• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  బాబు హింట్ ఇచ్చారా......

బాబు హింట్ ఇచ్చారా... ఎవరా ఎమ్మెల్యేలు ?

| స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. పనితీరు మెరుగుపర్చుకునేందుకు సమయం ఇస్తున్నామని, ఫలితాలపై అధ్యయనం చేసి అవసరమైన పార్టీ, పాలనా మార్పులు చేపడతామని తెలిపారు.

By - Satya P
Update: 2026-11-22 00:16 GMT

ఏపీలో అధికార కూటమిలో ఉన్న పలువురు ఎమ్మెల్యేల పని తీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం ప్రదర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపధ్యంలో బాబు కూటమి ఎమ్మెల్యేల పని తీరు మీద సమీక్షను నిర్వహించారు. ఇదే సందర్భంలో ఆయన ఎమ్మెల్యేల పని తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సూచించడం విశేషం. ఒక విధంగా చూస్తే బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఒక సంకేతంగా ఒక హెచ్చరికగా చూడాలని అంటున్నారు.

కొన్ని సీట్లలో అలా :

ఇక ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలలో ఆశించిన స్థాయిలో కూటమికి ఫలితాలు రాకపోవడంపైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పెద్దగా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అంతే కాదు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల పనితీరుని తీరును కూడా ఆయన తప్పుబట్టారని అంట్న్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక కొందరు ఎమ్మెల్యేలు చేసిన పనులను ప్రజలు ఆమోదించలేదని అంటున్నారు. దాంతో అక్కడక్కడ ఆ తరహా ప్రతికూల పరిస్థితులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా స్పష్టంగా కనిపించాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఆత్మపరిశీలనకు సమయం :

అంతే కాదు బాబు మరో మాట అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా కొంతమంది ఎమ్మెల్యేలలో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి తగినంత సమయం ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక మీదట నుంచి అయినా ఆయా ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించడం విశేషం.

లోతుగానే అధ్యయనం :

మరో వైపు చూస్తే పార్టీలో విధానపరమైన మార్పులకు ఆస్కారం ఉంటుందని కూడా బాబు హింట్ ఇచ్చారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న కారణాలను క్షేత్రస్థాయి లోపాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని సైతం చంద్రబాబు తెలిపారు. ఈ తరహా విశ్లేషణ అనంతరం పార్టీ పరంగానే కాకుండా పరిపాలనా పరంగా అవసరమైన విధానపరమైన మార్పులు తీసుకువస్తామని ఆయన నియోజకవర్గాల్లోని అంతర్గత సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

ఎవరా ఎమ్మెల్యేలు :

అయితే, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినాయకత్వం కోణంలో పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారు అన్నది కూడా చర్చగా ఉంది. మరి చంద్రబాబు తీవ్ర అసంతృప్తికి గురైన సదరు ఎమ్మెల్యేల పేర్లు లేదా నియోజకవర్గాల జాబితా అయితే తెలియడం లేదు కానీ అధినాయకత్వం వద్ద లిస్ట్ మొత్తం ఉందని అంటున్నారు. దాంతో ఆత్మ పరిశీలన చేసుకోవాలని బాబు వారికి హింట్ ఇచ్చారని అంటున్నారు. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉందని ఈలోగా ఎవరైతే తప్పులు దిద్దుకుని బెటర్ పెర్ఫార్మ్ చేస్తారో వారికి భరోసా ఉంటుందని అంటున్నారు. ఇంకా తీరు మార్చుకోలేని వారి విషయంలో మాత్రం అధినాయకత్వం కఠినంగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆ జాబితాలో ఎంత మంది ఉన్నారో ఏమిటో అన్నది.

Tags:    
  • chandrababunaidu 
  • apolitics 
  • tdp 
  • localbodyelections 

Similar News

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

2026-11-22 00:22 GMT

జగన్ అంతకు మించి చేయలేరా ?

2026-11-22 00:21 GMT

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

2026-11-21 23:59 GMT

టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన 'క్వాంటం' విప్లవం

2026-11-21 18:47 GMT

నొప్పిలేని పరీక్షలు.. రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో సెన్సార్ల సంచలనం

2026-11-21 18:45 GMT

3 గంట‌ల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్ర‌బాబు

2026-11-21 17:39 GMT

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS