మరో భారీ ఉద్యమానికి బొద్దింకల పార్టీ సిద్ధం

బొద్దింకలను ఎవరూ ఇపుడు తేలికగా చూడడం లేదు. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన ఉంది.

Update: 2026-08-12 04:12 GMT

బొద్దింకలను ఎవరూ ఇపుడు తేలికగా చూడడం లేదు. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని తమ వద్దకు రప్పించుకుని మరీ డిమాండ్లు సాధించిన వైనం చూసిన వారు వామ్మో బొద్దింకలు మామూలువి కావు అనుకున్నారు. ఇంత జరిగిన తరువాత కేంద్ర మంత్రి చేత రాజీనామా కూడా ఇప్పించాక బొద్దింకల పార్టీ తరువాత అడుగు ఏమిటి ఎటు వైపు అని అంతా అనుకున్నారు. అయితే కాస్తా విరామం తీసుకుని బొద్దింకల పార్టీ దేశంలోని అందరికీ కనెక్ట్ అయ్యే మరో కీలక అంశంతో భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధం కాబోతోంది అని అంటున్నారు.

గ్రామీణ బడుల మీదనే :

దేశంలో గ్రామీణ ప్రాంతం చాలా ఎక్కువ. అక్కడ సర్కారీ బడుల పరిస్థితులు అంటే ఎవరైనా ఇట్టే తమ అనుభవంతో చెబుతారు. సౌకర్యాలు లేమి గురించి కూడా మాట్లాడుతారు. అలాంటి పెల్లలలో బడుల తీరు మారాలన్నది ఇపుడు బొద్దింకల పార్టీ కొత్త అజెండా, సరికొత్త ఉద్యమానికి అదే కీలకమైన అంశంగా ఉండబోతోంది. ఈ దేశానికి స్వేచ్చా స్వాంతంత్ర్యం లభించి ఏకంగా ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నాయి. మరి ఇంత కాలం జరిగినా కూడా ఎక్కడా అభివృద్ధి అన్నది లేదని కాక్రోచ్ పార్టీ భావనగా ఉంది. అంతే కాదు పల్లె సీమలలో పరిస్థితులు ఏ మాత్రం మారలేదని అంటోంది. అక్కడ విద్యా బుద్ధులు నేర్పే బడులు బాగుంటే దేశం బాగుంటుంది అన్నది బొద్దింకల పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. దాంతోనే ఈ కీలకమైన అంశాన్ని తీసుకుని ఉద్యమించాలని చూస్తోంది అని అంటున్నారు.

ఆగస్టు 15నే ముహూర్తం :

ఇక ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15నే తమ ఆందోళనలకు ముహూర్తంగా కాక్రోచ్ పార్టీ ఎంచుకుంది అని అంటున్నారు. అంతే కాదు గ్రామాలలో కనీస సదుపాయాలు కూడా లేవన్నది కాక్రోచ్ పార్టీ ఆరోపిస్తున్న మరో ముఖ్యమైన అంశం. భారత దేశం అంటే గ్రామీణ భారతం అని చెబుతారు. అలాంటి గ్రామీణ ప్రాంతం అధికంగా ఉన్న చోట అభివృద్ది ఫలాలు ఎవరికీ పెద్దగా చేరడం లేదని సీజేపీ అంటోంది. దీంతో పెల్లలలో బడులని తిరిగి నిర్మించడం పల్లెలు ప్రగతి సీమలుగా మారాలన్నది అజెండాగా చేసుకుని సీజెపీ వ్యవస్థాపకుడు అయిన అభిజీత్ దిప్కే అతి పెద్ద ఉద్యమానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు కూడా.

అక్కడ నుంచే శ్రీకారం :

ఇక అభిజీత్ దిప్కే మహారాష్ట్ర వాసి కావడంతో ఆయన ఆగస్టు 15వ తేదీన తన సొంత రాష్ట్రం అయిన మహారాష్ట్రలోని హింగోలీ గ్రామం నుంచి పల్లె బడుల దుస్థితి మీద ఎలుగెత్తి చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆయన అక్కడ నుంచి ఆ రోజు ఈ నిరసన కార్యక్రమం ప్రారంభిస్తే సీజేపీకి చెందిన వివిధ రాష్ట్రాల బాధ్యులు అంతా తలో రాష్ట్రంలో తమ ప్రాంతాల నుంచి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ఇక అభిజీత్ దిప్కే మాటలు చూస్తే పల్లెలు ఎంతటి అన్యాయంగా మారుతున్నాయో అన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పల్లెలలో పిల్లలకు ఈ రోజుకీ నాణ్యమైన మంచి విద్య లభించడం లేదని ఆయన ఆగ్రహించారు. చదువు కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళే పిల్లలకు కనీసం తాగు నీరు అలాగే మరుగు దొడ్ల సదుపాయం లేదని ఆడ పిల్లలు పడుతున్న సమస్యలు ఎన్నో ఉన్నాయని అభిజీత్ దిప్కే అంటున్నారు.

సర్పంచులతో ఛాలెంజ్ :

గ్రామ సీమలు బాగు పడాలీ అంటే సర్పంచులు ముందుకు రావాలని అభిజీత్ దిప్కే కోరారు. వారుకే సీజేపీ పిలుపు ఇస్తోంది అన్నారు. దానికి సర్పంచ్ ఛాలెంజ్ అని పేరు పెట్టారు. మీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మార్చాల్సింది మీరే అని అభిజీత్ దిప్కే వారిని కోరారు. పాత బడులను బాగు చేయాలని అలా చేసిన తరువాత పాత బడులు కొత్త బడులను సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందు తీసుకుని వెళ్తామని అలా బాగు చేసిన సర్పంచులకు తగిన గౌరవం అందిస్తామని అభిజీత్ దిప్కే అంటున్నారు. సర్పంచులు దేశవ్యాప్తంగా ముందుకు రావాలని ఆయన కోరారు.

తల్లిదండ్రుల భాగస్వామ్యం :

కేవలం సర్పంచులే కాకుండా తల్లిదండ్రులు కూడా తమ ఊరిలో ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అభిజీత్ దిప్కే కోరుతున్నారు. తమ బిడ్డలను చదివిస్తున్న పల్లెలలో కనీస సదుపాయాలు ఉన్నాయో లేవో అన్నది సోషల్ ఆడిట్ తల్లిదండ్రులే చేపట్టాలని ఆయన సూచించరు. ఒకవేళ ఎక్కడైనా లేకపోతే ఏమి లేదో వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోవాలని కోరారు. పట్నాలకు అందే అన్ని సదుపాయాలు పల్లెలకు అందాలని అభిజీత్ దిప్కే అన్నారు. పల్లెలే అసలైన దేశం అన్నది సీజేపీ నినాదంగా చెప్పారు. మొత్తం మీద ఒక ఉదాత్తమైన అంశాన్ని ఎంచుకుని సీజేపీ ఈ ఆగస్టు 15 నుంచి రంగంలోకి దిగుతోంది. మరి దీనిని దేశవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు దక్కుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News