"జిన్‌పింగ్ తర్వాత మోడీనే.. తెలిసిందా రాహుల్"
| ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ ‘ఆసియా పవర్ ఇండెక్స్ 2026’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ప్రభావవంతమైన నేతల్లో రెండో స్థానంలో నిలిచారు. 2025లో ఐదో స్థానంలో ఉన్న మోదీ మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలి స్థానంలో ఉన్నారు. ప్రజాదరణ, ప్రపంచ శాంతి, బలమైన నాయకత్వం, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలు మోదీ ఎదుగుదలకు కారణాలుగా నివేదిక పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది(2025)లో 5వ స్థానంలో ఉన్న మోడీ.. ఏకంగా మూడు స్థానాలు పైకి ఎగబాకి.. 2వ స్థానంంలోకి వచ్చారు. ఇక, తొలిస్థానంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిలవడం గమనార్హం. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘లోవీ ఇన్స్టిట్యూట్’ నిర్వహించిన సర్వే వివరాలను ‘ఆసియా పవర్ ఇండెక్స్-2026’ లో పేర్కొన్నారు. అనేక కోణాల్లో నేతలను పరిశీలించినట్టు ఇండెక్స్ తెలిపింది.
మోడీ ఎలా ఎదిగారు!
ఈ ఇండెక్స్‌లో మోడీ కీలకంగా మారారు. 5వ స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా సర్వేలో 2వ స్థానానికి ఎలాచేరుకున్నారన్నది ఆసక్తిగా మారింది. దీనికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయని ఇండెక్స్ పేర్కొంది. 1) ప్రజా నేతగా గుర్తింపు. 2) ప్రపంచ శాంతి మంత్రం. 3) బలమైన వాయిస్(గళం). 4) స్వదేశీ ఉత్పత్తుల ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్దపీట వేయడం. 5) ప్రజల అభిమానాన్ని వరుసగా చూరగొనడం ద్వారా వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం. ఈ ఐదు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని మోడీకి 2వ స్థానం కల్పించినట్టు ఇండెక్స్ వివరించింది.
పెద్ద దేశాలతోనూ పోలిక..
పారిశ్రామికంగా, జనాభా పరంగా పెద్ద దేశాలతోనూ భారత్‌ను పోల్చినప్పుడు.. మెరుగైన ఫలితాలు వచ్చాయని ఇండెక్స్ వివరించింది. ఆసియాలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా వరుసగా మూడోసారి కూడా తన స్థానాన్ని పదిల పరుచుకున్నట్టు వివరించింది. అయితే.. ఆసియాలో అమెరికాదే ఆధిపత్యమని పేర్కొంది. ఆ దేశం తర్వాత.. చైనా ఆసియాపై తనదైన ముద్ర వేసినట్టు తెలిపింది. పెట్టుబడుల విషయంలోనూ భారత్ ఆశాజనకమైన అభివృద్ధిని నమోదు చేసినట్టు ఈ సర్వే వెల్లడించింది. చైనాతో పోలిస్తే.. 3 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు అదనంగా వచ్చాయని వివరించింది.
తెలిసిందా.. రాహుల్: బీజేపీ
ఈ నివేదిక వ్యవహరం రాజకీయంగా బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధాని మోడీపైతరచుగా విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ ఈ నివేదికను పూర్తిగా చదవాలని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రధాని మోడీ పని అయిపోయిందని అంటున్నారని.. కానీ, ఈ మాట అన్న ప్రతిసారీ ఆయన మెరుపు వేగంతో పుంజుకుంటున్నారని, దీనికి ఆస్ట్రేలియా నివేదికే ఉదాహరణ అని పేర్కొనడం గమనార్హం. అయితే.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రియాక్ట్ కాలేదు.