• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  కెనడాలో గ్యాంగ్‌వార్...

కెనడాలో గ్యాంగ్‌వార్ కలకలం.. వాల్‌మార్ట్ పార్కింగ్‌లో భారతీయ ప్రేమజంట దారుణ హత్య

| కెనడాలోని సర్రే నగరంలో నవంబర్ 15న వాల్‌మార్ట్ పార్కింగ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన గగన్‌ప్రీత్ రేహాల్ (23), సుఖ్‌జీత్ కౌర్ (24)పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సమీపంలో మరో కారు దగ్ధమైంది. గ్యాంగ్‌వార్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-23 02:29 GMT

బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కన్నవారిని.. కన్నభూమిని వదిలి విదేశాలకు వెళ్లిన రెండు నిండు ప్రాణాలు అర్థాంతరంగా గాలిలో కలిసిపోయాయి. కెనడాలోని సర్రే నగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రతి భారతీయుడి గుండెను పిండేస్తోంది. ఎంతో ప్రశాంతంగా ఉండే షాపింగ్ మాల్ పార్కింగ్ ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ తూటాల శబ్దంతో దద్దరిల్లింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలిన ఆ యువజంట ఉదంతం స్థానిక ప్రవాస భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురిచేస్తోంది.

నవంబర్ 15వ తేదీ రాత్రి సర్రేలోని రద్దీగా ఉండే వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ ప్రదేశం. రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఎరుపు రంగు ఫోర్డ్ మస్టాంగ్ కారులో ఉన్న భారత సంతతికి చెందిన 23 ఏళ్ల గగన్‌ప్రీత్ రేహాల్, 24 ఏళ్ల సుఖ్‌జీత్ కౌర్ పై గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు. కారులో కూర్చున్న ఆ యువజంటపై తూటాల వర్షం కురిపించడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి జీవితాలు ముగిసిపోయాయి.

సమీపంలోని డెల్టా ప్రాంతంలో నివసిస్తున్న వీరిద్దరూ ప్రేమజంటా లేక దంపతులా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు కానీ ఇరవైల వయసులోనే ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభించిన వారు ఇలా విగతజీవులుగా మారడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. కాల్పుల శబ్దానికి ఉలిక్కిపడి పరుగున వచ్చిన స్థానికులు.. రక్తపు మడుగులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

ఈ జంట హత్యలు పక్కా ప్రణాళికతో లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే సమీపంలో మరో కారు అనుమానాస్పద రీతిలో మంటల్లో కాలిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆధారాలను చెరిపేసేందుకే హంతకులు ఆ కారును తగులబెట్టి ఉంటారని.. దీని వెనుక గ్యాంగ్‌వార్ హస్తం ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఒకవైపు నిందితుల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, వాహనదారుల డాష్‌క్యామ్ వీడియోలను జల్లెడ పడుతుంటే మరోవైపు తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. "మా పిల్లలు క్షేమంగా ఉన్నారా?" అంటూ ఇక్కడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జాతి విద్వేషం కాకపోయినా బహిరంగ ప్రదేశాల్లోనే ఇలా తుపాకులు గర్జిస్తుండటం కెనడాలోని శాంతిభద్రతలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. గగన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌లను ఎవరు? ఎందుకు అంత దారుణంగా పొట్టన పెట్టుకున్నారో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అప్పటివరకు.. విదేశీ గడ్డపై బతుకుపోరు సాగిస్తున్న ప్రతి భారతీయ కుటుంబం గుండెల్లో ఈ విషాదం ఒక తీరని భయంగా మిగిలిపోనుంది.

Tags:    
  • canada 
  • surreyshooting 
  • indianorigincouple 
  • gaganpreetrehall 
  • sukhjeetkaur 

Similar News

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో స్టార్‌ల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది ప్రముఖులా!

2026-11-22 00:00 GMT

మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌

2026-11-21 17:41 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

Copyright @2026

Powered by Blink CMS