• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జైలు - బెయిల్ రాజకీయాల...

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

| కేంద్రానికి అందిస్తున్న మద్దతుతో ప్రధాని మోదీని బ్లాక్‌మెయిల్ చేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, కేంద్రం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. అమరావతి అభివృద్ధి, పెట్టుబడులు, జల్ జీవన్ మిషన్, విశాఖ డేటా సెంటర్‌కు కేంద్రం మద్దతు అందిస్తోందని పేర్కొన్నారు. వైసీపీ నేతల బ్లాక్‌మెయిల్ సలహాలను తప్పుబట్టారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-22 12:30 GMT

కేంద్ర ప్రభుత్వానికి తాము అందిస్తున్న మద్దతును అడ్డుపెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బ్లాక్‌మెయిల్ చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తమ మద్దతును ఆసరాగా చేసుకుని కేంద్రం ముందు గొంతెమ్మ కోరికలు కోరాలని వైసీపీ నాయకులు సలహాలు ఇస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయలేదని, ఇప్పుడు కూడా అదే పంథాలో విలువలకు కట్టుబడి ముందుకు సాగుతానని తేల్చిచెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన చంద్రబాబు, అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలన్న ఆలోచనే అత్యంత దుర్మార్గమని వ్యాఖ్యానించారు. అసలు వైసీపీ నేతలకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి మురగబెడితే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం వాటిని తిరిగి పునరుద్ధరించిందని గుర్తుచేశారు. కేంద్రం నుంచి అందుతున్న సంపూర్ణ సహకారంతో ఆర్థిక కష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని వివరించారు.

దేశానికి వస్తున్న పెట్టుబడులలో 25 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌కు దక్కేలా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని సీఎం వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయం అందరికీ తెలిసిందేనని, పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతికి తీసుకొస్తున్నారని తెలిపారు. ఆయా సంస్థల ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుందని చెప్పారు. అలాగే, జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పిస్తున్నారని, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామంటే తక్షణమే అనుమతులు మంజూరు చేశారని ప్రస్తావించారు.

రాజకీయంగా బీజేపీ సిద్ధాంతాలు వారికి ఉంటాయని, తమ సిద్ధాంతాలు తమకు ఉంటాయని, అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇరువురం చేతులు కలిపామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ బలమైన నాయకుడని తాను ఇప్పుడు కొత్తగా చెప్పడం లేదని, 2014 ఎన్నికల కంటే ముందు నుంచే తనకు ఆయనతో పరిచయం ఉందని, అప్పుడే ఆయన్ను బలమైన నాయకుడిగా ప్రకటించానని తెలిపారు. కావాలంటే పాత రికార్డులు చూసుకోవచ్చని పరోక్షంగా వైసీపీ నేతలకు చురకలంటించారు. గతంలో తమ మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించిన చంద్రబాబు, ఆ విభేదాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వచ్చాయని, వైసీపీ అధినేత జగన్‌లా వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, 'జైలు - బెయిల్' రాజకీయాల కోసమో కాదని పరోక్షంగా నిప్పులు చెరిగారు. స్వార్థపూరిత రాజకీయాలు చేసే ఇలాంటి నేతలు ఉన్నంత కాలం ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన హితవు పలికారు.

Tags:    
  • chandrababu 
  • narendramodi 
  • tdpbjpalliance 
  • andhrapradesh 

Similar News

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

2026-11-22 04:31 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ..ఓటమిపై బాబు కామెంట్ !

2026-11-22 04:15 GMT

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

2026-11-22 00:22 GMT

జగన్ అంతకు మించి చేయలేరా ?

2026-11-22 00:21 GMT

బాబు హింట్ ఇచ్చారా... ఎవరా ఎమ్మెల్యేలు ?

2026-11-22 00:16 GMT

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

2026-11-21 23:59 GMT

టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన 'క్వాంటం' విప్లవం

2026-11-21 18:47 GMT

నొప్పిలేని పరీక్షలు.. రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో సెన్సార్ల సంచలనం

2026-11-21 18:45 GMT

Copyright @2026

Powered by Blink CMS