• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ధరలకు కూటమి...

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

| ఏపీలో నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125కు విక్రయించాలని నిర్ణయించింది. ధరల నియంత్రణకు ఏడాది కార్యాచరణ సిద్ధం చేసి, ప్రతి వారం సమీక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

By - Satya P
Update: 2026-11-20 17:40 GMT

ఏపీలో నిత్యావసరాల ధరలు నింగిని అంటిన సంగతి తెలిసిందే. బియ్యం నుంచి పప్పుదినుసులు ఇలా కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రతీ సరుకు సామాన్యుడి మీద బరువు మోపుతోంది. అలా రేట్లకు రెక్కలొచ్చి పేదవాడి వంటింటి మీద దాడి చేస్తున్నాయి. దాంతో ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సుదీర్ఘమైన సమీక్షను తాజాగా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలకు కత్తెర వేయాల్సిందే అని సంబంధిత శాఖలను ఆదేశించారు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి మార్కెట్ జోక్యంపైన ఏడాది కాలానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

డిసెంబర్ నుంచే :

ఇక నిత్యావసర ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చంద్రబాబు కోరారు. ప్రతివారం అధికారులు సమీక్షించాలని స్పష్టం చేశారు. డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్‌ను రేషన్ షాపుల ద్వారా విక్రయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కందిపప్పు కిలో 100 రూపాయలు వంతున, గోధుమ పిండి 25 రూపాయలు వంతున లీటర్ పామాయిల్ 125 రూపాయలు చొప్పున రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతు బజార్ల ద్వారా కిలో రూ.35కు ఉల్లి విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ధరణి బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు రైతు బజార్లల్లో విక్రయిస్తున్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడిందని మంత్రి మనోహర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సమీక్షలో వివరించారు. బహిరంగ మార్కెట్‌లో కూడా బియ్యం ధరలను అదుపులో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.

అన్ని విభాగాలు ఒక్కటిగా :

రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకోవాలని ఈ మేరకు వ్యవసాయం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రైతు బజార్లు వంటి విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ధరల పెరుగుదల అంశంపై ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే కాకుండా నిరంతరం సమీక్షిస్తూనే ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ధరల నియంత్రణ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏడాది కాలానికి కార్యాచరణను సిద్ధం చేసుకోవడంతోపాటు ప్రతి వారం తప్పనిసరిగా అధికారులు సమీక్షించాలని సూచించారు. అదే సమయంలో పంట పండించిన రైతుకూ నష్టం వాటిల్లకూడదని, అలాగే వినియోగదారునికి కష్టం రాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ధరలను అదుపులోకి తెచ్చేందుకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేందుకు ఖర్చు అవుతుందనే ఆలోచన వద్దే వద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎంత ఖర్చు అయినా ధరలను కట్టడి చేయాల్సిందే అని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
  • chandrababunaidu 
  • andhrapradesh 
  • apgovernment 
  • essentialcommodities 

Similar News

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

Copyright @2026

Powered by Blink CMS