• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  కీలక సమయాన తమ్మినేని...

కీలక సమయాన తమ్మినేని సైలెంట్...రీజనేంటి ?

| ఆముదాలవలస మున్సిపల్ ఎన్నికల్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రచారానికి దూరంగా ఉండటం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడికి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వకుండా చింతాడ రవికుమార్‌కు అప్పగించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి ప్రమీల గెలుపు కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

By - Satya P
Update: 2026-11-23 03:58 GMT

శ్రీకాకుళం జిల్లా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే సీనియర్ నేతలలో మాజీ మంత్రి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరు. ఆయన దిగ్గజ నేతగా దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన టీడీపీ నుంచి 1983లోనే తొలిసారి ఆముదాలవలసలో గెలిచి అప్పటి రాజకీయ కురు వృద్ధుడు బొడ్డేపల్లి రాజ గోపాల్ నాయుడు సొంత ఇలాకాలో సత్తా చాటారు. అలా ఆముదాలవలస తన సొంత నియోజకవర్గంగా ఆయన చేసుకున్నారు. అది లగాయతు అనేక సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన ఆయన 2009లో ప్రజారాజ్యంలో చేరడం ఆ తరువాత వైసీపీలోకి వచ్చి 2019లో గెలిచి అసెంబ్లీ స్పీకర్ కావడం జరిగాయి. ఇక 2024లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఆముదాలవలసలో టీడీపీలో తమ్మినేని ఉన్నపుడు కుడి భుజంగా ఉన్న సొంత మేనల్లుడు కూన రవి కుమార్ తరువాత కాలంలో రాజకీయ ప్రత్యర్ధిగా మారి రెండు సార్లు ఓడించడం ఆయనకు ఒక ఇబ్బందికరమైన రాజకీయంగానే మారింది.

తొలిసారి మున్సిపాలిటీ గా :

ఇక ఆముదాలవలస తొలిసారి మునిసిపాలిటీగా మారిన తరువాత తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తమ్మినేని సీతారాం అయితే కనిపించడం లేదని అంటున్నారు. దీంతో వైసీపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ఆమదాలవలస మునిసిపాలిటీలోని 28 వార్డులతో పాటు ప్రత్యక్షంగా చైర్‌పర్సన్ పదవికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సమీప గ్రామాల విలీనంతో ఏర్పడిన న్యాయ పరిపాలనా పరమైన అంశాల వల్ల నవంబర్ 1న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడి తాజాగా నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో హోరా హోరీగా సాగాల్సిన ఈ పోరులో వైసీపీ వైపు సీనియర్లు ఎవరూ నిలబడకపోవడం వెలితిగానే భావిస్తున్నారు.

దూసుకుపోతున్న కూన :

ఇక ఆముదాలవలసలో తన సతీమణి ప్రమీలను చైర్ పర్సన్ అభ్యర్ధిగా టీడీపీ తరఫున నిలబెట్టిన ఎమ్మెల్యే కూన రవి కుమార్ అంతా తానై ప్రచార పర్వాన్ని ఎన్నికల వ్యూహాలను నడిపిస్తున్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న కూటమి ఈ ఎన్నికలల్లో జోరు చూపిస్తూంటే వైసీపీ నుంచి చూస్తే ఆముదాలవలస నియోజకవర్గం ఇంచార్జి చింతాడ రవికుమార్ ఒక్కరే పార్టీ ప్రచారంలో కనిపిస్తున్నారు. చైర్ పర్సన్ అభ్యర్థిని బొడ్డేపల్లి అంజనీకుమారితో కలసి ఆయన ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎంతో బలం ఉన్న తమ్మినేని మాత్రం మౌనంగానే ఉన్నారని టాక్ నడుస్తోంది.

అంతు చిక్కని వైనం :

తమ్మినేని సీతారాం ఈ విధంగా వ్యవహరించడం మీద పార్టీలో చర్చ సాగుతోంది. పెద్దాయన వ్యూహం అయితే ఎవరికీ అంతు చిక్కడం లేదని అంటున్నారు. దాంతో ఆముదాలవలస మునిసిపల్ ఎన్నికల పుణ్యమాని వైసీపీలోని వర్గ విభేదాలు బయటపడుతున్నాయని అంటున్నారు. తమ్మినేని సీతారాం వర్గం అ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి గల నిర్దిష్ట కారణాలు ఏవీ తెలియకపోయినా ఆయన అసంతృప్తిగా ఉన్నారని ప్రచారంలో ఉంది. తన కుమారుడిని నియోజకవర్గ ఇంచార్జిగా నియమించకుండా ద్వితీయ శ్రేణి నేత చింతాడ రవి కుమార్ కి పగ్గాలు ఇవ్వడం పైన చాలా కాలంగా ఆయన ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. దీంతోనే ఆయన తాజా ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం లేదని అంటున్నారు. ఈ ఎన్నికల తరువాత పార్టీ నియోజకవర్గాలలో ఇంచార్జిల పనితీరుని సమీక్షిస్తుందని అంటున్నారు. మరి తమ్మినేని ప్లాన్ ఏంటో అపుడు వెల్లడి అవుతుందని అంటున్నారు.

Tags:    
  • tamminenisitaram 
  • kunaravikumar 
  • amadalavalasa 
  • srikakulam 
  • ysrcp 
  • tdp 

Similar News

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

పెద్ద శ్రీనుని చేసిన వైసీపీ...పార్టీలో అంతర్మధనం !

2026-11-23 03:57 GMT

పుర పాలనకు శ్రీకారం...కొత్త ఏలికలకు శుభారంభం

2026-11-23 03:57 GMT

అటు అచ్చెన్న...ఇటు ధర్మాన...వెరీ ఇంట్రెస్టింగ్ !

2026-11-23 03:55 GMT

ఏపీలో రాష్ట్రపతి పాలన...అయ్యే పనేనా ?

2026-11-23 02:35 GMT

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

2026-11-22 12:30 GMT

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

2026-11-22 04:31 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

Copyright @2026

Powered by Blink CMS