• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  సీఎంగా లోకేష్.......

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

| ఏపీలో కూటమి విజయాల నేపథ్యంలో నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే చర్చ మొదలైంది. 2029 ఎన్నికలకు ఏడాది ముందే ఆయనకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే మాస్ ఇమేజ్ పెరుగుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు వెళ్లే అవకాశంపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై అధికారిక స్పష్టత లేదు.

By - Satya P
Update: 2026-11-20 17:30 GMT

తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి సగం పాలన పూర్తి అయింది. రాజకీయంగా అప్రతిహతమైన విజయాలను ఈ కూటమి అందుకుంటోంది. 2024 ఎన్నికల్లో 96 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంటే తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో అది కాస్తా 99 శాతంగా మారిపోయింది. ఒక విధంగా ఏపీ రాజకీయాంలో కూటమికి ఎదురు లేని పరిస్థితి ఉంది. ప్రత్యర్ధి వైసీపీ అయితే తన ఓటు బ్యాంక్ ని 34 శాతానికి తగ్గించుకుందని కూడా ఈ ఫలితాలు నిరూపించాయి. ఏకంగా పాతిక శాతం ఓటు షేర్ గ్యాప్ కూటమి వైసీపీల మధ్య ఉంది. మరి ఇంతటి సానుకూల వాతావరణంలో ఏపీలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నదే చర్చగా సాగుతోంది. లోకేష్ ని ముఖ్యమంత్రిగా కూటమి ప్రకటించడానికి ఇంతకంటే మించిన సమయం వేరొకటి లేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

కరెక్ట్ సమయం ఇదే :

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు వారసత్వంగా ఎలాంటి ఫ్రీ పాస్ ఉండదని కేవలం నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం ప్రజల విశ్వాసంతోనే ఆయన అత్యున్నత స్థానాన్ని సంపాదించుకోవాలని స్పష్టం చేశారు. ఇది బాబు మార్క్ కామెంట్స్ అనుకున్న గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు వేరేగా ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల సమీకరణాలను బట్టి చూస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం అనేది దాదాపు ఖాయమైపోయినట్లే కనిపిస్తోందని అంటున్నారు. ఒక విధంగా లోకేష్ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పగ్గాలు అందుకోవడం అనివార్యంగా కనిపిస్తుంది. ఎలా అంటే చంద్రబాబు వయసు రీత్యా కూడా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తూ ముందుకు సాగడం సవాల్ గానే ఉంటుంది అంటున్నారు. 2029 నాటికి 79 ఏళ్లు బాబుకు వస్తాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయడం, రోజుకు 18 గంటలు శ్రమించడం బాబుకు శారీరకంగా కూడా పెను సవాలుగా మారుతుందని అంటున్నారు. అందువల్ల లోకేష్ నాయకత్వం అందుకోవాల్సిందే అన్నది ఒక బలమైన వాదనగా ఉంది.

జగన్ పవన్ మాస్ ఇమేజ్ :

ఇంకో వైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కానీ కూటమిలో మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ మాస్ ఇమేజ్ తో బలంగా కనిపిస్తారు. పైగా ఈ ఇద్దరి ఏజ్ చూస్తే బాబు కంటే పాతికేళ్ళు చిన్న వారు. మరి ఆ విధంగా చూస్తే వారితో రేపటి రాజకీయ యుద్ధంలో ఢీ కొట్టాలంటే టీడీపీకి కూడా అదే స్థాయి యువ నాయకత్వంతో పాటు పక్కా మాస్ అప్పీల్ ఉన్న ఫేస్ అత్యవసరం అని అంటున్నారు. ఇక టీడీపీలో చూస్తే ప్రస్తుతం చంద్రబాబు పార్టీలోని సీనియర్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండగా మంత్రి లోకేష్ మాత్రం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తనదైన ‘నెక్స్ట్ జనరేషన్’ టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే లోకేష్ కి ఉంది క్లాస్ ఇమేజ్ మాత్రమే అంటున్నారు. ఆయన మంగళగిరి నుండి 91 వేలకు పైగా భారీ మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి విద్యా, ఐటీ శాఖల మంత్రిగా టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలక శక్తిగా ఉన్నారు. నిజం చెప్పాలంటే తెరవెనుక ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యం. మరో వైపు చూస్తే లోకేష్‌కు కార్పొరేట్, విద్యావంతుల వర్గాల్లో క్లాస్ ఇమేజ్ బలంగా ఉంది. అదే సమయం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోయే మాస్ ఇమేజ్ ఇంకా పూర్తిస్థాయిలో రాలేదని విశ్లేషణలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇంకా మంత్రిగా మాత్రమే ఉండటం అని అంటున్నారు.

సీఎం పవర్ అలాంటిది :

ఇక వైసీపీలో చూస్తే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైనా, నేటికీ ఆ పార్టీలో జగన్ తప్ప మరో పేరు వినిపించదు అలాగే . క్షేత్రస్థాయిలో పోటీ ఇప్పటికీ జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగానే ఉంది. దానికి జగన్ వర్సెస్ లోకేష్ గా మార్చాలంటే సీఎం హోదాలోకి లోకేష్ మారాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వచ్చే పాపులారిటీ, ప్రోటోకాల్ వేరు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకం పై సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఇంటా సీఎం ఎవరు అంటే ఆయన పేరే వినిపిస్తుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న ప్రజాదరణ కేవలం 16 శాతం మాత్రమే ఉంటే సీఎం అయిన తర్వాత తెలంగాణలోని ప్రతి పల్లెలో సీఎం అంటే రేవంత్ రెడ్డి అనే స్థాయికి ఆయన మాస్ ఇమేజ్ పెరిగింది అని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ అనే రాజకీయ వట వృక్షం నీడలో మంత్రిగా ఉండిపోవడం వల్ల కేటీఆర్‌కు ఇప్పటికీ సొంత మాస్ ఇమేజ్ రాలేదని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు . జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఇమేజ్ ప్రధాని పదవి చేపట్టని రాహుల్ గాంధీకి రాలేదని కూడా ఎత్తి చూపుతున్నారు.

ఎన్నికలకు ఏడాది ముందు :

ఈ నేపధ్యంలో లోకేష్ ని మాస్ ఇమేజ్ తో ఉన్న లీడర్ గా మార్చాలంటే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి అన్న చర్చగా ఉంది. 2029 ఎన్నికలకు కనీసం ఒక ఏడాది ముందుగానే నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని నందమూరి-నారా కుటుంబం నుండే కాకుండా పార్టీ అంతర్గత వర్గాల నుండి కూడా బలమైన ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంటే చివరి ఏడాది కాలం లోకేష్ సీఎం హోదాలో పథకాలను అమలు చేస్తూ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తే అది కూటమికి కొత్త ఇమేజ్ ఇవ్వడమే కాదు నారా లోకేష్ నాయకత్వం మీద ఆశను పెంచి మరోసారి కూటమిని అధికారంలోకి తెస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో 2029 ఎన్నికల నాటికి లోకేష్ పూర్తిస్థాయి మాస్ లీడర్‌గా అవతరిస్తారనేది టీడీపీ వ్యూహకర్తల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

చంద్రబాబు ఏం చేస్తారంటే :

మరి రాజకీయంగా దిగ్గజ నేత అయినా చంద్రబాబు మాజీ సీఎం గా ఖాళీగా ఉంటారా అంటే ఆయన కొడుకు భవిష్యత్తు కోసం ఒక అడుగు వెనక్కి వేయడానికి ఏ మాత్రం వెనుకాడరనే అంటున్నారు. ఇక లోకేష్ సీఎం అయితే, చంద్రబాబు కేవలం ఒక సాధారణ మంత్రిగానో లేదా ప్రభుత్వ సలహాదారుడిగానో ఉంటూ తెరవెనుక నుండి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కాకుండా 2029 జాతీయ రాజకీయాల్లో కనుక బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ రాకపోతే బాబు కింగ్ మేకర్‌గా మారి తన రాజకీయ చతురతతో ఏకంగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న దాకా కూడా ఈ రాజకీయ విశ్లేషణలు సాగుతునాయి. అందువల్ల చంద్రబాబు తన అనుభవంతో లోకేష్‌కు సీఎం అనే బ్రాండ్‌ను అందించి తాను జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తే అది టీడీపీకి నారా కుటుంబానికి ఒక అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ అవుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఈ చర్చ ఏ వైపునకు దారి తీస్తుందో.

Tags:    
  • naralokesh 
  • chandrababunaidu 
  • andhrapradeshpolitics 
  • tdp 
  • tdpalliance 

Similar News

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

Copyright @2026

Powered by Blink CMS