• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Vizianagaram >  జ‌న‌సేన అడ్డుప‌డింది.....

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

| విజయనగరం స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన అనుచరులతో సమీక్ష నిర్వహించారు. జనసేన అడ్డుపడకపోయి ఉంటే జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేదని వ్యాఖ్యానించారు. కూటమి, వైసీపీ మధ్య కేవలం 6 వేల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని సూచించారు. జిల్లాలో కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ, ఈ అంశాలను జగన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

By - Garuda Media
Update: 2026-11-15 20:30 GMT

విజ‌య‌న‌గ‌రంలో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్, స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా దెబ్బ‌తింది. ఇక్క‌డ కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. వైసీపీ కీల‌క నాయ‌కుడు, శాస‌న మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ సొంత జిల్లా కావ‌డంతో ఈ ప‌రాజ‌యం ఆయ‌న‌కు భారీ మైన‌స్‌గా మారింది. పైగా ఆయ‌న కుమార్తె అనూష కూడా జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ ప‌రిణామాల‌కు తోడు త‌న సొంత మేన‌ల్లుడు చిన్న శ్రీను ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి.. టీడీపీ చెంత‌కు చేరిపోయారు. దీంతో బొత్స హ‌వా దాదాపు త‌గ్గిపోయింది. ఈ ప‌రిస్థితిలో శ‌నివారం రాత్రి త‌న అనుచ‌రుల‌తో భేటీ అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ వైసీపీ ఓట‌మిపై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ.. జనసేన తోడు లేకపోయి ఉంటే, వైసీపీకి అడ్డు ప‌డ‌కుండా ఉండి ఉంటే.. విజయనగరంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ఉండేదని అన్నారు. జిల్లాలో కూటమికి, వైసీపీకి మధ్య కేవలం 6 వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని విశ్లేషించారు. అంతే కాదు, కక్షపూరిత రాజకీయాలు చేసే వారికి రాబోయే రోజుల్లో తగిన విధంగా సమాధానం చెబుతామని, చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఆలోచనా విధానాన్ని (మైండ్ సెట్) మార్చుకోవాల్సి న అవసరం ఏర్పడిందని బొత్స వ్యాఖ్యానించారు.

గతంలో మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులపై సానుభూతి చూపిస్తూ ‘అయ్యో పాపం’ అని వదిలేసే పరిస్థితులు ఇకపై ఉండవని బొత్స‌ స్పష్టం చేశారు. అందరినీ సమానంగా చూసే ‘ఈక్వాలిటీ రాజకీయాలు’ ప్రస్తుత వాతావరణంలో పని చేయవేమోనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను, తన అభిప్రాయాలను పార్టీ అధినేత జ‌గ‌న్‌కు చెబుతాన‌ని వ్యాఖ్యానించారు. జిల్లాలో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని వైసీపీకి వ్య‌తిరే కంగా ప‌నిచేశార‌ని అన్నారు. ఇదేస‌మయంలో చిన్న శ్రీను కుమార్తె విష‌యాన్ని కూడా ప్ర‌త్యేకంగా బొత్స ప్ర‌స్తావించారు.

''అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా రాజకీయం చేస్తారు. ఓడిపోయినప్పుడు పార్టీ కి అండగా ఉండడం నాయకుడి లక్షణం. అధికారం ఉంది కదా అని బీసీని ఓసీగా, ఓసీని బీసీ గా చేయాలి అంటే గతంలోనే విజయనగరం మేయర్ గా శ్రావణి ని చేసేవాళ్ళం.'' అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే భవిష్యత్ లో జరిగే పరిణామాలు కూడా ఆలోచించాలని ప‌రోక్షంగా చిన్న‌శ్రీనును ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఇటీవ‌ల ఇదే జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల నాయుడు కూడా వైసీపీకి రాం రాం చెప్పారు. ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, బొత్స ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    
  • botsasatyanarayana 
  • ysrcp 
  • janasena 
  • vijayanagaram 

Similar News

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు

2026-11-12 16:30 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

2026-11-09 17:30 GMT

జెడ్పీ పీఠం కిమిడి కుటుంబానిదేనా !

2026-11-07 04:00 GMT

వైసీపీ హైకమాండ్ కారణం...నేతల రుసరుసలు

2026-11-07 04:00 GMT

బొత్సను సవాల్ చేస్తున్న బంధువులు

2026-10-31 04:01 GMT

బిగ్ డిబేట్‌: వైసీపీ... ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వృద్ధుల పార్టీనా.. ?

2026-10-27 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS