• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Vizianagaram >  పెద్ద శ్రీనుని చేసిన...

పెద్ద శ్రీనుని చేసిన వైసీపీ...పార్టీలో అంతర్మధనం !

| విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను పార్టీని వీడటం వైసీపీకి గట్టి షాక్‌గా మారింది. తన కుమార్తెకు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కకపోవడం, బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బొత్సను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. 2029లో జిల్లాలో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

By - Satya P
Update: 2026-11-23 03:57 GMT

విజయనగరం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి బలం ఉంది. ఉత్తరాంధ్రాలో వైసీపీకి కీలక స్థావరం అంటే ఈ జిల్లానే చెబుతారు. 2019 ఎన్నికల్లో అయితే విజయనగరంలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లను కైవశం చేసుకుని వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో చూస్తే పక్కాగా జెడ్పీ పీఠం గెలుస్తుంది అని ఆ మధ్య దాకా అంచనాలు ఉన్న జిల్లా కూడా ఇదే. అలాంటి చోట చిన్న శ్రీను పార్టీని వీడిపోవడం వైసీపీకి భారీ షాక్ ని ఇచ్చింది. ఇక చిన్న శ్రీను ప్రభావం లేదని వైసీపీ నేతలూ అంతా హైకమాండ్ కి చెప్పుకొచ్చారు. తీరా కార్పోరేషన్ తో పాటు మున్సిపల్, పరిషత్తు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బ తినేసింది. దాంతో ఫ్యాన్ పార్టీలో ప్రస్తుతం అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.

చిన్న కోరిక సైతం :

నిజానికి మజ్జి శ్రీనుకు పార్టీని వీడిపోయే ఆలోచన ఆ మధ్య దాకా లేదని అంటున్నారు. ఆయన తన కుమార్తెని ఈ దఫా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా చేయాలని అనుకున్నారు. ఆ కోరికను ఆయన పార్టీ పెద్దల ముందు కూడా పెట్టారు. అయితే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకపక్షంగా తన కుమార్తె జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ సడెన్ గా ప్రకటించారు. దీంతోనే చిన్న శ్రీను షాక్ తిన్నారని అంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చిన్న శ్రీను భావించినా ఆయనకు టికెట్ దక్కలేదు, దానికి జిల్లా పెద్దలే కారణం అన్న భావన ఉంది. ఎన్నికల తరువాత చూస్తే విజయనగరం జిల్లాలో కాకుండా భీమిలీలో ఆయనకు ఇంచార్జిగా నియమించారు. అది కూడా ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. ఇవన్నీ కలసి ఆయన పార్టీ మారితేనే తప్ప తనకు ఎదుగుదల ఉండదనే ఈ నిర్ణయం తీసుకున్నారు తానేంటో నిరూపించుకున్నారు అని అంటున్నారు.

సర్దుబాటు చేయలేకనే :

మరో వైపు చూస్తే బొత్సను పూర్తిగా నమ్మేసి జిల్లాను ఆయనకు అప్పగించేసి వైసీపీ అధినాయకత్వం పూర్తిగా చూస్తూండిపోయింది అని అంటున్నారు. చిన్న శ్రీనులోని అసంతృప్తిని గమనించి సర్దుబాటు చేసి ఉంటే ఆయనకు బొత్సకు మధ్య సామరస్యం కుదిర్చి పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడుతున్న ఆయనకు ప్రాధాన్యత మరింతగా ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. బొత్స అండ ఉంటే చాలు జిల్లాలో మనదే విజయం అన్న ధీమా వైసీపీ హైకమాండ్ ని ఈ రోజు ఇలా విస్తుపోయేలా చేస్తోంది అని అంటున్నారు. అసలే ఉత్తరాంధ్రాలో వైసీపీ ఎదురీత ఈదుతోంది. ఈ క్రమంలో ఉన్న విజయనగరం జిల్లాలో కూడా టీడీపీకి మరింత బలం చేకూరేలా తీసుకున్న చర్యలు చూస్తూంటే పార్టీ నేతలు కూడా భవిష్యత్తులో ఎలా అన్న ఆందోళనలో పడిపోయారు అని అంటున్నారు.

చక్రం తిప్పేస్తారా :

గత రెండు నెలలుగా బొత్స ఏమి విమర్శించినా ఒక్క మాట కూడా మాట్లాడని చిన్న శ్రీను తన కుమార్తె జెడ్పీ పీఠం ఎక్కగానే నేరుగానే బొత్స మీద మీడియా ముఖ్యంగా ఘాటు విమర్శలు చేశారు. బీసీల మీద ప్రేమ ఆయనకు లేదని అన్నారు. అలా ఉంటే కనుక బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం కార్పోరేషన్ లో ఓసీని మేయర్ అభ్యర్ధిగా ఎలా నిలబెడతారు అని ప్రశ్నించారు. బొబ్బిలి చైర్ పర్సన్ అభ్యర్ధిగా బీసీలకు ఎందుకు చాన్స్ ఇవ్వలేదని నిలదీశారు. టీడీపీ బీసీల పార్టీ అని ఆయన గట్టిగా చెప్పారు. 2029 లో పూర్తి స్థాయిలో జిల్లాలో విజయం సొంతం చేసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తూంటే జిల్లాలో మారిన ఈ పరిణామాలు వైసీపీని నైరాశ్యంలో నెడితే అధినాయకత్వం ఏ రకమైన కార్యాచరణతో ముందుకు రావాలా అని తర్జన భర్జన పడుతోంది అంటున్నారు.

Tags:    
  • chinnasrinivas 
  • majjisrinivas 
  • botsasatyanarayana 
  • ysrcp 
  • tdp 
  • vizianagaram 

Similar News

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు

2026-11-12 16:30 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

2026-11-09 17:30 GMT

జెడ్పీ పీఠం కిమిడి కుటుంబానిదేనా !

2026-11-07 04:00 GMT

Copyright @2026

Powered by Blink CMS