• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  వైఎస్సార్ క్లోజ్...

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

| దివంగత వైఎస్సార్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ 1978లో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, అసెంబ్లీలో రాజకీయంగా పోరాడినా బయట స్నేహంగానే ఉండేవారమని చెప్పారు. అయితే జగన్ తీరు భిన్నంగా ఉందని, విమర్శలను వ్యక్తిగతంగా తీసుకుంటూ హిట్ అండ్ రన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు వేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

By - Satya P
Update: 2026-11-22 00:22 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. మరో రెండేళ్ళలో ఆయన అర్ధ శతాబ్దం రాజకీయాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన ఈ ప్రస్థానంలో ఎందరో రాజకీయ నేతలతో కలిసి పనిచేశారు, రాజకీయ పోరాటాలు చేశారు. స్నేహాలు బంధాలు ఇలా ఎన్నో చూశారు. అయితే చంద్రబాబు జగన్ ల మధ్య రాజకీయ పోరాటం అయితే ఒక డిఫరెంట్ యాంగిల్. ఇది అందరికీ తెలిసిందే. నిజంగా తండ్రితో కొడుకుతో రాజకీయ పోరాటం చేస్తూ లాంగ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్న హిస్టరీ మాత్రం చంద్రబాబుదే. అయితే చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతూ అపుడపుడు వైఎస్సార్ ప్రస్తావన కూడా తెస్తూంటారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన దివంగత వైఎస్సార్ ని తలచుకున్నారు.

క్లోజ్ ఫ్రెండ్ అంటూ :

తనకు వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తానూ ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఇద్దరమూ 1978 లో రాజకీయాల్లో అడుగుపెట్టామని కాంగ్రెస్ లో పనిచేశామని 1983 దాకా తన స్నేహ బంధం కొనసాగింది అని అన్నారు. ఆ తర్వాత తాను టీడీపీలోకి వెళ్తే వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండిపోయారు అన్నారు. ఇక వైఎస్సార్ తో తాను రాజకీయంగా పోరాటం చేశాను అన్నారు. అసెంబ్లీలో ఇద్దరి మధ్యన హోరాహోరీ పోరు సాగేదని కానీ బయటకు వచ్చాక మాత్రం స్నేహంగానే ఉండేవారమని చెప్పారు. వైఎస్సార్ తన ఇంట్లో పెళ్ళిళ్లకు తనను ఆహ్వానించారని చంద్రబాబు చెప్పారు. ఇవనీ మన సంస్కృతిలో భాగం అని అన్నారు.

జగన్ డిఫరెంట్ :

ఇక వైసీపీ అధినేత జగన్ మాత్రం డిఫరెంట్ అని బాబు చెప్పుకొచ్చారు. ఆయనకు రాజకీయంగా పోరాటం చేసే ఓపిక కూడా లేదని అన్నారు. ఎంతసేపూ బురదజల్లడమే వైసీపీకి వచ్చు అని విమర్శించారు. హిట్ అండ్ రన్ అన్నట్లుగా ఏదో ఒకటి బురద జల్లేసి పారిపోతూంటారని కామెంట్స్ చేశారు. రాజకీయంగా ఎన్నో ఉంటాయి, కానీ వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. షర్మిల ఆయన సొంత చెల్లెలు అని గుర్తు చేస్తూ ఒక కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉంటాయని అంత మాత్రం చేత శత్రువులుగా చూడాలా అన్నారు. ఒకే కుటుంబం నుంచి భార్యా భర్తలు అన్నదమ్ములు తండ్రీ కొడుకులు వేరు పార్టీలలో ఉన్న సందర్భాలు ఉన్నాయని బాబు గుర్తు చేశారు. తాము విమర్శలు చేస్తే అది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అని వైసీపీ మీద మండిపడ్డారు.

మంచి విధానం కాదని :

ఈ తరహా విధానం తాను ఎక్కడా చూడలేదని బాబు అన్నారు. ఇది మంచి విధానం కానే కాదని అన్నారు. రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు అన్నారు. ఒక ఊరిలో ఒక కుటుంబం మీద పగ ఉన్న వాడు సైతం తమకు గిట్టని వారి ఇంట పెళ్ళి జరిగితే పెళ్ళికి వెళ్ళకపోవచ్చు లేదా ఊరు వదిలి పోవచ్చు కానీ పెళ్ళిని చెడగొట్టరు కదా అని బాబు అన్నారు. వైసీపీ నాయకత్వం మాత్రం వేరే విధంగా ఆలోచిస్తోంది అని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా విధ్వంసాన్ని మాత్రమే నమ్ముకుందని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్ అన్న బాబు జగన్ ని మాత్రం హిట్ అండ్ రన్ అంటూ కొత్త పేరు పెట్టేశారు. మరి దీని మీద వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    
  • chandrababu 
  • ysr 
  • ysjagan 
  • andhrapradeshpolitics 
  • tdp 
  • ysrcp 

Similar News

జగన్ అంతకు మించి చేయలేరా ?

2026-11-22 00:21 GMT

బాబు హింట్ ఇచ్చారా... ఎవరా ఎమ్మెల్యేలు ?

2026-11-22 00:16 GMT

టీటీడీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్...121 కిలోల బంగారం విరాళం !

2026-11-21 23:59 GMT

టెక్ స్టూడెంట్స్ కోసం ఏపీలో అద్భుత ఏఐ వర్సిటీ.. అమరావతిలో మొదలైన 'క్వాంటం' విప్లవం

2026-11-21 18:47 GMT

నొప్పిలేని పరీక్షలు.. రొమ్ము క్యాన్సర్ గుర్తింపులో సెన్సార్ల సంచలనం

2026-11-21 18:45 GMT

3 గంట‌ల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్ర‌బాబు

2026-11-21 17:39 GMT

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS