• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  సింధూ దేశ్ ఉద్యమం షురూ.....

సింధూ దేశ్ ఉద్యమం షురూ.. మరోసారి ముక్కలయ్యే దిశగా పాకిస్తాన్..?

| పాకిస్తాన్‌లో రాష్ట్రాల విభజన ప్రతిపాదన రాజకీయ వివాదానికి దారితీసింది. నాలుగు రాష్ట్రాలను 12 నుంచి 15 రాష్ట్రాలుగా మార్చాలన్న ఆలోచనపై సింధ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సింధ్‌ను విభజిస్తే ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తామని వేర్పాటువాదులు హెచ్చరిస్తున్నారు. జై సింధ్ రహబర్ కమిటీ నేతృత్వంలోని పార్టీలు పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-24 18:20 GMT

1947లో భారత్ నుంచి విడిపోయి మేము వేరు, మా దారి వేరు అంటూ ప్రత్యేక కుంపటి పెట్టుకున్న పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చూస్తుంటే తన ఇంటిని తానే తగలబెట్టుకుని చలి కాచుకుంటున్నట్లు ఉంది. ఆర్థికంగా అడుక్కునే స్థాయికి చేరుకున్న దాయాది దేశం.. ఇప్పుడు రాజకీయంగానూ ముక్కలు చెక్కలయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు తినడానికి తిండి లేక జనం అల్లాడుతుంటే మరోవైపు పాకిస్తాన్ పాలకులు మాత్రం దేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలను 12 నుంచి 15 రాష్ట్రాలుగా ముక్కలు చేద్దాం అంటూ కొత్త నాటకానికి తెరలేపారు.

పరిపాలనా సౌలభ్యం.. అధికార వికేంద్రీకరణ అనే అందమైన ముసుగులో పాకిస్తాన్ సైనిక నాయకత్వం వేసిన ఈ స్కెచ్ ఇప్పుడు వారికే రివర్స్ కొడుతోంది. ఉన్న నాలుగు రాష్ట్రాలు పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా లలో ముఖ్యంగా సింధ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన స్థానికుల్లో నిప్పు రాజేసింది. "మా రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేది లేదు" అంటూ బిలావల్ భుట్టో వంటి నాయకులు గగ్గోలు పెడుతుంటే అక్కడి వేర్పాటువాదులు మాత్రం మరో అడుగు ముందుకేశారు. ‘రాష్ట్ర విభజన వద్దు.. మాకు ఏకంగా ప్రత్యేక సింధు దేశమే ముద్దు’ అంటూ ఎర్రజెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చేశారు. కరాచీ వీధుల్లో ఇప్పుడు వినిపిస్తున్న నినాదాలు పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

జై సింధ్ రహబర్ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు సింధీ జాతీయవాద పార్టీలు ఏకమై పాక్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇస్తున్నాయి. సింధ్‌ను టచ్ చేస్తే పాకిస్తాన్‌కు ఆర్థిక వెన్నెముక అయిన పంజాబ్ రాష్ట్రానికి ఆర్థిక దిగ్బంధం విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఐఎంఎఫ్ కాళ్ల దగ్గర పడి ఉన్న పాకిస్తాన్‌కు ఇది నిజంగా 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డ' చందంగా మారింది.

ఈ పరిణామాలతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు కంటి మీద కునుకు కరువైంది. బలవంతంగా విభజన చేస్తే సింధ్ భగ్గుమంటుంది.. అలాగని వెనక్కి తగ్గితే సైన్యం పరువు బజారున పడుతుంది. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏమో ఏడాది చివరి నాటికి ప్రజాభిప్రాయ సేకరణపై క్లారిటీ వస్తుంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

1971లో భాషా వివక్ష, పంజాబ్ ఆధిపత్యం వల్లే తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్‌గా విడిపోయింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితులే సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఒకవైపు బలూచ్ తిరుగుబాటుదారులు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు సింధీలు కూడా స్వతంత్ర దేశం పాట పాడుతున్నారు.

పక్క దేశంలో చిచ్చు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే పాకిస్తాన్.. ఇప్పుడు సొంత ఇంట్లో రగులుతున్న ఈ 'సింధు దేశ్' మంటలను ఎలా ఆర్పుకుంటుందో చూడాలి. లేదంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ స్థానంలో మరికొన్ని కొత్త దేశాల పేర్లు చూడాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Tags:    
  • pakistan 
  • sindh 
  • sindhprovince 
  • bilawalbhutto 
  • khawajaasif 
  • asimmunir 

Similar News

మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ

2026-11-24 18:02 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

మార్కెట్లు పడిపోతుంటే డెమోక్రాట్లపై ట్రంప్ నిందలు.. అమెరికాలో కొత్త రాజకీయ రగడ!

2026-11-23 03:58 GMT

పుర పాలనకు శ్రీకారం...కొత్త ఏలికలకు శుభారంభం

2026-11-23 03:57 GMT

కెనడాలో గ్యాంగ్‌వార్ కలకలం.. వాల్‌మార్ట్ పార్కింగ్‌లో భారతీయ ప్రేమజంట దారుణ హత్య

2026-11-23 02:29 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌

2026-11-21 17:41 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

Copyright @2026

Powered by Blink CMS