• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా రోడ్లపైకి షార్క్...

అమెరికా రోడ్లపైకి షార్క్ లు.. హడలిచచ్చిన జనాలు.. భయానక వీడియో..

| ప్రతి పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినప్పుడూ ఇటువంటి వీడియోలు రావడం పరిపాటిగా మారింది. 2011లో హరికేన్ ఇరీన్, 2017లో హరికేన్ హార్వే సమయాల్లో కూడా ఇలాంటి "స్ట్రీట్ షార్క్" ఫోటోలు వైరల్ అయ్యాయి.

By - A.N.Kumar
Update: 2026-09-28 06:33 GMT

ప్రకృతి కోపానికి సాంకేతికత తోడైతే ఎలాంటి విడ్డూరాలు చూడాలో ఇటీవల అమెరికాలో సంభవించిన తుఫాను స్పష్టం చేస్తోంది. అమెరికా ఈశాన్య రాష్ట్రాలైన న్యూయార్క్, న్యూజెర్సీలను భారీ వర్షాలు, బలమైన గాలులు ముంచెత్తాయి. రహదారులు నదులుగా మారిపోవడంతో ప్రజలు కార్లను పక్కనపెట్టి కయాక్‌లు, పడవలపై రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించి, వేలాది కుటుంబాలకు విద్యుత్ పునరుద్ధరణ, సహాయక చర్యల్లో నిమగ్నమైంది. విమానాశ్రయాల్లో సర్వీసులు స్తంభించి వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ మానవీయ సంక్షోభం ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన, కలవరపెట్టే ట్రెండ్ మొదలైంది. అదే "వరద నీటిలో షార్క్" న్యూజెర్సీలోని సర్ఫ్ సిటీ రోడ్లపై ఏకంగా ఒక షార్క్ ఈదుకుంటూ వెళ్తోందంటూ కొద్ది సెకన్ల వీడియో క్లిప్ నెట్టింట కార్చిచ్చులా వ్యాపించింది.

ఫేక్ న్యూస్.. వైరల్ కల్చర్

ప్రతి పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినప్పుడూ ఇటువంటి వీడియోలు రావడం పరిపాటిగా మారింది. 2011లో హరికేన్ ఇరీన్, 2017లో హరికేన్ హార్వే సమయాల్లో కూడా ఇలాంటి "స్ట్రీట్ షార్క్" ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిలో అత్యధికం ఎడిట్ చేసినవి లేదా డీప్‌ఫేక్, ఏఐ పరిజ్ఞానంతో సృష్టించినవి. విపత్తు సమయాల్లో భయాందోళనలు పెంచి 'లైక్‌లు', 'వ్యూస్' పొందేందుకు కొంతమంది చేసే చిలిపి చేష్టలు, సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

అధికారుల హెచ్చరికలు.. నెటిజన్ల బాధ్యత

ఈ వైరల్ వీడియోల తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే స్పందించారు. నెట్టింట కనిపించే ప్రతి దృశ్యాన్ని నమ్మవద్దని, ఇవి పాత వీడియోలు లేదా ఎడిట్ చేసినవి అయి ఉండవచ్చని స్పష్టం చేశారు. బాధితులను కాపాడేందుకు ఎమర్జెన్సీ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సమయంలో ఇటువంటి గందరగోళ ప్రచారాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తాయి.

విపత్తు నిర్వహణలో అధికారిక సమాచారానికే ప్రాధాన్యత ఇవ్వడం పౌరుల బాధ్యత. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవడంఅత్యవసరం. సముద్రంలో ఉండాల్సిన షార్క్ రోడ్డుపైకి వచ్చిందో లేదో పక్కనబెడితే ఇంటర్నెట్ వలలో నిజాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయనడంలో సందేహం లేదు.

🚨 అమెరికాలో వరద బీభత్సం.. రోడ్లపై పడవలు, షార్క్‌లు! 🦈🌊న్యూజెర్సీ సహా అమెరికా ఈశాన్య ప్రాంతాలను అరుదైన నార్‌ఈస్టర్ తుఫాను వణికిస్తోంది. భారీ అలలు, తీర ప్రాంత వరదలతో రోడ్లు జలమయం కాగా.. కొన్ని చోట్ల ప్రజలు పడవలు, కయాక్‌లతో ప్రయాణిస్తున్నారు. న్యూజెర్సీలో వరద నీటిలో షార్క్… pic.twitter.com/8Kv7XyA4Uz

— Tupaki (@tupaki_official) September 28, 2026
Tags:    
  • newjerseyfloods 
  • streetshark 
  • aifakevideo 
  • fakenews 
  • deepfake 

Similar News

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్ల సంపద పెరుగుదల.. జెన్సన్ హువాంగ్‌కు జాక్‌పాట్ ఎలా తగిలింది?

2026-11-24 18:20 GMT

సింధూ దేశ్ ఉద్యమం షురూ.. మరోసారి ముక్కలయ్యే దిశగా పాకిస్తాన్..?

2026-11-24 18:20 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

"జిన్‌పింగ్ త‌ర్వాత మోడీనే.. తెలిసిందా రాహుల్‌"

2026-11-24 18:16 GMT

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

2026-11-24 18:11 GMT

52 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఇదేం కొట్టుడు సామీ.. మేమెప్పుడు చూడలా..

2026-11-24 18:10 GMT

మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ

2026-11-24 18:02 GMT

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

2026-11-24 18:01 GMT

వెలగని దీపం.. రగిలిన వివాదం.. తిరుపరంకుండ్రంలో భక్తుల ఆందోళన.. పోలీసుల రంగప్రవేశం

2026-11-24 17:15 GMT

Copyright @2026

Powered by Blink CMS