‘18 – 19’... సేల్స్ మ్యాన్ ఇన్ చీఫ్.. మునీర్ ని ఆడుకుంటున్నారు!

భారత్ - అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు పాకిస్థాన్ లో సరికొత్త రాజకీయ విమర్శలకు దారి తీసింది.;

Update: 2026-02-05 19:43 GMT

భారత్ - అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు పాకిస్థాన్ లో సరికొత్త రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఫిబ్రవరి 2న ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం... భారత ఎగుమతులపై అమెరికా 18% సుంకాలను విధిస్తుండగా... పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్ లో నిరంతరం లాబీయింగ్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ దేశం 19% సుంకాలను ఎదుర్కొంటోంది. దీంతో. ఈ వ్యవహారంపై అటు పాక్ ప్రధానిని, ప్రధానంగా ఆర్మీ చీఫ్ ని ఆ దేశ పౌరులు ఆడేసుకుంటున్నారు.

అవును... భారత్ - అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. ఈ క్రమంలో.. నెలల తరబడి వాషింగ్టన్ తో ఉన్నత స్థాయి చర్చలు జరిపినా.. డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా.. పలు అంతర్జాతీయ వేదికలపై ట్రంప్ ను వీరుడూ, శూరుడూ, ఈ ప్రపంచం కోసం దిగివచ్చిన దేవదూత రేంజ్ లో ఆకాశానికి ఎత్తినా ప్రయోజనం దక్కలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించ్చిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఇ) నేత, మాజీ మంత్రి హమ్మద్ అజార్ స్పందిస్తూ... 21వ శతాబ్ధంలో విదేశాంగ విధానం వ్యక్తిగత సంబంధాల గురించి కాదని.. ఇది ఆర్థిక బలం, సుంకాలు, మార్కెట్ యాక్సెస్ ను పెంచుకోవడం గురించని.. తాజాగా యురోపియన్ యూనియన్ తోనూ, అమెరికాతోనూ భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయని.. ప్రశంసలు, ఫోటో ఆప్ లు పనికిరానివని అన్నారు.

ఇదే సమయంలో స్పందించిన జర్నలిస్ట్ అసద్ టూర్... పాకిస్థాన్ విస్తృత ఆర్థిక ఇబ్బందులను సుంకాల నిర్ణయం మరింత పెంచుతుందని చెబుతూ.. ఎగుమతులు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం, దేశ బేరసారాల శక్తి దాదాపు పూర్తిగా క్షీణించడాన్ని ఎత్తి చూపారు. మరోవైపు.. సేల్స్ మ్యాన్ ఇన్ చీఫ్ వ్యూహం విఫలమైంది.. మీరు బలుచిస్తాన్ ఖనిజాలను చెక్కపెట్టెల్లో ఇవ్వొచ్చు కానీ.. గౌరవాన్ని కొనలేరు అంటూ మరో జర్నలిస్ట్ ఇమ్రాన్ రియాజ్ ఖాన్... పాక్ ప్రభుత్వాన్ని, ఆర్మీ చీఫ్ ని ఎద్దేవా చేశారు!

కాగా... యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలవబడిన వాణిజ్య ఒప్పందం అనంతరం.. భారీయ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ప్రకటన చేయడం.. దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని.. ఒక దశాబ్ధంలో ఎగుమతుల్లో 150 బిలియన్ డాలర్లను జోడిస్తుందని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు పాక్ లో ప్రతిపక్షాలకు అస్త్రంలా మారింది.. ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ లపై తీవ్ర విమర్శలకు అవకాశం ఇచ్చిందని అంటున్నారు!

Tags:    

Similar News