• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  వెంటిలేట‌ర్ నుంచి లేచి...

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

| వైసీపీ పాలనలో ఏపీ ఆర్థికంగా దెబ్బతిని వెంటిలేటర్‌పైకి వెళ్లిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ఆక్సిజన్ అందించి రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టామని, వచ్చే రెండేళ్లలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని అన్నారు. 2047 వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

By - Garuda Media
Update: 2026-11-21 17:23 GMT

రాష్ట్రాన్ని వెంటిలేట‌ర్ పై నుంచి ప్ర‌స్తుతం అడుగులు వేయించే స్థాయికి తీసుకువ‌చ్చామ‌ని.. సీఎం చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ హ‌యాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం తుడిచి పెట్టుకుపోయింద‌న్నారు. అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని.. క‌నీసం అప్పు పుట్టే ప‌రిస్తితి లేకుండా అరాచ‌కాలు సృష్టించార‌ని విమ‌ర్శించారు. ``ఎవ‌రినైనా పెట్టుబ‌డులు పెట్టాల‌ని అడిగితే.. ఆ పార్టీ అధికారంలోకి రాదుక‌దా! అని అడిగే ప‌రిస్థితి వ‌చ్చారు. వారికి న‌చ్చ‌జెప్పి ఒప్పించి పెట్టుబ‌డులు తీసుకువ‌స్తున్నాం.`` అని చెప్పారు.

కేంద్రంతో ఉన్న సంబంధాల‌ను కూడా వైసీపీ కాల‌రాసింద‌న్నారు. అనేక ప‌థ‌కాల‌కు రాష్ట్ర వాటా కింద‌ నిధులు కేటాయించ‌కుండా తాత్సారంచేసి.. కేంద్రం ఇచ్చే నిధుల‌ను కూడా రాకుండా అడ్డుకున్నార‌ని తెలిపారు. ర‌హ‌దా రులను గుంత‌ల మ‌యం చేసి వ‌దిలేశార‌ని అన్నారు. ఏ వ‌ర్గం కూడా.. గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో సంతోషంగా లేద‌న్నారు. రైతుల‌ను వేధించార‌ని ఆరోపించారు. వారి భూములు సొంతం చేసుకునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చార‌ని చెప్పారు.

తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక్కొక్క‌టి స‌రిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామ‌న్నారు. ఒక్క మా ట‌లో చెప్పాలంటే.. 2024కు ముందు వెంటిలేట‌ర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గ‌త రెండున్న‌రేళ్ల కాలంలో ఆక్సిజ‌న్ అందిం చి లేచి న‌డిచే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చామ‌న్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో ప‌రుగులు పెట్టిస్తామ‌న్నారు. విక‌సిత్ఆంధ్ర ప్ర‌దేశ్ - 2047 ల‌క్ష్యాన్ని సాధించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష్యాల‌ను సిద్ధం చేసుకున్నామ‌న్నారు. పెట్టుబ‌డులు ఆహ్వానిస్తూనే.. స్వ‌యంగా ఏం చేయ‌గ‌ల‌మో అన్నీ చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు.

ఈ క్ర‌మంలో అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తును కూడా కూడ‌గ‌ట్టిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ``ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వానికి మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లుగా భావిస్తున్నాం. ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉందో స‌మీక్షిస్తున్నారు. ప్ర‌జ‌లు మాకు అప్ర‌తిహ‌త విజ‌యం అందించారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే దేవుళ్లు. కూట‌మిని వారు ఆశీర్వ‌దించారు. వారికి చేయాల్సిన‌వి అన్నీ చేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకున‌డిపించే బాధ్య‌త మాది.`` అని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. కూట‌మిగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు.

Tags:    
  • chandrababunaidu 
  • andhrapradesh 
  • apdevelopment 
  • ysrcp 
  • tdp 
  • tdpalliance 

Similar News

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?

2026-11-21 03:31 GMT

ఉత్తరాంధ్రాలో రెండు జిల్లాలు జనసేనకే !

2026-11-21 03:30 GMT

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

Copyright @2026

Powered by Blink CMS