యోగులకు వారి పని తీరు, ప్రతిభ వారి నైపుణ్యం వంటివాటిని ప్రమాణంగా తీసుకుని పదోన్నతులు కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన కూడా చేసినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం సచివాలయ ఉద్యోగులకు పండుగే అని అంటున్నారు.

మూడు అంచెల వ్యవస్థగా :

ఇదిలా ఉంటే వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులను మూడు అంచెల వ్యవస్థగా రూపొందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నరు. ఈ క్రమంలో సచివాలయంలో ఉండే ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తారు అని అంటున్నారు. రెవిన్యూ మునిసిపల్ పంచాయతీ రాజ్ సహా కీలకమైన శాఖలలో వీరి సేవలను వినియోగించుకుంటారు అని అంటున్నారు.ప్రభుత్వ ఖాళీలు చాలా ఉన్నాయి. వాటిలో వీరిని నియమించడం ద్వారా అక్కడ కూడా అంతా సజావుగా సాగేలా చూస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఇతర శాఖల పనులను కూడా వారిని అప్పగిస్తారు అని రానున్న రోజులలో పదోన్నతులు పొందే వారి లిస్ట్ తయారు చేస్తారని అర్హులకు అగ్ర తాంబూలం దక్కుతుంది అని అంటున్నారు. మొత్తానికి సచివాలయ ఉద్యోగులు ఇక మీదట జై చంద్రబాబు అని అంటారెమో. ఎందుకంటే వారి జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి అన్నది వాస్తవం.

Tags:    

Similar News