అన్నాబ‌త్తుని రాజ‌కీయం.. యాంగిల్ మారుతుందా.. ?

ఇక వైసిపి కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ నియోజకవర్గం ఉన్నప్పటికీ ఇక్కడ పెద్దగా కేడర్లో ఉత్సాహం లేదు.

Update: 2026-10-01 13:30 GMT

తెనాలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు అన్నబ‌త్తుల‌ శివకుమార్ రాజకీయంగా కంటే వివాదాలపరంగా ఎక్కువగా ఆయన పేరు వినిపించేలా చేసుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. గత ఎన్నికల సమయంలో వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఒక ఓటర్ను ఆయన చేయి చేసుకోవడం ఈ క్రమంలో వోటర్ కూడా ఈయనపై దాడి చేయడం వంటివి పెద్ద ఎత్తున వైరల్ అయి దీనిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా భూముల విషయంలో ఎమ్మెల్యే చేసిన వ్యవహారం వివాదంగా మారింది. ఆయనపై కేసు కూడా నమోదయింది.

1200 గజాల స్థలాన్ని తనఖా పెట్టి మూడు కోట్ల రూపాయలు రుణం పొందారు అన్నది వాస్తవమే. అయితే ఈ క్రమంలో ఆయన గతంలో అమ్మేసిన భూమిని తమ భూమిగా చూపించారు అనే ఆరోపణ ప్రస్తుతం వివాదంగా మారింది. దీనిపై సదరు సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే రాజకీయంగా అన్నాబత్తుని వ్యవహారం పెద్దగా చర్చనీయాంశంగా ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన చాలా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. తెనాలిలో కూటమి నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ రాజకీయాల ముందు అన్నా బత్తుని రాజకీయం పెద్దగా ఫలించడం లేదు.

ఇక వైసిపి కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ నియోజకవర్గం ఉన్నప్పటికీ ఇక్కడ పెద్దగా కేడర్లో ఉత్సాహం లేదు. నియోజకవర్గంలో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏమీ కనిపించడం లేదు. పైగా నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకులు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. దీంతో తెనాలి నియోజకవర్గంలో ప్రస్తుతం అన్నాబత్తుని రాజకీయం సైలెంట్ మోడ్ లోనే ఉంది. వైసీపీ తరఫున కార్యక్రమాలు ఏవి నడిపించడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఈ నియోజకవర్గంలో జనసేన అదే విధంగా టిడిపి వర్గాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో తెనాలి వ్యాప్తంగా కూడా అన్ని ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. మొత్తంగా ఈ నియోజకవర్గంలో అన్నబ‌త్తుని రాజకీయం చర్చనీయాంశంగా మారింది ఆయన పెద్దగా దూకుడు రాజకీయాల కూడా చేయడం లేదని, పార్టీలోను యాక్టివ్ గా ఉండటం లేదని అధిష్టానం కూడా సీరియ‌స్ అవుతోంది. మరి ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అన్నాబత్తుని వ్యవహారం ఏ విధంగా ఉండనుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఏకగ్రీవాలు చేయరాదన్న జగన్ ఆలోచనను ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళతారు అనేది చూడాలి. అయితే.. ఇక్క‌డే మ‌రో మాట కూడా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అన్నాబ‌త్తుని రాజ‌కీయం ఇలానే ఉంటుంద‌ని.. ఖ‌ర్చుకు ఆయ‌న వెనుకాడుతున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News