• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Vizianagaram >  బొత్స కూతుర్ని ఓడించిన...

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

| విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి పాశల నీరజ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై ఆమె విజయం సాధించారు. చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర, కర్రోతు చంద్రకళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జెడ్పీ పీఠంపై కూటమి నాయకత్వం తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

By - Satya P
Update: 2026-11-11 01:47 GMT

విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్నది ఇపుడు అతి పెద్ద చర్చకు తావిస్తోంది. ఉత్తరాంధ్రాలో మిగిలిన జిల్లాల సంగతి పక్కన పెడితే జెడ్పీ పీఠం కోసం రాజకీయ ప్రకంపనలే రేపిన జిల్లాగా దీనిని అంతా చూస్తూ వస్తున్నారు. దానికి కారణం సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు చిన్న శ్రీనుకు మధ్య జెడ్పీ పీఠం కోసమే విభేదాలు వచ్చాయని తన కూతురు చైర్ పర్సన్ కావాలని అటు బొత్స ఇటు చిన్న శ్రీను ప్రతిష్టగా తీసుకోవడం వల్లనే పార్టీని ఆయన వీడిపోయారు అని కూడా అప్పట్లో చర్చ సాగింది. ఇక విజయనగరం జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అదే వేడిని రగిలించాయి. ఏకంగా బొత్స కుమార్తె అనూషను గజపతినగరం అసెంబ్లీ నియోజకవరంలోని బొండపల్లిలో కూటమి అయిదు వేల ఓట్ల తేడాతో ఓడించి మరీ పెద్దాయనకు అలా చెక్ పెట్టేసింది. దీని వెనక చిన్న శ్రీను వ్యూహం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాతుర్యం ఉందని కూడా చెప్పుకున్నారు.

సాధారణ మహిళగా :

ఇంతకీ బొత్స అనూషను ఓడించినది ఎవరూ అంటే ఒక సాధారణ మహిళ. ఆమె పేరు పాశల నీరజ. రాజకీయాల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన బొత్స అనూష కేవలం జెడ్పీటీసీగానే కాదు ఏకంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో ఉంటారని అంతా భావించారు. కానీ క్షేత్రస్థాయిలో సామాన్య మహిళగా గుర్తింపు ఉన్న పాశల నీరజ ఆమెకు గట్టి పోటీని ఇవ్వడమే కాదు ఓడించారు. దీని వెనక కూటమి పక్కా వ్యూహం ఉంది. స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ కూటమి శ్రేణులు చేసిన ఆర్భాటాలు లేని ఇంటింటి ప్రచారం క్షేత్రస్థాయి సమీకరణాలు పాశల నీరజ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అలా విజయనగరం జిల్లాలో అత్యంత పట్టున్న బొత్స కుటుంబానికి ఈ ఓటమి ద్వారా భారీ షాక్ ఇచ్చిన పాశల నీరజనే ఇపుడు జెడ్పీ పీఠం మీద కూర్చోబెడతారు అన్నది ప్రచారంలో ఉన్న సమాచారంగా ఉంది.

రేసులో అగ్రభాగాన :

జెడ్పీ చైర్ పర్సన్ పీఠం రేసులో ఇపుడు పాశల నీరజ చాలా ముందు వరసలో ఉన్నారు. ఆమెతో పాటు గెలిచిన కూటమి జడ్పీటీసీ సభ్యులలో చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె కర్రోతు చంద్రకళ, పూజిత, ప్రవళి వంటి మరి కొందరు మహిళా నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ పీఠం చిన్న శ్రీను కుమార్తెకే అని అనుకున్నారు. ఆమె కులం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాంతో ఆమె తెర్లాం బీసీ రిజర్వుడ్ అయిన జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేశారు. దాంతో ఆమె విషయంలో ఏ రకమైన తీర్పు వస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది.

అనూహ్య నిర్ణయంతో :

ఈ క్రమంలో జెడ్పీ రేసులో అనేక మంది పోటీలో ఉండడంతో అందరికీ ఆమోద యోగ్యంగానూ ఉంటుందని ఒక సాధారణ మహిళకు ఉన్నత పీఠం ఇచ్చినట్లుగానూ ఉంటుందని కూటమి పెద్దలు భావిస్తూ పాశల నీరజ పేరుని తెర ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు. బొత్స ఫ్యామిలీ వారసురాలికి మొదటి ఓటమి రుచి చూపించిన పాశల నీరజనే జెడ్పీ పీఠం మీద ఉంచాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కూటమి నాయకత్వం విజయనగరం జెడ్పీ పీఠాన్ని ఎవరికి కేటాయిస్తుందనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    
  • pasalaneeraja 
  • vizianagaram 
  • zpchairperson 
  • botsaanusha 
  • chinnasrinu 

Similar News

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు

2026-11-12 16:30 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

2026-11-09 17:30 GMT

జెడ్పీ పీఠం కిమిడి కుటుంబానిదేనా !

2026-11-07 04:00 GMT

వైసీపీ హైకమాండ్ కారణం...నేతల రుసరుసలు

2026-11-07 04:00 GMT

బొత్సను సవాల్ చేస్తున్న బంధువులు

2026-10-31 04:01 GMT

బిగ్ డిబేట్‌: వైసీపీ... ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వృద్ధుల పార్టీనా.. ?

2026-10-27 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS