• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Vizianagaram >  కోలగట్ల హవాకు చెక్...

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

| విజయనగరం రాజకీయాల్లో పట్టున్న కోలగట్ల వీరభద్రస్వామికి తాజా మేయర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. కుమార్తె శ్రావణి గెలుపుపై అతివిశ్వాసంతో వార్డు అభ్యర్థులను పట్టించుకోకుండా మేయర్ అభ్యర్థికే ఓటేయాలని ప్రచారం చేయడం వ్యూహాత్మక తప్పిదంగా మారిందనే విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు టీడీపీ బీసీ కార్డుతో గెలవడంతో వచ్చే ఎన్నికల్లో కోలగట్ల రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.

By - Tupaki Desk
Update: 2026-11-11 03:55 GMT

అందరూ విజయనగరం జిల్లా అంటే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గురించే ఎక్కువగా చెప్పుకుంటారు. కానీ ఆయన సమకాలీనుడు కాలేజీ మేట్ అయిన కోలగట్ల వీరభద్రస్వామి గురించి అంతగా మాట్లాడరు. నిజానికి స్వామి కానీ బొత్స కానీ దివంగత నేత దిగ్గజ నేత అయిన మాజీ మంత్రి సాంబశివరాజు దగ్గరనే రాజకీయం స్టార్ట్ చేశారు అంటారు. ఆ తరువాత ఈ ఇద్దరూ సొంతంగా ఎదిగారు. విజయనగరంలో మంచి పట్టుని కోలగట్ల సంపాదించారు. 1989 లోనే ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇక 2004లో ఆయనకు టికెట్ కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. అప్పటి ఉమ్మడి ఏపీ మంత్రి అశోక్ గజపతిరాజునే ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు.

జగన్ తోనే కలిసి :

ఇక కాంగ్రెస్ లో బొత్స కోలగట్ల ఉన్నా ఎవరి వర్గం అన్నట్లుగానే సాగేది. దీంతో జగన్ వెంట నడచి వైసీపీకి విజయనగరంలో పునాదులు ఆయన వేశారు. దానికి ప్రతిగా ఎమ్మెల్సీ పదవిని అందుకున్నారు. ఇక 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి ఈసారి రాజు గారి అమ్మాయి అదితి గజపతిరాజుని ఓడించారు. మంత్రి పదవి ఖాయం అనుకుంటే సామాజిక సమీకరణలు ఆయనకు కలసిరాలేదు. దాంతో ఉప సభాపతి గానే మిగిలిపోయారు. 2021లో కుమార్తె శ్రావణిని మేయర్ గా చేయాలనుకున్నా బీసీకి సీటు రిజర్వ్ కావడంతో కుదరలేదు. తాజా ఎన్నికల్లో అవకాశం వచ్చినా కూడా కోలగట్ల రాజకీయ వ్యూహం తారు మారు కావడంతో ఓటమి తప్పలేదని విశ్లేషిస్తున్నారు.

అతి విశ్వాసంతోనే :

ఇక కోలగట్ల తన కుమార్తె పేరుని ప్రకటించిన వెంటనే ఆమె మేయర్ గా గెలవడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. దాంతో ఆయన కూతురు కోసం గట్టిగానే ప్రచారం చేశారు. కూటమిలో చివరి వరకూ సీట్ల పంచాయతీ తెమలకపోవడంతో ఆ లుకలుకలు అసంతృప్తి అన్నీ కలసి వస్తాయనుకున్నారు. దశాబ్దాల తన రాజకీయ అనుభవంతో పాటు తమ సామాజిక వర్గానికి ఉన్న ఓటు బ్యాంక్ ఇవన్నీ కలసి వైసీపీ ఓటు బ్యాంక్ తో మిక్స్ అయి భారీ ఓట్ల తేడాతో కుమార్తె శ్రావణి గెలుస్తుంది అని నమ్మారు. అందుకే దూకుడుగా ప్రచారం చేశారు.

అక్కడే దెబ్బ కొట్టింది :

అయితే కోలగట్ల ఇంత చేసినా అసలు విషయం మరచారు అని అంటున్నారు. ఆయన నేల విడిచి సాము చేశారని చెబుతున్నారు. ఆయన వార్డులకు పోటీ చేస్తే తమ పార్టీ అభ్యర్ధుల గురించి పట్టించుకోకుండా కేవలం మేయర్ కి ఓటేయండి అంటూ చేసిన ప్రచారమే రివర్స్ అయింది అని అంటున్నారు. దాంతో వైసీపీ నుంచి పోటీ చేసిన కార్పోరేటర్ అభ్యర్ధులు తీవ్ర అసంతృప్తికి లోను కావడం వల్లనే మేయర్ అభ్యర్ధిగా శ్రావణి ఓడిపోయారు అని అంటున్నారు. మేయర్ ఎన్నిక ఒక్కటీ జరిగితే ఆ తీరు వేరు, కానీ వార్డులలో కార్పోరేటర్లు కూడా పోటీ పడుతున్నారు. అందువల్ల రెండు ఓట్లు వారే తీసుకుని రావాల్సి ఉంది. అలాంటి వారితో కలసి కో ఆర్డినేట్ చేసుకుంటూ వారికి అండదండగా నిలిస్తే కోలగట్ల కుమార్తెకు అంతా మేలు జరిగేదని అంటున్నారు. కోలగట్ల వ్యూహమే తప్పుగా సాగిందని అంటున్నారు.

బీసీల నుంచి :

ఇక చూస్తే కోలగట్ల వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదుల వయసు దాటుతారు అని అంటున్నారు. తన కుమార్తెని ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ విజయనగరంలో తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో బీసీ కార్డుతో టీడీపీ గెలిచింది. దాంతో వైసీపీ కూడా పునరాలోచనలో పడింది అని అంటున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీసీలు ఉండడమే దీనికి కారణం. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ కూడా బీసీల వైపు చూస్తే కనుక కోలగట్ల హవాకు చెక్ పడినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • kolagatlaveerabhadraswamy 
  • vizianagaram 
  • ysrcp 
  • tdp 
  • appolitics 

Similar News

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు

2026-11-12 16:30 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

2026-11-09 17:30 GMT

జెడ్పీ పీఠం కిమిడి కుటుంబానిదేనా !

2026-11-07 04:00 GMT

వైసీపీ హైకమాండ్ కారణం...నేతల రుసరుసలు

2026-11-07 04:00 GMT

బొత్సను సవాల్ చేస్తున్న బంధువులు

2026-10-31 04:01 GMT

బిగ్ డిబేట్‌: వైసీపీ... ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వృద్ధుల పార్టీనా.. ?

2026-10-27 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS