లా అండ్ ఆర్డర్ మీద బాబు వెరీ సీరియస్

ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు వెరీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన ఏకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకూ వందలాది మంది అధికారులతో ఒక హైలెవెల్ మీటింగ్ ని నిర్వహిస్తున్నారు.

Update: 2026-08-11 22:30 GMT

ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు వెరీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన ఏకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకూ వందలాది మంది అధికారులతో ఒక హైలెవెల్ మీటింగ్ ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ లో బాబు శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష చేపడతారు అని అంటున్నరు. ఇక ఈ మీటింగ్ కి స్టేట్ లో టాప్ వన్ లో ఉండే డీజీపీ నుంచి క్షేత్ర స్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు ఏకంగా వందలాది మంది వరకూ అధికారులు హాజరు అవుతారని అంటున్నారు. ఈ సమావేశాన్ని బాబు తన వద్ద ఉన్న క్షేత్రస్థాయి నివేదికలను అధికారుల ముందు ఉంచి మరీ సమీక్ష చేయబోతున్నారు అని తెలుస్తోంది.

బాబు చేతిలో నివేదిక :

ఇదిలా ఉంటే ఈ మీటింగ్ ని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో నిర్వహిస్తున్న అతి ముఖ్యమైన సమీక్షా సమావేశంగా చూస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి తనకు అందిన నివేదికలను దగ్గర ఉంచుకుని మరీ బాబు ఈ మీటింగ్ ని అడ్రస్ చేయబోతున్నారు. ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఈ మీటింగ్ సాగనుంది అని అంటున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తంగా 1,300 మంది అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు అంటే బాబు వెరీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

లోతైన సమీక్షతోనే :

ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితి. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. అంతే కాకుండా ఏపీలోని దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన విశ్లేషణ చేయనున్నారని అంటున్నారు. అలాగే ఏపీలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు అక్కడ శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికలను రిఈ సమావేశంలో నేరుగా అధికారుల ముందే ముఖ్యమంత్రి బయట పెట్టనున్నారని భోగట్టా.

ఉక్కు పాదం మోపాల్సిందే :

అంతే కాదు రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు పోలీసు అధికారులకు ఈ సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారని అంటున్నారు. ఇక అత్యంత కీలకమైన ఈ సమీక్షా సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరు కానుండగా జిల్లాల్లోని మిగిలిన అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో గత 24 నెలల కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ మీద సమగ్రమైన సమీక్షను చంద్రబాబు చేపట్టబోతున్నారు అని అర్ధం అవుతోంది. ఈ సమావేశంలో కొన్ని కీలక సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటారని అలాగే ముఖ్యమంత్రి హోదాలో బాబు పోలీసు అధికారులకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News