• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  పుర పాలనకు...

పుర పాలనకు శ్రీకారం...కొత్త ఏలికలకు శుభారంభం

| ఏపీలో నవంబర్ 23 నుంచి కొత్త పురపాలక పాలన ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలు కూడా జరగనున్నాయి.

By - Satya P
Update: 2026-11-23 03:57 GMT

పట్టణాలు, నగర పాలక సంస్థలలో కొత్త పాలనకు నవంబర్ 23 నుంచి అడుగులు పడబోతున్నాయి. ఏపీలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల తొలి సమావేశాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 1 న జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పుని దక్కించుకుని మూడున ఫలితాలతో అధికారికంగా ప్రజా ప్రతినిధులు అయిన వారంతా అయిదేళ్ల పాటు తాము ప్రజలకు బద్ధులుగా పనిచేస్తామని ప్రమాణం చేయనున్నారు. ఈ మహత్తర ఘట్టానికి మరి కొద్ది గంటల్లో తెర లేవనుంది. ఇదిలా ఉంటే అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. దాంతో ఇది ఉత్కంఠను రేపే అంశంగా మారుతోంది.

నోటిఫికేషన్ జారీ :

ఇదిలా ఉంటే ఈ నెల 23 నుంచి పురపాలనకు శ్రీకారం చుడుతూ కొత్త పాలక వర్గాలు పగ్గాలు అందుకునేలా రంగం సిద్ధం చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1994లోని సెక్షన్ 7(1)(అ), ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965లోని సెక్షన్ 20(1) (ఏ) ప్రకారం ఎన్నికైన సభ్యుల పదవీకాలం తొలి సమావేశానికి నిర్ణయించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం నవంబర్ 23వ తేదీని తొలి సమావేశాల తేదీగా నిర్ణయించారు. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లలో తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో కూడా అదే రోజు తొలి సమావేశాలు జరగనున్నాయి.

ఉప పాలకుల ఎన్నిక :

ఇక ఇదే సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన మేయర్లు ,చైర్‌పర్సన్లు వార్డు సభ్యులతో చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కార్పొరేషన్ లలో డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. చట్ట నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలను తొలి సమావేశంలో లేదా తొలి సమావేశం జరిగిన తేదీ నుంచి రెండు వారాల లోపు నిర్వహించే తదుపరి సమావేశంలో నిర్వహించవచ్చు. ఈ మేరకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు తొలి సమావేశాల నిర్వహణ, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ఎన్నికల ప్రాధికార సంస్థ ఆదేశించింది. ఇక చూస్తే కనుక ఏపీలో సరికొత్త ప్రజా పాలనకు స్థానికంగా అంకురార్పణ జగరనుంది. ఏకంగా ఒకేసారి రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల ఐదేళ్ల పదవి కాలం ప్రారంభం కానుంది.

Tags:    
  • andhrapradesh 
  • apmunicipalelections 
  • municipalcorporations 
  • deputymayors 

Similar News

కీలక సమయాన తమ్మినేని సైలెంట్...రీజనేంటి ?

2026-11-23 03:58 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

పెద్ద శ్రీనుని చేసిన వైసీపీ...పార్టీలో అంతర్మధనం !

2026-11-23 03:57 GMT

అటు అచ్చెన్న...ఇటు ధర్మాన...వెరీ ఇంట్రెస్టింగ్ !

2026-11-23 03:55 GMT

ఏపీలో రాష్ట్రపతి పాలన...అయ్యే పనేనా ?

2026-11-23 02:35 GMT

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

2026-11-22 12:30 GMT

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

2026-11-22 04:31 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

Copyright @2026

Powered by Blink CMS